Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్ మాటల వెనుక...?

పవన్ మాటల వెనుక...?

''..ప్రజారాజ్యంలోకి వచ్చినవారు ఆశలతో వచ్చారు, జనసేనలోకి వచ్చినవారు ఆశయాలతో వచ్చారు..'' ఇధీ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మాట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన అభ్యర్థులతో ఆయన ఈరోజు సమావేశమై మాట్లాడారు. మిగిలిన మాటలు అన్నీ అలావుంచితే ఈ మాటలు మాత్రం పవన్ ఎందుకు అనాల్సి వచ్చింది? ప్రజారాజ్యం ప్రస్తావన మళ్లీ ఇప్పుడు ఎందుకు? అన్నది పాయింట్.

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో విజయాలు సాధించలేదు అన్నది క్లియర్. అందులో సందేహంలేదు. ఈ విషయం పవన్ కూడా చెబుతున్నారు. గెలుపుకోసం కాదు, పోరాటం కోసం జనసేన వుంది అని. మరి ఇప్పుడు ఈ ఆశలు, ఆశయాల వ్యవహారం ఏమిటి?

మరో పదిరోజుల్లో పలితాలు రానున్నాయి. ఎన్నో కొన్నిసీట్లు జనసేనకు వస్తాయి. అవి ఎన్ని అన్నది పక్కాగా తెలియకపోయినా, ఎన్నో కొన్ని వస్తాయని అంచనాలు, ఊహాగానాలు వున్నాయి. తెలుగుదేశం పార్టీ ఫ్రభుత్వం వస్తే ప్రోబ్లమ్ లేదు. జనసేన నుంచి వలసలు వుండకపోవచ్చు. పవన్ తో మైత్రి కోసం చంద్రబాబు, వస్తా అన్నవారికి నో అని చెప్పవచ్చు.

కానీ జగన్ ప్రభుత్వం వస్తే..? జనసేన నుంచి గెలచినవారు జంప్ జిలానీ అంటే..? లేదూ పార్టీ మారకుండా, తమకు జనసేనతో సంబంధం లేదు ఇండిపెండెంట్ సభ్యులుగా వుంటాము అని, పరోక్షంగా ప్రభుత్వం పక్కన చేరితే..? ఏమిటి పరిస్థితి? గెలిచిన కొద్దిమందీ పార్టీని వదిలేస్తే..? ఎందుకంటే గెలిచినా, ఓడినా కోట్లకు కోట్లు ఖర్చు చేసారు ఈ ఎన్నికల్లో. అయిదేళ్లలో రాబట్టుకోవాలి అంటే అధికారపక్షం వైపు వుంటే తప్ప సాధ్యంకాదు.

తెలుగుదేశం వస్తే జనసేనకు మిత్రపక్షమే. అలాగే ప్రభుత్వంలో పాలు కూడా పంచేసుకోవచ్చు. కానీ వైకాపా వస్తే..? ఏదోమార్గం చేసుకుని, జనసేనను వీడి వెళ్లకతప్పదు. లేదూ అంటే ఎన్నికల అప్పులు వెంటాడతాయి. అయిదేళ్ల తరువాత పోటీకి డబ్బులు వుండవు.

ఇప్పుడు పవన్ సందేహం కూడా అదే. వైకాపా వచ్చి, గెలిచిన తనవాళ్లు దూరం అయితే, ఏమిటి పరిస్థితి? అందుకే ఇఫ్పటి నుంచి బ్రెయిన్ వాష్ అన్నమాట. మీరంతా గొప్పొళ్లు. మా అన్న పార్టీలో చేరిన వాళ్లలా కాదు. మీరు ఆశయాల కోసం నా వెంటే వుంటారు. అంటూ వాళ్ల ముందరికాళ్లకు బంధాలు వేసే ప్రయత్నం ఈ మాటల వెనుక వుందీ అన్నది రాజకీయ పరిశీలకుల మాట.

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?