హెరిటేజ్ వాటా నష్టానికి అమ్మేసారు!

ఫ్యూచర్ రిటైల్ లో హెరిటేజ్ కు వున్న మూడు శాతానికి పైగా వాటాను నిన్నటికి నిన్న 132 కోట్లకు విక్రయించేసినట్లు వార్తలు వచ్చాయి. షేర్ మార్కెట్ అనేది స్టడీగా వుండదు. Advertisement ఈ లెక్కన…

ఫ్యూచర్ రిటైల్ లో హెరిటేజ్ కు వున్న మూడు శాతానికి పైగా వాటాను నిన్నటికి నిన్న 132 కోట్లకు విక్రయించేసినట్లు వార్తలు వచ్చాయి. షేర్ మార్కెట్ అనేది స్టడీగా వుండదు.

ఈ లెక్కన చూస్తుంటే జస్ట్ ఏడాది కాలంలో దాదాపు 160 కోట్ల మేరకు చంద్రబాబు ఫ్యామిలీకి నష్టం వచ్చినట్లు అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే హెరిటేజ్ లో భాగంగా వున్న సూపర్ మార్కెట్ స్టోర్ల బిజినెస్ ను ఫ్యూచర్ రిటైల్ కు గత ఏడాది అమ్మేసారు.

దీనికి ప్రతి ఫలంగా అప్పట్లో, 295 కోట్ల విలువైన మూడు శాతానికి పైగా ఫ్యూచర్ రిటైల్ షేర్ లు చంద్రబాబు ఫ్యామిలీకి అంటే హెరేటేజ్ కు వచ్చాయి. అప్పట్లోనే క్యాష్ చేసుకుని వుంటే 295 వచ్చి వుండేవి. 

కానీ కరోనా నేపథ్యంలో రిటైల్ బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. అందుకే ఫ్యూచర్ రిటైల్ షేర్ వాల్యూ కూడా పడిపోయింది. ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం విక్రయించారు. అందుకే 132 కోట్లు వచ్చింది.

అంటే దాదాపు150 కోట్లకు పైగానే షేర్ మార్కెట్ లో బాబుగారి ఫ్యామిలీకి నష్టం వచ్చిందనుకోవాలి. బహుశా షేర్ వాల్యూ మరింత తగ్గి, మరింత నష్టం రాకుండా ముందుగా జాగ్రత్త పడి వున్నారనీ అనుకోవాలేమో ?

ఏపీలో 'జగనన్న జీవక్రాంతి' పథకం ప్రారంభం