హంగ్ వస్తే ఏపీకి హోదా ఖాయమేనా..?

పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు వచ్చేకొద్దీ.. ఏపీలో ప్రత్యేకహోదా ఆశలు చిగురిస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పిన బీజేపీ సర్కారుకి రోజులు దగ్గరపడితేనే ఏపీ విషయంలో ఏదో ఒకటి తేలుతుంది. కేంద్రంలో హంగ్…

పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు వచ్చేకొద్దీ.. ఏపీలో ప్రత్యేకహోదా ఆశలు చిగురిస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పిన బీజేపీ సర్కారుకి రోజులు దగ్గరపడితేనే ఏపీ విషయంలో ఏదో ఒకటి తేలుతుంది. కేంద్రంలో హంగ్ వస్తే 25 లోక్ సభ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ ని కేంద్రం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలకూ ఏపీ కీలకంగా మారుతోంది.

ఏపీలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయనే సమాచారం జాతీయ పార్టీల వద్ద కూడా ఉంది. అద్భుతాలు జరిగితే తప్ప వార్ వన్ సైడే. లోక్ సభ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో వైసీపీ కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ తో మంతనాలు సాగించేందుకు రెడీ అవుతోంది. అటు బీజేపీ కూడా జగన్ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీతోనే పొత్తు ఉంటుందని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు కాబట్టి.. జగన్ మద్దతు అడగాలనుకుంటే బీజేపీ కచ్చితంగా ప్రత్యేక హోదాకు సై అనాల్సిందే. ఒకవేళ మోసం చేస్తే.. ఐదేళ్లలో ఎప్పుడైనా బైటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, కమలనాథులు జగన్ దగ్గర జాగ్రత్తగా మసలుకోవాలి. అటు కాంగ్రెస్ ఇప్పటికే ప్రత్యేకహోదా ఇచ్చేస్తామని ప్రకటించింది కాబట్టి ఆ పార్టీతో నో ఇష్యూ.

అయితే కాంగ్రెస్ కి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం రావడం కష్టమనే చెప్పుకోవాలి. ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ కి జగన్ మద్దతు ఇస్తారా లేదా అనే విషయం అనుమానమే. అలాంటి సమయంలో మూడో ఫ్రంటే దేశానికి దిక్కవుతుంది. సో.. ఎలా చూసుకున్నా ఏపీ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వంలో కీలకం కానుంది కాబట్టి ఏపీ ప్రత్యేకహోదా కూడా ఈ దఫా ఖాయమవుతుందని అనుకోవాలి. 

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ