Advertisement

Advertisement


Home > Politics - Gossip

తెలంగాణలో అలా..ఆంధ్రలో ఇలా..

తెలంగాణలో అలా..ఆంధ్రలో ఇలా..

కేవలం హుజూరాబాద్ లోనే దళిత బంధు పథకం. మిగిలిన చోట్ల తరువాత ఎప్పుడో. వేలకోట్ల పంపిణీ. దీని మీద తెలంగాణ ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఆ ప్రతిపక్షాల్లో తెలుగుదేశం అనేది ఎప్పుడో మాయమైంది. అది వేరే సంగతి. కానీ ప్రతిదానికీ ఎవరో ఒకరు కోర్టు తలుపు తట్టడం లేదు.

ఇదే ఆంధ్రలో అయి వుంటే ఈ పాటికి కోర్టులో కేసు వేసి, స్టే సాధించడం జరిగిపోయి వుండేది. ఎన్నికలు అయ్యే వరకు ఇలాంటి స్కీములు పనికిరావు అంటూ వాదించడం, అసలు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే ఇలాంటి స్కీములు అవసరం లేదు అంటూ లాయర్లు వాదనలు వినిపించడం, జరిగిపోయి వుండేది.

అలాగే తెలంగాణలో భూములు అమ్మకం ఎంత సజావుగా సాగిపోయిందో అందరికీ తెలిసిందే. ఆంధ్రలో భూములు అమ్ముతాము అంటే ఏం జరిగిందో కూడా తెలిసిందే. కేంద్రం ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని అయిదేళ్లు ముందుగా తీసేసుకోవాలనుకుంటే కోర్టు తలుపు తట్టేవారు లేరు. అదే ఆంధ్రలో అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, అర్జెంట్ గా లేచి కేసు ఫైల్ చేయడానికి పరుగెత్తే వాళ్లు వందల్లో వుంటారు. 

ప్రభుత్వానికి మోకాళ్లు అడ్డడమే ధ్యేయంగా రాజకీయాలు నడస్తున్నాయి ఆంధ్రలో. అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నా తెలంగాణలో ఇదే తెలుగుదేశం పార్టీ కిక్కురు మనే పరిస్థితి లేదు. జాతీయ పార్టీ పేరు.. రెండు చోట్లా కార్యవర్గాలు, తెలంగాణలో కోట్ల విలువైన పార్టీ ఆఫీసు తప్ప, కార్యకలాపాలు అక్కడ శూన్యం. ఇక్కడ మాత్రం ఒకటే కార్యక్రమం..కేసులు..కేసులు..కేసులు. 

గమ్మత్తేమిటంటే తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలు, ఆంధ్రలో తీసుకుంటున్న నిర్ణయాల మధ్య సిమిలారిటీ వుంది. కానీ అమలులోకి వచ్చేసరికి అడ్డంకుల దగ్గర తేడా వుంటోంది. లేటెస్ట్ గా స్కూళ్లు ప్రారంభించే విషయమే తీసుకుందాం. తెలంగాణలో స్కూళ్లు అని తెరుస్తున్నారు. అయితే ఆన్ లైన్ నా, ఆఫ్ లైన్ అన్నది ఆప్షనల్ గానే వుంచారు. అంతా సజావుగా సాగిపోతోంది. 

ఆంధ్రలోనూ స్కూళ్లు తెరిచారు. కోర్టు గట్టిగా మందలించేసింది అంటూ వార్తలు వచ్చాయి. అక్కడ కోర్టు వ్యాఖ్యలు, ఇక్కడి కోర్టు వ్యాఖ్యలు అన్నీ పరిశీలిస్తే తప్ప ఎక్కడ ఏమి అన్నదీ తెలియదు. కానీ పత్రికల్లో మాత్రం అక్కడ ఏమన్నదీ రాలేదు. ఇక్కడ మాత్రం కోర్టు గట్టిగా కామెంట్ చేసింది అంటూ వార్తలు వచ్చేసాయి.

కోర్టు వ్యాఖ్యానాలు, తీర్పులు అన్నీ మనం ప్రస్తావించేవి, కామెంట్ చేసేవి కాదు. వాటి జోలికి మనం పోయేదీ లేదు. కానీ స్కూళ్లు లేక పిల్లల భవిష్యత్, సైకాలజికల్ గా ఆరోగ్యం పాడవుతోందని పలు సంస్థలే అధ్యయనం చేసి చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ ఏదోలా స్కూళ్లు తెరవాల్సిన అవసరం అయితే వుంది. 

మొత్తం మీద జగన్ తన పాలన సాగించినన్నాళ్లు చిన్నదానికి పెద్ద దానికి కోర్టు తలుపులు తడుతూ అడ్డం పడేవారితో ఈదుకు రావాల్సిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?