ఇండస్ట్రీ.. వన్ వికెట్ డౌన్

తెలుగుదేశం పార్టీ పుణ్యామా అని టీటీడీ మెంబర్ గా మాత్రమే కాకుండా, SVBC చానెల్ చైర్మన్ గా కూడా హోదా వెలిగించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఆ మాటకు వస్తే ఈ చానెల్ పుణ్యమా అని…

తెలుగుదేశం పార్టీ పుణ్యామా అని టీటీడీ మెంబర్ గా మాత్రమే కాకుండా, SVBC చానెల్ చైర్మన్ గా కూడా హోదా వెలిగించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఆ మాటకు వస్తే ఈ చానెల్ పుణ్యమా అని మరి కొందరు ఇండస్ట్రీ జనాలు కూడా బాగానే డబ్బులు చేసుకున్నారని గుసగుసలు వున్నాయి. ఎప్పుడు అయితే తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిందో రాఘవేంద్రరావు లాంటి వాళ్ల మీద విమర్శలు మొదలయ్యాయి. 

జగన్ ను అభినందించాలన్న కనీసపు ఇంగితం లేదంటూ వాట్సప్ పోస్ట్ లు అటు ఇటు తెగ తిరిగాయి. బహుశా ఇవన్నీ రాఘవేంద్రరావు దృష్టికి కూడా వచ్చి వుంటాయి. అందుకని ముందుగా వృధ్దాప్యం సాకు చూపించి SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసారు. టీటీడీ మెంబర్ గా కూడా రాజీనామా చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలావుంటే ఇండస్ట్రీలో టీడీపీ జనాలు అని చెప్పుకునే కేఎల్ నారాయణ, దగ్గుబాటి సురేష్ బాబు, అశ్వనీదత్, జెమినీ కిరణ్ లాంటి వాళ్లు జగన్ ను అభినందిస్తూ ఓ ప్రకటన కూడా చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు కోసం అర్జెంట్ గా వెళ్లి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని, హోదా పోరుకు మద్దతు తెలిపిన వాళ్లు జగన్ గెలిచాక అభినందనలు తెలపాలన్న విషయం తెలియదా అంటూ వాట్సప్ లో పోస్టులు ఫార్వార్డ్ అవుతున్నాయి.

పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవి అయినా పెద్దమనిషి తరహాలో ఓ ప్రకటన చేసి వుండాల్సింది అని కామెంట్ లు వినిపిస్తున్నాయి. బాబు హయాంలో సినిమా పరిశ్రమ అభివృద్ది పేరిట, సినిమా పరిశ్రమతో సంబంధం లేని ఓ 'పెద్దల క్లబ్' కు విశాఖలో భూమి దారాదత్తం చేసేసారు. దాని వెనుక కెఎల్ నారాయణ, సురేష్ బాబు వున్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

మరి జగన్ ఈ నిర్ణయాన్ని తిరగతోడతారనే అనుమానం కనుక వస్తే, అప్పుడు అందరూ బొకేలు పట్టుకుని అమరావతిలో ల్యాండ్ అయి, జగన్ ను గ్రీట్ చేయడానికి, అభినందించడానికి క్యూ కడతారేమో?

వైఎస్ జగన్ సక్సెస్ ఫార్ములా అదే!