Advertisement

Advertisement


Home > Politics - Gossip

23న వచ్చే ఫలితాలనైనా నమ్మొచ్చా చంద్రబాబూ.?

23న వచ్చే ఫలితాలనైనా నమ్మొచ్చా చంద్రబాబూ.?

మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు, అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన దరిమిలా, మే 23న వెల్లడయ్యే ఫలితాలతో రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ కొత్త ప్రభుత్వం మళ్ళీ తమదేనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఆ ఛాన్సేలేదని చాలా ముందస్తు సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. ప్రస్తుత ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, గెలుపు మీద పూర్తి ధీమాతో వుంది. 'మార్పు మొదలైంది' అంటూ జనసేన పార్టీ ఏవో కథలు చెబుతోంది.

ఇక, మార్చి 23 సంగతి తర్వాత, మార్చి 19 తర్వాత పార్టీ నేతల్ని ఎలా బుజ్జగించాలో తెలియక చంద్రబాబు ఆల్రెడీ తలపట్టుక్కూర్చున్నారు. ఎగ్జిట్‌ ఫలితాలు ఆ రోజు షురూ అవుతాయి. 'ఎగ్జిట్‌ ఫలితాల్ని నమ్మొద్దు' అంటూ ఇప్పటికే చంద్రబాబు, పార్టీ నేతలకు హితబోధ చేశారు. అవి ఎలాగూ తమకు వ్యతిరేకంగా వస్తాయన్నది ఆయనగారి ఉవాచ. ముందస్తు సర్వే ఫలితాలకు భిన్నంగా ఎగ్జిట్‌ ఫలితాలు వుండే అవకాశమే లేదని చంద్రబాబుకీ తెలుసు. అన్నిటికీ మించి వాస్తవమేంటో ఆయనకి ఇంకా బాగాతెలుసు.

ఎగ్జిట్‌ పోల్స్‌ టెన్షన్‌ కారణంగానే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జరగాల్సిన సమీక్షల్ని చంద్రబాబు పక్కన పడేశారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేయాలి కాబట్టి.. అంటూ 'వంక' పెట్టారుగానీ, పార్టీ ముఖ్యనేతల మీద ఆల్రెడీ నిఘాపెట్టిన చంద్రబాబు, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల తర్వాత ఎవరూ పార్టీ నుంచి పారిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పోనీ, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల విషయంలోనూ పార్టీ నేతల్ని చంద్రబాబు మభ్యపెట్టగలుగుతారనే అనుకుందాం.!

మే 23న వెల్లడవబోయే ఫలితాల సంగతేంటి.? ఆ తర్వాత టీడీపీని వీడేవారిని చంద్రబాబు కంట్రోల్‌ చేయగలిగే పరిస్థితులు వుంటాయా.? లేదా.? ఛాన్సేలేదు.. చంద్రబాబుకి అంత సీన్‌ వుండకపోవచ్చు. ఆల్రెడీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల మీదా, ఎన్నికల కమిషన్‌ మీదా ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఆరోపణలు చేసేసివుంది చంద్రబాబు అండ్‌ టీమ్‌. అప్పుడు కౌంటింగ్‌ మీద కూడా అనుమానాలు షురూ చేస్తుందంతే. 'ఈ ఫలితాల్ని విశ్వసించాల్సిన అవసరం లేదు.. మన పోరాటం కొనసాగుతుంది' అని అప్పుడూ చంద్రబాబు పార్టీనేతల్ని మభ్యపెట్టేందుకు తన ప్రయత్నాలు తాను కొనసాగించనుండడం ఖాయం.  

సెక్స్ కు మనిషిని దూరం చేస్తున్న ఇంటర్నెట్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?