ఎట్టకేలకు తన ఎకౌంట్ వాడిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఎకౌంట్ ను పూర్తిగా పక్కనపెట్టారని, ఇలానే కొనసాగితే అతడి ఎకౌంట్ కు ఉన్న బ్లూ టిక్ మార్క్ ఎగిరిపోతుందంటూ గ్రేట్ ఆంధ్ర కొన్ని రోజుల కిందట కథనాన్నిచ్చింది.…

పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఎకౌంట్ ను పూర్తిగా పక్కనపెట్టారని, ఇలానే కొనసాగితే అతడి ఎకౌంట్ కు ఉన్న బ్లూ టిక్ మార్క్ ఎగిరిపోతుందంటూ గ్రేట్ ఆంధ్ర కొన్ని రోజుల కిందట కథనాన్నిచ్చింది. ఆగస్ట్ 24న ఆ కథనం ప్రచురితం కాగా.. రాత్రి పవన్ తన ఖాతాను వాడారు.

అప్పుడెప్పుడో మార్చి 29న తన పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమాన్ని, కొన్ని ఫొటోల్ని రీట్వీట్ చేశారు పవన్. అంతకంటే ముందు స్వామి వివేకానందకు నివాళులు అర్పిస్తూ మరో ట్వీట్ పెట్టారు. అంతే, ఆ తర్వాత పూర్తిగా తన ఖాతాను పక్కనపెట్టారు. అలా 5 నెలలుగా ఎలాంటి యాక్టివిటీ లేకుండా పడున్న తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను పవన్ మరోసారి వాడారు. స్టాలిన్ కు శుభాభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

గతంలో జనసేన పార్టీ కోసం పవన్ ప్రత్యేకంగా ఓ ట్విట్టర్ పేజీ పెట్టారు పవన్. దీంతో రాజకీయాలకు ఆ పేజీని, తన వ్యక్తిగత విశేషాలు, సినిమా అప్ డేట్స్ కోసం వ్యక్తిగత పేజీని పవన్ ఉపయోగిస్తారని అంతా అనుకున్నారు. కానీ పవన్ తన ఖాతాను పూర్తిగా పక్కనపడేశారు. చివరికి సొంత అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా వ్యక్తిగత ఎకౌంట్ నుంచి ట్వీట్ చేయలేదు పవన్.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఖాతాకు 4.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, జనసేన అకౌంట్ కి కేవలం 1.4మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అంటే ఎక్కువమందికి విషయం చేరవేయాలంటే పవన్ తన పర్సనల్ అకౌంట్ నే వాడాల్సి ఉంటుంది. కానీ ఆయన దానికి దూరం జరిగారు. ప్రజా జీవితంలోకి వచ్చాక పర్సనల్ అకౌంట్లు వద్దు అనుకుంటున్నారు పవన్. అందుకే ఆయన తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ కి గుడ్ బై చెప్పేస్తారని అంతా అనుకున్నారు.

కానీ 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ మరోసారి తన వ్యక్తిగత ఖాతాను వాడారు. నిజానికి స్టాలిన్ పై పెట్టిన ఆ పోస్ట్ ను పవన్ తన జనసేన ఖాతాలో వేసుకోవచ్చు. అందులో ఎలాంటి రాజకీయాల్లేవు. కానీ కేవలం వ్యక్తిగత ఖాతాను యాక్టివ్ గా ఉంచేందుకే స్టాలిన్ పోస్ట్ ను ఇందులో పెట్టినట్టు అర్థమౌతోంది.