జగన్ తో టచ్ లోకి డీఎంకే-స్టాలిన్!?

కేంద్రంలో చక్రంతిప్పుతూ, రాష్ట్రాల ప్రయోజనాలను నెరవేర్చుకోవాలంటే… ప్రాంతీయ పార్టీలు సమైక్యంగా ఉండడం అనేది కీలకమైన విషయం. సాధారణంగా కాంగ్రెస్, భాజపా వంటి పార్టీలు కేంద్రంలో గద్దెఎక్కిన ప్రతి సందర్భంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదనే…

కేంద్రంలో చక్రంతిప్పుతూ, రాష్ట్రాల ప్రయోజనాలను నెరవేర్చుకోవాలంటే… ప్రాంతీయ పార్టీలు సమైక్యంగా ఉండడం అనేది కీలకమైన విషయం. సాధారణంగా కాంగ్రెస్, భాజపా వంటి పార్టీలు కేంద్రంలో గద్దెఎక్కిన ప్రతి సందర్భంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో దక్షిణాది పార్టీలు ఒక్కమాట మీదకు రావడానికి అనేకరకాలుగా మంతనాలు జరుగుతున్నాయి. సమీకరణలు మారుతున్నాయి.

ఇలాంటి తరుణంలో… ఏపీ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి రావడానికి, తమిళనాడులో ఆశావహ పరిస్థితిలో ఉన్న డీఎంకే నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో మార్పు అనివార్యమైన పరిస్థితి వస్తే… దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను ప్రతిబింబించడానికి.. తద్వారా బలమైన పార్టీతో దోస్తీలో ఉండడానికి డీఎంకే అధినేత స్టాలిన్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

డీఎంకే ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో ఉంది. ఇదే కూటమిలో రాహుల్ పల్లకీకి బోయీగా పనిచేయడానికి చంద్రబాబునాయుడు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఆ రకంగా చంద్రబాబు- స్టాలిన్ మధ్య స్నేహబంధం ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు వెళ్లి చెన్నైలో స్టాలిన్ ను కలిసి వచ్చిన తర్వాత.. పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో జగన్ గెలుస్తున్నారని… 18నుంచి 21 దాకా ఎంపీస్థానాలు కూడా దక్కుతాయని తమ భేటీలో కేసీఆర్, స్టాలిన్ తో చెప్పారు!

ఆ వెంటనే స్టాలిన్ వ్యూహం మారింది. ఈ విషయాన్ని ఓసారి చంద్రబాబుతో కూడా మాట్లాడి ఆయన మూడ్ ను బట్టి క్రాస్ చెక్ చేసుకోవడానికి పార్టీ కోశాధికారి దొరై మురుగన్ ను బాబు వద్దకు పంపారు. రాష్ట్రంలో జనం నాడిని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఏపీకి వచ్చి వెళ్లిన తరువాత.. చంద్రబాబు గెలుపు కష్టమేనని దొరై మురుగన్ – స్టాలిన్ కు నివేదించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చిన సమాచారం కూడా కలుపుకుని… జగన్ ఆ స్థాయిలో విజయం సాధించేట్లయితే.. ఆయనతో టచ్ లో ఉండడమూ మంచిదని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలను పురమాయించారు. ఫలితాల అనంతరం కలిసి ముందడుగు వేయడం గురించి వారు ఇప్పటికే తమ ప్రతిపాదనలను తయారుచేసి జగన్ తో భేటీ కావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. నేరుగా స్టాలిన్ రాకుండా తమ ప్రతినిధిని పంపుతారని, జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే.. తమ మద్దతు పూర్తిగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వదలచుకున్నారని తెలుస్తోంది. 

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!