వేమిరెడ్డి కంపెనీలో చేరిన ధ‌ర్మారెడ్డి?

వేమిరెడ్డి వ్యాపారాల స‌ల‌హాదారునిగా ధ‌ర్మారెడ్డి చేరి, కూట‌మి ప్ర‌భుత్వం నుంచి ర‌క్ష‌ణ పొందే ఎత్తుగ‌డ

టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డికి చెందిన వ్యాపార కంపెనీలో టీటీడీ మాజీ ఉన్న‌తోద్యోగి ఏవీ ధ‌ర్మారెడ్డి చేరిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. రెండు నెల‌ల క్రితం ఆయ‌న వేమిరెడ్డి కంపెనీలో స‌ల‌హాదారుగా చేరిన‌ట్టు తెలిసింది. అందుకే తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్పద ఆరోప‌ణ‌లు చేసినా, ధ‌ర్మారెడ్డి మాత్రం నోరు తెర‌వ‌లేదనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

తిరుమ‌ల‌లో వేంక‌టేశ్వ‌ర‌స్వామి త‌ర్వాత‌, తానే శ‌క్తిమంతుడ‌నే లెవెల్‌లో ధ‌ర్మారెడ్డి అధికారాన్ని చెలాయించారు. ముఖ్యంగా ఆయ‌న తీరుపై వైసీపీ నాయ‌కులే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని, ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే అహంకార ధోర‌ణితో ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ధ‌ర్మారెడ్డి తీరుతో వైసీపీ రాజ‌కీయంగా చాలా న‌ష్ట‌పోయింద‌న్న‌ది వాస్త‌వం.

టీటీడీ ఇన్‌చార్జ్ ఈవోగా ధ‌ర్మారెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న స‌మ‌యంలోనే వేమిరెడ్డి ప్ర‌శాంతి టీటీడీ స‌భ్యురాలిగా, అలాగే ఢిల్లీ స్థానిక టీటీడీ సంఘాల బాధ్యురాలిగా వ్య‌వ‌హ‌రించారు. అప్పుడ‌ప్పుడు వేమిరెడ్డి దంపతుల్ని కూడా ధ‌ర్మారెడ్డి ఇబ్బంది పెట్టిన‌ప్ప‌టికీ, వాళ్లు లైట్‌గా తీసుకున్న‌ట్టు చెబుతున్నారు.

ధ‌ర్మారెడ్డిని ఎలాగైనా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌ట్టుద‌ల‌తో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇబ్బందుల్లో ప‌డ‌కుండా వుండేందుకు వేమిరెడ్డి దంప‌తుల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని తెలివిగా వాడుకున్న‌ట్టు చెబుతున్నారు.

వేమిరెడ్డి వ్యాపారాల స‌ల‌హాదారునిగా ధ‌ర్మారెడ్డి చేరి, కూట‌మి ప్ర‌భుత్వం నుంచి ర‌క్ష‌ణ పొందే ఎత్తుగ‌డ వేశారు. కూట‌మి ప్ర‌భుత్వం వేమిరెడ్డి దంప‌తుల‌కు చాలా విలువ ఇస్తోంది. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి దంప‌తుల‌ను అడ్డుపెట్టుకుని రెడ్ల‌ను శాశ్వ‌తంగా త‌మ వైపు వుండేలా టీడీపీ వ్యూహం ర‌చించిన‌ట్టు చెబుతున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో కొండ‌పై ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన ధ‌ర్మారెడ్డి, ఇప్పుడు నోరు మెద‌ప‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఇటీవ‌ల ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే ధ‌ర్మారెడ్డి ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నించారు. ఇదే ధ‌ర్మారెడ్డి ఐదేళ్ల క్రితం టీటీడీలో డైమండ్ పోయింద‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించిన‌ప్పుడు, అదంతా అబ‌ద్ధ‌మ‌ని కేంద్ర హోంశాఖ ఉద్యోగిగా ధ‌ర్మారెడ్డి ఘాటుగా స్పందించారు.

కానీ త‌న హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని కూట‌మి నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నా, ధ‌ర్మారెడ్డి మాత్రం స్పందించ‌క‌పోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ప‌ద‌వులు ఎలాంటి వాళ్ల‌కు ఇవ్వాలో ధ‌ర్మారెడ్డి ఎపిసోడ్ అతిపెద్ద గుణ‌పాఠం అని వైసీపీ నేత‌లే చెబుతుండ‌డం విశేషం. ధ‌ర్మారెడ్డి లాంటి వాళ్ల‌ను కొండ‌పై శ్రీ‌వారి సేవ‌కు నియ‌మించిన జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం కాకుండా, ఘ‌న విజ‌యం ఎలా ద‌క్కుతుంద‌నే అస‌హ‌న కామెంట్స్ వైసీపీ నేత‌ల నుంచే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

10 Replies to “వేమిరెడ్డి కంపెనీలో చేరిన ధ‌ర్మారెడ్డి?”

  1. ఎవడ్రా ఎడిటర్…కొంచం చూసుకోవాలి కదా..వేమి రెడ్డి ఇప్పుడు లోక సభ సభ్యుడు. పోనీ రాజ్యసభ అని రాసావ్. అప్పుడు వైసీపీ సభ్యుడు కానీ టీడీపీ ఎలా అవుతాడురా జోకర్

  2. డైమండ్ కథ సుద్ద అబద్దం కాబట్టి అబద్దం అని చెప్పాడు… కల్తీ నిజం కాబట్టి కాదని చెప్పలేదు…. నువ్వెందుకు ఆయాసం పడుతున్నావు ఎంగేట్రేడ్డి…

  3. నీ ఆయాసం కాకపొతే నిజాన్ని ఒప్పుకొన్నాడు అబద్దాన్ని కాదన్నాడు… నువ్వు ఎన్ని పేరాలు రాసినా మన జలకం ని ఆంధ్ర జనాలు నమ్మరు… నువ్వు కూడ గమ్మున కొత్త పార్టీ ని వెతుక్కో భయ్యా

Comments are closed.