రాజ్యసభ రేసులో అశోక్ గజపతిరాజు?

అశోక్ కి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత స్థానం ఉందని చాటి చెప్పాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా.

విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజ్యసభ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు.

ఆయనకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ టికెట్ దక్కలేదు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న ఆలోచనల మేరకు అశోక్ కి టికెట్ ఇవ్వలేకపోయారు. అయితే పెద్దాయన సేవలను వేరే రూపంలో వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది. పైగా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న అశోక్ గజపతిరాజుని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది

ఏపీ కేబినెట్ లో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. ఇటీవలే రఘురామ క్రిష్ణంరాజుని ఉప సభాపతిగా ఎంపిక చేశారు. ఇపుడు అశోక్ కి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత స్థానం ఉందని చాటి చెప్పాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా.

అంతే కాకుండా సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ అయిన అశోక్ ని పెద్దల సభకు పంపడం ద్వారా అత్యున్నత వేదిక మీద ఆయన అనుభవాన్ని కూడా పూర్తిగా వాడుకోవాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది అని అంటున్నారు

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు సంబంధించి ఖాళీలను భర్తీ చేసేందుకు లేటెస్టుగా నోటిఫికేషన్ జారీ అయింది. మూడు ఎంపీ సీట్లకు పోటీ గట్టిగా ఉంది అయితే అధినాయకత్వం ఆచీ తూచీ సరైన ఎంపిక చేస్తుంది అని అంటున్నారు. అశోక్ గజపతి రాజు ని రాజ్యసభకు పంపుతారు అన్నది ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అశోక్ అనుచరులు అభిమానులు సైతం పెద్దాయనకు కీలకమైన పదవి దక్కాలని కోరుకుంటున్నారు.

5 Replies to “రాజ్యసభ రేసులో అశోక్ గజపతిరాజు?”

  1. పాపం మా టార్గెట్ చేసిన వారికి మంచి పదవులు దక్కుతున్నాయి.. ప్యాలెస్ లో ఏడుస్తూ ఉంటాడు మా అన్నయ్య..

Comments are closed.