తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ కమిటి ఎన్నిక

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, నెలరోజుల పాటు ఉద్యోగాన్ని వదిలేసి అనేక గ్రామాలు తిరిగినట్లు నూతనంగా ఎన్నికైన వంశీరెడ్డి అన్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అమెరికన్…

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, నెలరోజుల పాటు ఉద్యోగాన్ని వదిలేసి అనేక గ్రామాలు తిరిగినట్లు నూతనంగా ఎన్నికైన వంశీరెడ్డి అన్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ 2021-2022 సంవత్సరానికి గాను నుతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

మోహన్ పట్లోళ్ళ అద్యక్షులుగా, వంశీరెడ్డి కంచరకుంట్ల ఎలెక్ట్ ప్రసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియోటెల్ నగరంలో ప్రముఖ తెలంగాణ సంస్థ వాషింగ్టన్ తెలంగాణ అసోషియేషన్ ఎలెక్ట్ ప్రసిడెంట్ వంశీరెడ్డిని ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్బంగా వాషింగ్టన్ తెలంగాణ అసోషియేషన్ అధ్యక్షులు రవీందర్ వీరవెల్లి మాట్లాడుతూ వంశీరెడ్డి కృషి, సేవా పట్ల వున్న దీక్ష వల్ల అతితక్కువ సమయంలో రీజినల్ వైస్ ప్రసిడెంట్ స్థాయి నుంచి ప్రసిడెంట్-ఎలెక్ట్ స్థాయికి చేరుకోగలిగారని అన్నారు. అనంతరం వంశీరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ లో తన ప్రస్థానాన్ని నెమరువేసుకున్నారు. 

తను బోర్డ్ ఆప్ డైరెక్టర్ గా వున్నప్పుడు టి టి ఏ సేవా దినోత్సవాల సందర్బంగా నెలకు పైగా రోజులు అమెరికాలో ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలేసి తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి, వాటిని నిషితంగా గమనించిన టిటిఏ అడ్వయిజరి కౌన్సల్ లోవున్న పైల మల్లారెడ్డి, విజయపాల్ రెడ్డి, హరనాద్ పొలిచెర్ల లు ఎగ్జిగ్యూటీవ్ ప్రసిడెంట్ గా నియమించడం జరిగిందని తెలిపారు. 

తాను ఎగ్జిగ్యూటీవ్ ప్రసిడెంట్ గా వున్న సమయంలో, సియోటెల్ లో నిర్వహించిన టిటిఏ జాతీయ బోర్డ్ సమావేశానికి ఆతిద్యమివ్వడమే కాకుండా, నిర్వహించిన విదానంపై అనేక ప్రశంసలు లబించినట్లు వివరించారు. అదే సమయంలో నిర్వహించిన సాంస్క్రతిక కార్యక్రమాలు అద్బుతంగా నిర్వహించినట్లు, ఆ సమావేశానికి హాజరైన పెద్దలు, ఆత్మీయులు కొనియాడడటం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని అన్నారు. 

ప్రపంచాన్ని కావిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పుడు, తన వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి పదిలక్షల విరాళాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా తన జన్మస్థలం వరంగల్ ఋణం తీర్చుకునేందుకు క్వాడ్రంట్ రిసోర్స్ గ్రూప్ అనే ఐటి సంస్థను స్థాపించి, తెలంగాణ యువతకు చేదోడు వాదోడుగా నిలిచినట్లు వంశీరెడ్డి చెప్పారు. 

ఇదిలా వుండగా వంశీరెడ్డి చేసిన కార్యక్రమాలు, ఎన్నికైన పదవులను టిటిఏ సభ్యులు తెలియజేశారు. టిటిఏ లో వంశీరెడ్డి చేరక ముందు సియోటెల్ లో అనేక తెలుగు సంస్థల్లో అద్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ సందర్బంగా వాషింగ్టన్ తెలంగాణ అసోషియేషన్ ను స్థాపించి, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఖ్యాతిని అమెరికాలో వెదజల్లారని తెలిపారు. అమెరికాలో ఎవరికి ఏకష్టం వచ్చినా నేనున్నాననే బరోసా కల్పిస్తూ, అండగా నిలిస్తున్నారని కొనియాడారు. 

ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఆపదలో వంశీరెడ్డి పేరునే మొదట తల్చుకుంటారని, జాతీయ స్థాయి టిటిఏ లో ప్రెసిడెంట్- ఎలెక్ట్ అయిన సందర్బంగా సియోటెల్ లో తెలుగు ప్రముఖులు, శ్రేయోబిలాషులు సన్మానించారు.  వంశీరెడ్డి తోపాటు సియోటెల్ నుంచి నవీన్ గోలి, నిక్షిప్తరెడ్డి కూర, గణేష్ యాదవ్, వీరమణి, మనోహర్ రావు బొడ్డు, అజయ్ రెడ్డి మాచ, శ్రీధర్ రెడ్డి చదువు, మాణిక్యం తుక్కారపు, సంగీత రెడ్డి బొర్ర, శ్రీధర్ రాజు ప్రతికంఠం, సురేష్ తాండ లను సైతం ఘణంగా సత్కరించారు. 

కార్యక్రమంలో బాస్కర్ గంగిపాముల, రాము పాలురి, సాయి కంచరకుంట్ల, గిరి దేవరాజు, దుష్యంత్ రెడ్డి, ప్రకాశ్ కొండూరు, వివేక్ బొగ్గారపు, చంద్రసేన శ్రీరామోజు, రవీందర్ రెడ్డి సాదు, సందీప్, చైతన్య తదితరులు పాల్గొని, ఎన్నికైన వారికి హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?