కొండా సురేఖ‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా

తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా వేశారు. తాజాగా సురేఖ‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంప‌ల్లి ప్ర‌త్యేక కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న‌పై సోష‌ల్…

తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా వేశారు. తాజాగా సురేఖ‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంప‌ల్లి ప్ర‌త్యేక కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న‌పై సోష‌ల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నార‌ని, దీని వెనుక కేటీఆర్ ఉన్నార‌ని సురేఖ ఆరోపిస్తూ ప‌నిలో ప‌నిగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున‌పై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర ఆరోప‌ణ‌లు చేశారామె.

నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకోవ‌డం వెనుక కేటీఆర్ ఉన్నార‌ని సురేఖ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేటీఆర్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అని మంత్రి సురేఖ డిమాండ్ చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లు త్వ‌ర‌గా పెళ్లిళ్లు చేసుకోడానికి ప్ర‌ధాన కార‌ణం కేటీఆర్ వేధింపులే అని ఆమె అన్నారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై ట్రోల్స్‌కు కేటీఆర్ కార‌ణ‌మ‌ని భావించిన సురేఖ‌, సంయ‌మ‌నం కోల్పోయి మాట్లాడారు.

దీంతో త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా కొండా సురేఖ అవాకులు చెవాకులు పేలార‌ని కేటీఆర్ ఆగ్ర‌హంగా ఉన్నారు. ఇందులో భాగంగా నాంప‌ల్లి ప్ర‌త్యేక కోర్టులో కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. కేటీఆర్ త‌ర‌పున న్యాయ‌వాది ఉమామ‌హేశ్వ‌ర‌రావు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సాక్షులుగా బాల్క సుమ‌న్‌, స‌త్య‌వ‌తిరాథోడ్‌, తుల ఉమ‌, దాస‌రి శ్ర‌వ‌ణ్‌ను పేర్కొన్నారు.

కొండా సురేఖ ఆరోప‌ణ‌ల్ని నాగార్జున‌, కేటీఆర్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. సురేఖ క్ష‌మాప‌ణ చెప్పినా వారు కేసుల్ని వెన‌క్కి తీసుకునే ప‌రిస్థితి లేదు. ప‌రువు న‌ష్టం కేసులు ఏమ‌వుతాయో చూడాలి.

8 Replies to “కొండా సురేఖ‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా”

  1. నాగార్జున కుటుంబ పరువుని బేరీజు వేసుకొని దానితో తన పరువు ఎంతో బేరీజు వేసుకోవడానికి చాలా సమయమే పట్టినట్లుంది. తనకు కలిగిన మానసిక సంఘర్షణ ఏమిటో ఏమి చెప్పుకుంటాడో?

  2. ఈమెకింకా లౌక్యం తెలీదనుకుంట. కేటీఆర్ ఈమెను సోషల్ మీడియా టీం తో అవమానించాడు తన చేతి కి మట్టి అంటుకోకుండా. అలానే ఈమె కూడా చేయించాల్సింది.

  3. I am totally disgusted with kinda Surekha. But at the same time I have a great sympathy for her being a BC who in a service mentality to satisfy the ego of crmnl like Jag resigned from post just because kr00k yesr for his own selfish reason gave her minister position. Similarly, to satisfy a fraud like Revanth she went to far in case of Nagarjuna at the expense of BC self respect. Sorry for and what a change of fortunes from the stage of attacking Doralu as Naxalite to pampering the same Doralu indicative of power/ greedy overwhelms ones own self respect

  4. I am totally unhappy with Surekha to fall prey for the greed/manipulatiom of BCs by worthless Doralu Yesr,crmnl jag,fraud Revanth and Ettu pirrala KTR. This is a perfect example of how human mind gets overwhelmed by greed/ power from being Doralu bashing Naxalite to pampering them to a totally humiliation of BC self respect .

    1. This is a gleeful situation for All Doralu as to how they can continue to manipulate BC/SCs for another 50 years in the comfort of feeling,with the likes of Surekha their future and positions are safe

Comments are closed.