మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను కూడా కరోనా విడిచిపెట్టలేదు. అతడికి కరోనా సోకిందంటూ నిన్నంతా వార్తలు వచ్చాయి. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంతో, ఆ వార్తకు భారత్ లో కూడా పాపులారిటీ దక్కింది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఈరోజు ఆయన చనిపోయాడంటూ వార్తలు రావడం.
అవును.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో చనిపోయాడంటూ నేషనల్ మీడియా చెబుతోంది. దాదాపు సోషల్ మీడియా కూడా ఇదే చెబుతోంది. ఇందులో వాస్తవం ఎంతనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే దావూద్ ఇబ్రహీంకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా అందులో నిజం కంటే అబద్ధమే ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
1993 ముంబయి వరుస పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ పారిపోయాడు దావూద్ ఇబ్రహీం. అప్పట్నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. అతడు కరాచీలోనే ఉంటున్నాడనేది బహిరంగ రహస్యం. కానీ పాకిస్థాన్ ఆ విషయాన్ని ఒప్పుకోదు. అలా పాతికేళ్లుగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న దావూద్ ఇబ్రహీంను కరోనా బయటకు లాగింది.
ముందుగా దావూద్ భార్యకు కరోనా సోకింది. ఆమె ద్వారా ఇతడికి కూడా కరోనా సోకిందని చెబుతున్నారు. వారం రోజులుగా కరాచీలోని మిలట్రీ హాస్పిటల్ లో దావూద్ కు చికిత్స అందిస్తున్నారట. అక్కడే ఆయన మరణించినట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తున్నాడు. దావూద్ కరోనాతో చనిపోవడం మాట అటుంచి, అసలు దావూద్ ఇబ్రహీంకు కరోనానే సోకలేదని చెబుతున్నాడు అనీస్. ప్రస్తుతం దావూద్ కుటుంబం సేఫ్ గా ఒక చోటు ఉందని అంటున్నాడు. దావూద్ వ్యక్తిగత సిబ్బంది, అంగరక్షకులు మాత్రం క్వారంటైన్ లో ఉన్నట్టు చెబుతున్నాడు.
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు దావూద్. 2003లో దావూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది అమెరికా. అతడ్ని పట్టిస్తే 25 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రపంచంలోని టాప్-10 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా కొనసాగుతున్న దావూద్ కు.. పాకిస్థాన్ తో పాటు దాదాపు 15 దేశాల్లో వ్యాపారాలున్నాయి.
గృహమే లేకుండా ప్రజలతో గృహ ప్రవేశం చేయించిన ఘనుడు చంద్రబాబు