ఇప్పుడు లేస్తున్న గొంతులు

అధికారంలోకి వచ్చినవారు వారికి నచ్చిన వారినో? మెచ్చిన వారినో, ఇంకా ముందుకు వెళ్తే వారి బంధువులనో తమకు కావాల్సిన పదవుల్లో నియమించడం అన్నది కామన్. తెలుగుదేశం అధికారంలో వుండగా కమ్మ సామాజిక వర్గ జనాలకు…

అధికారంలోకి వచ్చినవారు వారికి నచ్చిన వారినో? మెచ్చిన వారినో, ఇంకా ముందుకు వెళ్తే వారి బంధువులనో తమకు కావాల్సిన పదవుల్లో నియమించడం అన్నది కామన్. తెలుగుదేశం అధికారంలో వుండగా కమ్మ సామాజిక వర్గ జనాలకు పెద్ద పీట వేసారని వార్తలు వచ్చాయి. అడ్డగోలు ప్రమోషన్లు ఇచ్చి మరీ తమ సామాజిక వర్గ జనాలను ఆదుకున్నారని విమర్శలు వినిపించాయి. ఇంటిలిజెన్స్ ఐజిగా కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వారినే బాబు నియమించుకున్నారు.

ఇప్పుడు వైకాపా వంతు వచ్చింది. ఇంటిలిజెన్స్ ఐజిగా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తున్నారు. అప్పుడే దీని మీద సన్నాయి నొక్కులు ప్రారంభమయ్యాయి. ఓ మతానికి చెందిన స్టీఫెన్ రవీంద్రను కావాలని జగన్ తెచ్చుకుంటున్నారని, వాట్సప్ ల్లో పోస్టుల చలామణీ మొదలయింది. తెలుగుదేశం చేస్తే ఒకటి, వైకాపా చేస్తే మరోటీనా?

ఎవరి అవకాశం వచ్చినపుడు వాళ్లు చేస్తారు. రెండోవాళ్లు అవకాశం మిస్ అయిందని గగ్గోలు పెట్టడం తప్ప చేసేది వుండదు. తెలుగుదేశం కనుక పద్దతిగా వెళ్లి వుంటే, ఇప్పుడు గోల పెట్టడానికి అవకాశం వుండి వుండేది. అలా వెళ్లలేదు కనుక, ఇప్పుడు ఇలా చాటు మాటు వాట్సప్ చలామణీలు తప్ప, మరేం చేయలేదు. 

రిలేషన్ షిప్స్ లో సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇవి!