కిడ్నాప్‌పై బాబు సీరియ‌స్‌.. సొంత ఎమ్మెల్యే భ‌ర్త‌పై కేసు!

ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయిన‌ప్ప‌టికీ, ఆ వివ‌రాల‌ను పోలీసులు బ‌య‌టికి తెలియ‌నివ్వ‌డం లేదు.

వైసీపీ హ‌యాంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని, త‌మ‌ను గెలిపిస్తే రామ‌రాజ్యం తీసుకొస్తామ‌ని కూట‌మి నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. వైసీపీ నేత‌ల దాడుల‌కు భ‌య‌ప‌డి పారిశ్రామిక‌వేత్త‌లు పారిపోతున్నార‌ని, ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదంటూ కూట‌మి నేత‌లు ఊద‌ర‌గొట్టారు. ఈ ద‌ఫా త‌మ‌ను గెలిపిస్తే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రెడ్‌కార్పెట్ ప‌రుస్తామ‌ని, శాంతియుత వాతావ‌ర‌ణంలో ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని న‌మ్మ‌బ‌లికారు.

కూట‌మికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. అయితే క్షేత్ర‌స్థాయిలో పారిశ్రామిక‌వేత్త‌ల అనుభ‌వాలు వేరుగా ఉన్నాయి. క‌మీష‌న్ల కోసం కూట‌మి నేత‌లు ముందూ, వెనుకా ఆలోచించ‌కుండా, సొంత‌ నేత‌ల కంపెనీల ఉద్యోగుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడికి చెందిన రిత్విక్ కంపెనీ ఉద్యోగుల‌పై దాడి, అలాగే ప‌నుల అడ్డగింత‌ గురించి అంద‌రికీ తెలిసిందే. ఇది మ‌చ్చుకు ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో షిర్డీసాయి కంపెనీ ఉద్యోగి బాబూరావుతో పాటు మ‌రికొంద‌ర్ని కిడ్నాప్ చేశారు. వీళ్ల‌లో కంపెనీ వ్య‌వ‌హారాల్ని చూసే బాబూరావును చిత‌క్కొట్ట‌డంపై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది. దీంతో కిడ్నాప్‌న‌కు పాల్ప‌డ్డ సొంత పార్టీ ఎమ్మెల్యే భ‌ర్త‌పై ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయించిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

నంద్యాల జిల్లాలో వెయ్యి కోట్ల విద్యుత్ ప‌నుల్ని షిర్డీసాయి కంపెనీ ద‌క్కించుకుంది. ఇందులో భాగంగా ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ మండ‌లం న‌ల్ల‌గట్ల‌లో ప్ర‌త్యేక విద్యుత్ లైన్ ప‌నుల్ని చేప‌ట్టారు. అధికార పార్టీకి చెందిన త‌మ అనుమ‌తి లేకుండా ప‌నులు చేయ‌డంపై ప్ర‌జాప్ర‌తినిధి భ‌ర్త బెదిరింపుల‌కు దిగిన‌ట్టు తెలిసింది. 20 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌కుండా, ప‌నులు చేయ‌లేర‌ని కంపెనీ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే క‌మీష‌న్ ఇవ్వ‌డానికి కంపెనీ యాజ‌మాన్యం నిరాక‌రించింది. దీంతో కిడ్నాప్ చేయ‌డంలో అనుభ‌వం ఉన్న టీడీపీ బ్యాచ్‌… కంపెనీ ఉద్యోగి బాబూరావుతో పాటు మ‌రో ముగ్గురు సిబ్బందిని వాహ‌నంలో కిడ్నాప్ చేసుకుని ఒక ప్ర‌జాప్ర‌తినిధి ఇంటికి తీసుకెళ్లిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా బాబూరావును బాగా కొట్టారు. త‌మ ఉద్యోగుల్ని కిడ్నాప్ చేసి, చిత‌క్కొట్ట‌డంపై నంద్యాల ఎస్పీకి షిర్డీ సాయి ఎల‌క్ట్రిక‌ల్ కంపెనీ యాజ‌మాన్యం ఫిర్యాదు చేసింది. ఎస్సీ జోక్యం చేసుకుని, స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధికి ఫోన్ చేసి హెచ్చ‌రించ‌డంతో ఎట్ట‌కేల‌కు విడిచిపెట్టారని తెలిసింది.

అయితే ఈ భ‌యాన‌క‌ వాతావ‌ర‌ణంలో తాము ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేయ‌లేమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి షిర్డీసాయి యాజ‌మాన్యం ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది. గ‌త మూడు రోజులుగా సాగుతున్న ఈ ఎపిసోడ్‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌గా స్పందించి, వెంట‌నే కిడ్నాప్‌న‌కు పాల్ప‌డ్డ ఎమ్మెల్యే భ‌ర్త‌పై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఆళ్ల‌గ‌డ్డ రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయిన‌ప్ప‌టికీ, ఆ వివ‌రాల‌ను పోలీసులు బ‌య‌టికి తెలియ‌నివ్వ‌డం లేదు. అయితే అరెస్ట్ చేస్తార‌నే భ‌యంతో ఎమ్మెల్యే దంప‌తులు ఎక్క‌డికో వెళ్లార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

21 Replies to “కిడ్నాప్‌పై బాబు సీరియ‌స్‌.. సొంత ఎమ్మెల్యే భ‌ర్త‌పై కేసు!”

  1. ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. షిరిడి సాయి కంపెనీ.. మన జగన్ రెడ్డి తొత్తుల కంపెనీ నే కదా..

    దీన్నే స్వేచ్ఛ అంటారు..

    జగన్ రెడ్డి జనాలు కూడా ధైర్యం గా వ్యాపారాలు చేసుకొంటున్నారు.. ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్ గా సీఎం కి కంప్లైంట్ చేస్తున్నారు..

    ..

    మరి మన జగన్ రెడ్డి..

    టీడీపీ ఎంపీ అనే ఒకే ఒక కారణం తో.. అమరరాజా ని తరిమేశాడు..

    ..

    నువెన్ని కూసినా .. జగన్ రెడ్డి నిరంకుశపాలన తో జనాలు విసిగెత్తిపోయారు.. ఇక వాడు ఎప్పటికీ గెలవలేడు..

    1. Shiridi sai company started in 1992 . it is 200 mil revenue company .

      LOL Shiridi sai donated 40 cr electroal bonds to the TDP gov . ha ha . not even a single RS to the YCP gov . 2019 nunchi ide rotta story .

    2. shridi sai electrical company started in 1992 and 200 mil revenue company .

      TDP received 40 cr electoral bonds from the same company Lol. YCP had not recieved single RS form the same company .

      TDP allotted many tenders in 2024-2019 . also after 2024 they got many many projects lol .

    3. shridi sai electricals started in 1992 and it is 200 m revenue compeny .

      TDP got 40 cr from same company through electoral bonds . in 2014-19 and after 2024 same company got many projects from TDP gov . stop doing fake propaganda lol ha ha

      1. అయ్యా.. రంజితం..

        నా చేతిలో ఇప్పటికే చాలాసార్లు ఎర్రిపూకువి అయిపోయావు..

        ఇంకా సిగ్గు లేకుండా సొల్లు చెపుతున్నావు..

        నీలాంటి పనికిమాన కామెంట్స్ పెట్టె వాళ్లకు .. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండే అవసరం నాకు లేదు..

        నీకు తోచింది రాసుకో.. హ.. హ.. హా..

          1. అయ్యా.. రంజితం..

            నా చేతిలో ఇప్పటికే చాలాసార్లు ఎర్రిపూకువి అయిపోయావు..

            ఇంకా సిగ్గు లేకుండా సొల్లు చెపుతున్నావు..

            నీలాంటి పనికిమాన కామెంట్స్ పెట్టె వాళ్లకు .. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండే అవసరం నాకు లేదు..

            నీకు తోచింది రాసుకో.. హ.. హ.. హా..

  3. కమిషన్ అడిగితేనే సొంత party MLA మీదే కేసు పెట్టె ‘దమ్ము దైర్యం చంద్రబాబు కి ఉంది కానీ, A1 ఐటమ్ గాడు సొంత చిన్నాన్న ని ‘నరికి చ0పినా కేసు వద్దన్నాడు.. ఇది కదా కావాల్సింది.

  4. కమిషన్ అడిగితేనే సొంత party MLA మీదే ‘కేసు పెట్టె ‘దమ్ము దైర్యం చంద్రబాబు కి ఉంది కానీ, A1 ఐటమ్ గాడు సొంత చిన్నాన్న ని ‘నరికి చ0పినా కే’సు వద్దన్నాడు.. ఇది కదా కావాల్సింది.

  5. ఏమి రాస్తున్నావు? సనాతనం లో ఇలాంటివి ఉండవు. “బాబు” రావు ఎప్పుడు కార్ ఎక్కలేదుట.

    ఆ కోరిక తీర్చడం తప్పేలా అవుతుంది? ఇలాంటి దుష్ప్రచారం ఖండించాలి.

Comments are closed.