విలేకరుల తాట తీస్తానంటున్న బొజ్జల!

బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, రెండో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచారు సుధీర్ రెడ్డి. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి తన కెరీర్ ను పదిలంగా కాపాడుకోవడం గురించి శ్రద్ధ పెట్టాలి.…

బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, రెండో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచారు సుధీర్ రెడ్డి. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి తన కెరీర్ ను పదిలంగా కాపాడుకోవడం గురించి శ్రద్ధ పెట్టాలి. అందరి సలహాలు తీసుకుంటూ తనను తాను మంచి నాయకుడిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. కానీ బొజ్జల సుధీర్ రెడ్డి తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చి నిండా మూడు నెలలు కూడా గడవకమునుపే.. నియోజకవర్గంలో వసూళ్ల దందాలను ప్రారంభించిన ఏంఎల్ఏ వాటిని ఎవరైనా వేలెత్తి చూపితే మాత్రం సహించలేకపోతున్నారు. విలేకరులను కూడా తాటతీస్తానని బెదిరిస్తున్నారు.

సాక్షి విలేఖరులు కడుపు మండి ఆయన మీదే నెగటివ్ రాసి ఉంటారని, అందుకు తగ్గట్టుగా ఆయన స్పందించి ఉంటారని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అనునిత్యం తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ ఉండే ఈనాడు దినపత్రిక విలేఖరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ విశేషం.

సుధీర్ తండ్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినా కూడా విలేకరుల పట్ల ఎన్నడూ దురుసుగా మాట్లాడిన సందర్భాలు లేవు. అలాంటిది తన నియోజకవర్గ పరిధిలో నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను గురించి ఈనాడు దినపత్రికలో వార్త రాసినందుకు, సుధీర్ రెడ్డి విలేకరి కి ఫోను చేయించి తాటతీస్తానంటూ బెదిరించడం జరిగింది.

ఉచిత ఇసుక విధానం తీసుకువస్తున్నానంటూ చంద్రబాబు నాయుడు చాలా ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉచిత ఇసుక పంపిణీ విషయంలో ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు ఎవరూ జోక్యం చేసుకోవద్దు అని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇసుక అమ్మకాలలో నాయకులు జోక్యం చేసుకోవడం వలన ఎంతగా చెడ్డ పేరు వచ్చిందో ఆయనకు తెలుసుగనుక.. ముందు జాగ్రత్తగా పార్టీ నేతలను హెచ్చరించారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండల ప్రాంతాలలో కొందరు స్థానిక నాయకులు ట్రాక్టర్కు 500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఈనాడులో వార్తలు వచ్చాయి. ఇదే విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినా సరే అలాంటి అక్రమాలను సరిదిద్దేందుకు ఆయన ప్రయత్నించే వారేమో! అయితే స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానిక నాయకులు చేస్తున్న వసూళ్ల పర్వంలో ఆయనకు కూడా వాటా ఉన్నదేమో అని సందేహాలు కలిగేలాగా.. వార్త రాసిన విలేకరి మీదనే రెచ్చిపోయారు.

“నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాటతీస్తా. ఏం అనుకుంటున్నావు.. ఇదే నీకు చివరి హెచ్చరిక.. వైసీపీ పాలనలో కనబడలేదా.. ఇప్పుడే అన్నీ గుర్తుకు వచ్చాయా.. ఒళ్ళు దగ్గర పెట్టుకో.. ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు.. నీ కథ ముగిసినట్టే” అంటూ ఎమ్మెల్యే బెదిరించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. విలేకరి చెప్పబోయిన మాటలను కూడా వినిపించుకోకుండా సుధీర్ రెడ్డి రెచ్చిపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా ఉంది.

11 Replies to “విలేకరుల తాట తీస్తానంటున్న బొజ్జల!”

  1. అతను అన్న దానిని ఈనాడు లో నేరుగా రాశారు.

    ప్యాలస్ పులకేశి టైమ్ లో యాక్ చీ పేపర్ లో మాత్రం తమ పార్టీ వాళ్ళ అరాచకాలు గురించి రాయలేదు

Comments are closed.