విమర్శలకు చెక్.. జగన్ కేరాఫ్ అమరావతి

ఓటుకు నోటు కుంభకోణంలో కేసీఆర్ కర్రుకాల్చి వాత పెడతాడని తేలేసరికి తట్టాబుట్టా సర్దుకుని బాబు అమరావతికి మకాం మార్చేశారు. అలా మకాం మార్చిన బాబు ప్రతిపక్షనేత జగన్ పై బురదజల్లడం మొదలు పెట్టారు. ఏపీ…

ఓటుకు నోటు కుంభకోణంలో కేసీఆర్ కర్రుకాల్చి వాత పెడతాడని తేలేసరికి తట్టాబుట్టా సర్దుకుని బాబు అమరావతికి మకాం మార్చేశారు. అలా మకాం మార్చిన బాబు ప్రతిపక్షనేత జగన్ పై బురదజల్లడం మొదలు పెట్టారు. ఏపీ ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రారని, అసలాయన రాజధానిలోనే ఉండరని, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉంటారని.. అలాంటి వారికి ఏపీ రాజకీయాలతో ఏం పని అంటూ నానా నిందలేశారు.

ఆ నిందలకు కాలం చెల్లేలా.. జగన్ అమరావతిలో మంచి ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటుంటే.. జగన్ మాత్రం శాశ్వతంగా తన చిరునామాని అమరావతికి మార్చేసుకున్నారని అప్పట్లో వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా జగన్ హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నడిపారు. ఇప్పుడు జగన్ అమరావతికి వచ్చే సమయం ఆసన్నమైంది.

మే 23 ఫలితాల తర్వాత జగన్ తన రాజకీయ కార్యకలాపాలన్నీ అమరావతి కేంద్రంగానే జరుపుతారని సమాచారం అందుతోంది. ఎన్నికల అనంతరం కాస్త విశ్రాంతి తీసుకుంటున్న జగన్.. ఫలితాల తర్వాత తన కార్యకలాపాలన్నీ అమరావతి నుంచే నిర్వహించేలా ప్రణాళిక వేసుకున్నారు. ఫలితాల తర్వాత తొలి పార్టీ మీటింగ్ కూడా అమరావతిలోనే ప్లాన్ చేసుకున్నారట జగన్.

మొత్తమ్మీద తనపై వచ్చిన, వస్తున్న విమర్శలన్నిటికీ ఫలితాల తర్వాత చెక్ పెట్టబోతున్నారు జగన్. అమరావతి మా అడ్డా, మా మానస పుత్రిక అంటూ విర్రవీగుతున్న టీడీపీ శ్రేణులకు గట్టిగానే సమాధానమివ్వబోతున్నారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ బ్యాచ్ చేసిన ఆగడాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు.

అక్కడ అమరావతిలో ఇంద్రుడు, ఇక్కడ అమరావతికి చంద్రుడు.. అంటూ తోకపత్రికలు చేసిన ఓవర్ యాక్షన్ కూడా ఈనెల 23తో పరిసమాప్తం కానుంది.

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ