ఉండవల్లి అరుణ్ కుమార్ ది ఓ భిన్నమైన శైలి. ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు లేదా, ఎవ్వరూ గమనించని కోణాలు వెల్లడిస్తుంటారు. జగన్ విక్టర్ మీద ఈ రోజు ఆయన డిటైల్డ్ గా రాజమండ్రిలో మాట్లాడారు. ఆయన చెప్పిన పాయింట్ బాగుంది.
సాధారణంగా ఒక ఊరిలో ఇద్దరు బలమైన శతృవులు వుంటారు. ఆ ఇధ్దరూ కలిస్తే ఇక తిరుగులేదు అని అనుకుంటారు. కానీ జనాల ఆలోచన వేరుగా వుంటుంది. ఇద్దరు బలమైన శతృవులు ఒక్కటై వేరేవాడిని నొక్కేద్దాం అని చూస్తే, జనం వాళ్లని నొక్కేస్తారు.
విజయనగరం జిల్లాలో విజయనగరం రాజులు, బొబ్బిలి పాలకులు, కురుపాం రాజులు (నిజానికి వీరిలో ఒకరు క్షత్రియులు, మరొకరు వెలమలు, ఇంకొకరు గిరిజనపాలకులు) ఇన్నాళ్లు వేరు వేరుగా వుంటూ వచ్చారు. వీళ్లందరూ తెలుగుదేశంలో ఏకమై వైకాపాను ఓడిద్దాం అనుకున్నారు. చిత్రంగా ముగ్గురిని జనం ఓడించారు.
అలాగే కర్నూలులో కోట్ల, కేఇ కుటుంబాలకు అస్సలు పడదు. చిరకాల వైరం. వాళ్లిద్దరు ఓ పార్టీలో చేరారు. ఇక కడపలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల నడుమ వున్న వైరం తెలిసిందే. వాళ్లు కలిసారు. కృష్ణాజిల్లాలో దేవినేని, వంగవీటిల నడుమ వున్న శతృత్వం తెలిసిందే. వాళ్లూ చేతులు కలిపారు.
కానీ జనం ఇలాంటి 'కలయిక'లు అన్నింటినీ దారుణంగా తిప్పికొట్టారు. అదీ ఉండవల్లి విశ్లేషణ. పవర్ నాయకుల్లో లేదు, తమలో వుందనే మెసేజ్ ను జనం ఇచ్చారు అంటున్నారు ఉండవల్లి. కరెక్టే కదా?