మేం బాగానే ఉన్నాం

రాబోయే రోజుల్లో నిజంగా మైత్రీలో దేవిశ్రీ పనిచేస్తే అప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనుకోవాల్సి ఉంటుంది.

పుష్ప-2 విషయంలో జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ను పాక్షికంగా తప్పించి, అతడి స్థానంలో తమన్ ను తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా మరో ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లను కూడా సీన్ లోకి లాక్కొచ్చారు.

దీంతో ఈ వ్యవహారంపై చాలా చర్చ నడిచింది, దేవిశ్రీ-బన్నీ మధ్య గ్యాప్ వచ్చిందా.. దేవిశ్రీ-నిర్మాతల మధ్య బెడిసికొట్టిందా అంటూ చాలా కథనాలొచ్చాయి. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో ఈ మొత్తం వ్యవహారానికి నిర్మాతలే కారణం అన్నట్టు దేవిశ్రీ నవ్వుతూ స్పందించాడు.

దేవిశ్రీ వ్యాఖ్యలపై తాజాగా ‘మైత్రీ’ నిర్మాతలు స్పందించారు. దేవిశ్రీ వ్యాఖ్యల్లో తమకు తప్పేం కనిపించడం లేదన్నారు. “మా నిర్మాతలకు బాగా లవ్ ఉంటుంది, దాంతో పాటు కంప్లయింట్స్ కూడా ఎక్కువయ్యాయని దేవిశ్రీ అన్నారు. అందులో మాకు తప్పేం కనిపించలేదు.” అంటూ విషయాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశారు.

మరి రాబోయే రోజుల్లో మైత్రీలో దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తాడా? దీనికి కూడా సమాధానం వచ్చింది. దేవితో తమ సంబంధాలు కొనసాగుతాయని.. దేవిశ్రీ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు తమతో సినిమాలు చేస్తాడని, తాము ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు దేవిశ్రీతో సినిమాలు చేస్తూనే ఉంటామని క్లారిటీ ఇచ్చారు.

అంతా బాగానే ఉంది. అంతా కూల్ అనే టైపులోనే సీన్ కనిపిస్తోంది. కానీ అసలు క్లారిటీ ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో నిజంగా మైత్రీలో దేవిశ్రీ పనిచేస్తే అప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనుకోవాల్సి ఉంటుంది.

4 Replies to “మేం బాగానే ఉన్నాం”

Comments are closed.