Vettaiyan Review: సినిమా రివ్యూ: వేట్టయన్- ది హంటర్

ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే పెద్దగా నిరాశపరచని చిత్రం.

చిత్రం: వేట్టయన్
రేటింగ్: 2.5/5
తారాగణం: రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
కెమెరా: కదిర్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: టీ. జే. జ్ఞానవేల్
విడుదల తేదీ: 10 అక్టోబర్ 2024

టైటిల్ అర్ధమైనా అర్ధం కాకపోయినా రజనీకాంత్ సినిమా అంటే చాలు ఒక తరం ప్రేక్షకులకి ఆసక్తి మెండు. పైగా “జైలర్” లాంటి మాస్ హిట్ తర్వాత రజనీ సినిమా అనేటప్పటికి ఈ తరం ప్రేక్షకులకి కూడా ఆసక్తే. దానికితోడు “మనసిలాయో” పాట ట్రెండయ్ హిట్టయ్యింది. ట్రైలర్ చూస్తే అన్ని మసాలాలు ఉన్న మాస్ స్టార్ హీరో ఫిల్మ్ అని అర్ధమవుతూనే ఉంది. ఈ పండక్కి తొలి పెద్ద సినిమాగా వచ్చిన ఈ “వేట్టయన్” అనబడే అరవ వేటగాడు తెలుగు తెరపై ఏ మేరకు వేటాడాడో చూద్దాం.

శరణ్య (దుషార విజయన్) ఒక ప్రభుత్వ పాఠశాల టీచర్. ఆమెని ఒకడు రేప్ చేసి చంపేస్తాడు. అతడెవరో దొరకడు. పట్టుకోవడానికి నానా తిప్పలు పడ్డాక ఆ కేస్ ని ఎస్పీ అతియన్ (రజనీకాంత్) కి అప్పగిస్తుంది డిపార్ట్మెంట్. అతియన్ తో పాటు తన టీం (కిషోర్, రితికా సింగ్) ఆ కేసుని ఛేదించి ఒకడిని పట్టుకుని నాటకీయ పరిణామంలో ఎన్-కౌంటర్ చేస్తారు. ఆ తర్వాత అసలు విషయం తెలుస్తుంది అతియన్ కి. తాను చంపింది రాంగ్ పర్సన్ ని అని. మరి అసలు హంతకుడెవరు? మోటివ్ ఏవిటి? ఇదే తక్కిన కథ.

ఈ చిత్రకథ సమకాలీన సమాజంలోని కొన్ని ప్రశ్నలకి నిలువుటద్దం. పోలీసుల తొందరపాటు వల్ల, మీడియా అత్యుత్సాహం వల్ల కొందరికి తీవ్ర నేరస్థులుగా ముద్ర పడొచ్చు. అలాంటివాళ్ళని నడిరోడ్డుమీద కాల్చిపారేయాలని జనం కోరుకోవడం కూడా సహజం. ఆ సందర్భాల్లో కొన్ని సార్లు ఎంకౌంటర్లు జరుగుతుంటాయి. జనం హర్షించడం కూడా జరుగుతుంటుంది.అయితే ఆ ఎన్-కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే ప్రశ్నకి సమాధానం ఈ చిత్ర.

“జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్” అనేది అందరికీ తెలిసిందే.. దానికి కొనసాగింపుగా “జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్” అనే వాక్యం మీద ఈ కథ రాసుకోవడం జరిగింది.

సమస్య కథలో లేదు, కథనంలో మాత్రం ఉంది. తెర మీద పెద్ద తలకాయల్ని పెట్టుకున్నా, కథనంలో మాత్రం పెద్దగా తలపెట్టినట్టు అనిపించలేదు.

సగటు ప్రేక్షకుడికి సినిమా అనుభూతి కల్గించాలంటే కేవలం కథ చెప్తే సరిపోదు… నేటి ప్రమాణాలకి తగ్గట్టుగా కథనం పండాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం జరగాలి. ఏ పాత్రల మీద ఎంత జాలి కలగాలో, ఏ పాత్ర మీద ఎంత అసహ్యం కలగాలో అంతా కలిగేట్టు కథనాన్ని, సన్నివేశాల్ని రాసుకోవాలి.

టీచర్ పాత్ర చనిపోతున్నప్పుడు నేరాలు ఘోరాలు రీ-క్రియేషన్ వీడియో చూస్తున్నట్టు ఉంది తప్ప బలమైన భావోద్వేగం మనసుని తాకలేదు. దానికి కారణం ఆమె ఉద్యమంలోని డెప్త్ అందలేదు.

తర్వాత ట్విస్టులు.. అవీ బాగానే ఉన్నా, ఒక్కొ పాత్ర రివీల్ అవుతున్నప్పుడు కలగాల్సినంత ఉత్కంఠ కలగలేదు. మరీ ముఖ్యంగా విలన్ పాత్రపై విపరీతమైన అసహ్యం కలగాలి, ఆ పాత్ర సరైన విధంగా ముగియాలి… అది జరగలేదు. ప్రధానమైన మైనస్సులైతే ఇవే.

ఈ మైనస్సులపై కనుక వర్క్ చేసి స్థాయి పెంచి తీసినట్టైతే కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ చిత్రం అయ్యుండేది. “పేదవాడినైతే ఎన్-కౌంటర్ చేస్తారు.. డబ్బున్న వాడిని చేయరు” అనే పాయింటులో అంతటి పొటెన్షియల్ ఉంది. కానీ అదేంటో… ఈ పాయింటుని ఎంచుకున్న దర్శకుడు కూడా ఈ చిత్రంలో అదే చేయడం ఇక్కడ మరో మైనస్.

ఇక ప్లస్సులు మాట్లాడుకోవాలంటే రజనీకాంత్ స్టైల్, బాడీ లాంగ్వేజ్. అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడాయన. “గురి పెడితే ఎర పడాల్సిందే” అనే మాస్ లైనర్ పెట్టారు ఆ పాత్రకి. ఈ డైలాగ్ ని “గురి పెడితే సొర పడాల్సిందే” అని పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే దేన్నైనా వేటాడడానికి వాడేది “ఎర”; వేట కాబడేది కాదు కదా!

మంజు వారియర్ ఈ చిత్రంలోని “మనసిలాయో” పాట ద్వారా ఆన్లైన్ లో ఆల్రెడీ పాపులరయింది. అది తప్ప ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఏమీ లేదు. రజనీకాంత్ భార్యగా కనిపిస్తుంది. సెకండాఫులో ఒక చిన్న మాస్ ట్విస్ట్ ఇస్తుంది.

అమితాబ్ బచ్చన్ ది హుందా అయిన పాత్ర. ఆయన ఇమేజ్ కి తగ్గట్టు, రజనీకాంత్ కి కన్నుతెరిపించే పాత్ర. మంచి డయలాగ్స్ కూడా ఉన్నాయి ఆయనకి.

ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ ఇంటరెస్టింగ్ గా, టచింగ్ గా ఉంది.

రానా దగ్గుబాటి సెకండాఫులో వస్తాడు. చేసినంత వరకు బాగానే చేసినా క్యారక్టర్లో డెప్త్ కనపడలేదు.

రితికా సింగ్, రావు రమేష్, అతిధి పాత్రలో కృష్ణుడు, కాప్ గా కన్నడ నటుడు కిషోర్ ఓకే.

సాంకేతికంగా చూస్తే “మనసిలాయో” తప్ప మరొక పాటేమీ ప్రత్యేకంగా కనపడలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అవ్వలేదు. రొటీన్ గా కొట్టుకుంటూ వెళ్లిపోయినట్టుంది. కెమెరా, ఎడిటింగ్ లాంటి ఇతర అంశాలు ఓకే.

లోపమల్లా పైన చెప్పుకున్నట్టు కథనంలోనే. ఇంటర్వల్ ముందు 15 నిమిషాల వరకు చాలా బోరింగ్ గా సాగుతుంది. ఆ నిడివిని కాస్త తగ్గించి, మిగిలిన దాన్ని సెకండాఫ్ కథనాన్ని ఇంకాస్త బలంగా చెప్పడానికి వాడుకుని ఉంటే బాగుండేది.

ఇంటర్వల్ బ్లాక్ ఆసక్తిగా ఉంది. ఆ 15 నిమిషాల బ్లాక్ వల్ల ప్రధమార్ధం మొత్తం బాగున్న ఫీలింగొస్తుంది, అది నిజం కాకపోయినా. సెకండాఫులో కథ బాగున్నా పైన చెప్పుకున్నట్టు బలమైన సీన్లు రాసుకోవడంలో కాస్త వెనకపడింది టీం.

ఏదో జంక్ కథగా కాకుండా “బడ్స్ యాక్ట్” గురించి చెప్పడం, “జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్” అనే లైన్ ఎత్తుకోవడం.. కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

అయితే చాలా చోట్ల డాక్యుమెంటరీ స్థాయి సీన్లు కనిపిస్తుంటాయి. మనం చూస్తున్నది రజనీ, అమితాబ్ లాంటి నటులున్న కమర్షియల్ సినిమాయేనా అనే అనుమానాలు కలుగుతాయి. అలాగని అదే పంథాలో వేళ్లిందా అంటే కాదు… ఫక్తు మాస్ ఎలిమెంట్స్, బిల్డప్పులు, ఫైట్లు కూడా ఉన్నాయి.

“వేట్టయన్” అంటే అర్ధమేంటి అనే ప్రశ్నకి “ది హంటర్” అని క్యాప్షన్ తగిలించారు. “వేటగాడు” అని తెలుగులో పెడితే సరిపోతుంది కదా అంటే..ఈ పద్ధతి ఇప్పటిది కాదు ఎప్పుడో 1995లో “ముత్తు” అనే టైటిల్ నే తెలుగు వెర్షన్ కీ పెట్టినప్పటి నుంచీ ఉంది. కనుక దానిని పెద్ద కంప్లైంట్ గా చెప్పుకోలేం. ప్యాన్ ఇండియా సినిమాలొచ్చాక అన్ని భాషల టైటిల్స్ నీ ఆహ్వానించడమే.

ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే పెద్దగా నిరాశపరచని చిత్రం. మాస్ ప్రేక్షకులని కూడా జస్టిస్ గురించి ఆలోచింపజేసే విషయం. అయితే క్లైమాక్స్ లో మాస్ జనాలు కోరుకునే కంక్లూజన్ కనపడలేదు. క్రిమినల్ ఎంతటివాడైనా హీరో చేతుల్లో కుక్కచావు చావాలి తప్ప జైల్లో కూర్చోవడమేంటి అని సగటు మాస్ ప్రేక్షకుడు అనుకుంటాడు. అలా అనుకోని వాళ్లకి కంప్లైంట్ ఉండదేమో!

బాటం లైన్: గురి ఇంకాస్త బాగా పెట్టాల్సింది

24 Replies to “Vettaiyan Review: సినిమా రివ్యూ: వేట్టయన్- ది హంటర్”

  1. “జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్” అనేది అందరికీ తెలిసిందే.. దానికి కొనసాగింపుగా “జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్” అనే వాక్యం మీద ఈ కథ రాసుకోవడం జరిగింది.”

    next part…judgement written, judge demised?

  2. నీకు ఎన్టీఆర్ jr ఎందుకు పడదు. నీవు ఇచ్చిన 2.5 రివ్యూ కి మళ్ళి చూడొచ్చు అన్నావు. నీ అంత పుష్పం ఎవరు ఉండరు అని నిరూపించుకున్నావు.

  3. ఇప్పుడు అరవం లో అంట నిమ్న కులాల మీద తీసే సినిమాలే. అప్పుడెప్పుడో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ (డిగ్రీ ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేకపోయింది) అంటూ మందు కొడుతూ రోడ్ మీద బేవార్సు గా తిరిగే సినిమాలు వచ్చేయి. ఇప్పుడు అన్ని కులం మీద సినిమాలు.

    1. రాజ్యాంగం లో , ప్రభుత్వం లో, సినిమాల్లో తప్ప కులం ఇంకెక్కడ లేదు… రాజ్యాంగం లో కులం అనే పదం కొట్టేస్తే ఇంక సినిమా లు తీసే గొడవ ఉండదు. రాజ్యాంగం మారుస్తాం అంటే రేవంత్ గాడు రాహుల్ గాడు ఒప్పుకోడు, వాళ్ళకి ఈ దేశం ఇట్లా నే కొట్టుకుంటూ ఉండాలి.

    1. Daridram entante ade Arava darshakula meedha aadharapadi telugu industry brathukutundi.

      Own kathalu Teese dammu leka chala mandi pedda heros arava darshakula Guvva naakuthunnaaru.

      Siggulekunda Arava movies ni telugu lo teesthunnaaru. Kontha Mandi vedhavala movies list chusthe Arava cinema nundi copy chesina movies ekkuva untaayi. Aa vedhavalu maarithe telugu industry bagupadutundi. Alaanti sannaasi gaallake manam support chesthunnamu 🤣

  4. Ismart Sankar. Mister bachhan కంటే మంచి పాయింట్ మీదే తీస్తారు తమిళ్ వాళ్ళు గోట్ కూడా నాకయితే బచ్చన్ కంటే చాలా నచ్చింది . సో తమిళయాన్స్ అలవేస్ బెటర్ క్వాలిటీ ఇస్తారు

  5. ఇకనుండి ఏ సినీమా అయినా సరె సెన్సార్ కి ముందు మొదటి కాపి రాకుండ ఇలాంటి అనలిస్టులకి చూపెట్టిన తరువాతె సినీమా ని విడుదల చేసుకోవాలి అనే చెప్పెయ్యండిరా..

  6. “GA, I have a few questions:

    1. Can you explain who the Aryans and Dravidians are?

    2. Did any of your ancestors go through the practice of Sati?

    3. Are you familiar with the Manusmriti? Can you show any evidence of attack on Dalits and women before the British/muslim arrived? Also, what is the difference between *kulam* and *varnam*?

    4. Which ideology or religion supports rape or the treatment of women as slaves?

    It seems like you lack the knowledge to question these topics, and you appear to support Congress and urban Naxalism. At the very least, could you explain what was wrong with Pawan’s speech?”

  7. “GA, I have a few questions:

    1. Can you explain who the Aryans and Dravidians are?

    2. Did any of your ancestors go through the practice of Sati?

    3. Are you familiar with the Manusmriti? Can you show any evidence of attack on Dalits and women before the British/muslim arrived? Also, what is the difference between *kulam* and *varnam*?

Comments are closed.