Advertisement

Advertisement


Home > Politics - Gossip

లోలోన తవ్వుకున్న గోతులెన్నో మరి?

లోలోన తవ్వుకున్న గోతులెన్నో మరి?

చంద్రబాబునాయుడుకు ఎన్నికల తర్వాత ఇది ఝలక్ అనుకోవాలి. రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకటి వంతున వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబుకు.. పార్టీలో ఒకరి వెనుక ఒకరు ఎలా గోతులు తవ్వుకున్నారో.. బహుశా తన సొంత పచ్చతమ్ముళ్ల మాటల్లోనే బోధపడి ఉండాలి. కర్నూలు, నంద్యాల నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా.. అనేకమంది అభ్యర్థులు.. తమకు పార్టీ నాయకులే చేటు చేసేందుకు ప్రయత్నించారంటూ అధినేతకు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు ప్రతి సమావేశంలోనూ మనమే గెలిచేస్తున్నాం అని కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. అయితే సోమవారం జరిగిన ఈ సమావేశం తీరును గమనిస్తే మాత్రం.. పార్టీలో అధైర్యం ఎంతగా ఉన్నదో తెలిసిపోతుంది. తమ పార్టీ నాయకులే, తమ ఓటమికి కుట్రలు చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. పనిచేయని వారిపై చర్యలుంటాయంటూ చంద్రబాబు ఏదో వారికి సర్దిచెప్పారు.

అయితే.. విషయం ఏంటంటే, కర్నూలు- నంద్యాల నాయకులు గనుక వెరపులేకుండా.. పార్టీకి ఎలా చేటు జరిగిందో నాయకుడి ముందు స్పష్టంగా చెప్పారు. అదే ఇతర ప్రాంతాలనుంచి అనేక నియోజకవర్గాల నాయకులు బయటకు చెప్పలేని స్థితిలోనే ఉన్నారు. ఏతావతా పార్టీలోనే జరుగుతున్న చర్చ ఏంటంటే... దాదాపుగా అన్ని ఇతర ప్రాంతాల్లోనూ పార్టీ అభ్యర్థుల ఓటమికి లోలోపల గోతులు తవ్విన ఘనులు చాలామందే ఉన్నారని!

అయితే రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్రం మీద నిఘా ఉంచి సమస్తం తెలుసుకుంటున్నానని అంటుండే చంద్రబాబుకు... పార్టీకి గోతులు తవ్విన వారి గురించి ఎరుకేనా? అని అనుకుంటున్నారు. చంద్రబాబు తనకు ఓటమి తథ్యమనే అనుమానంతో.. ఈసీ మీద, ఈవీఎంల మీద నెపం వేయడానికి తంటాలు పడుతున్నారు గానీ.. వాస్తవంలో సొంత పార్టీ ఓటమికి కృషిచేసిన వారు ఆయన చుట్టూతానే చాలామంది ఉన్నారని, అలాంటి పరిస్థితిని చక్కదిద్దలేని.. వైకాపా నాయకుల్ని ఫిరాయింపజేసి పార్టీలో చేర్చుకున్న తర్వాత పుట్టిన అసంతృప్తుల్ని చక్కదిద్దలేని వైఫల్యమే కారణం కావచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?