మెగాస్టార్ మెగా మూవీ సైరా బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు దఖలుపడ్డాయి. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సైరా హక్కులను భారీ, ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కేజిఎప్ సినిమాను ఈ సంస్థనే చాలా సమర్థవంతంగా బాలీవుడ్ లో పంపిణీ చేసింది. ఫరాన్ అక్తర్ సారథ్యంలోని ఈ సంస్థ అటు నిర్మాణ రంగంలోనూ, ఇటు పంపిణీ రంగంలోనూ కొనసాగుతూంది.
సైరా సినిమా బాలీవుడ్ హక్కులకు కాస్త మంచి ఎంక్వయిరీలే వచ్చాయి. అమితాబ్ వుండడం, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కు చెందిన చాలామంది యాక్టర్లు వండడం, పీరియాడిక్ సినిమా కావడంతొ ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చింది. ఆఖరికి ఎక్సెల్ మీడియా ఈ హక్కులను దక్కించుకుంది. అయితే ఎంతకు తీసుకుంది, టెర్మ్స్ ఏమిటి? అన్నది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
సైరా నిర్మాత రామ్ చరణ్ త్వరలో అధికారికంగా ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ తో డీల్ గురించి అనౌన్స్ చేసే అవకాశం వుంది. అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార లాంటి క్రేజీ నటులు నటిస్తున్న సైరా సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి.