వైఎస్ స్టయిల్ లోనే జగన్

ముఖ్యమంత్రిగా మారి జస్ట్ మూడు నాలుగు రోజులు మాత్రమే అయింది. ఈ మూడు నాలుగు రోజుల్లో జగన్ వర్కింగ్ స్టయిల్ చూస్తే చాలు ఎలా వుండబోతోందో తెలిసిపోతోంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది అలా…

ముఖ్యమంత్రిగా మారి జస్ట్ మూడు నాలుగు రోజులు మాత్రమే అయింది. ఈ మూడు నాలుగు రోజుల్లో జగన్ వర్కింగ్ స్టయిల్ చూస్తే చాలు ఎలా వుండబోతోందో తెలిసిపోతోంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది అలా అలా చకచకా చేసేస్తున్నారు. గ్యాసిప్ లకు తావివ్వడం లేదు. ఆలోచనలు, డిస్కషన్లు లేనే లేవు. అన్నీ ఎప్పటి నుంచో ఆలోచించి, రెడీ మేడ్ అజెండా పెట్టుకున్నట్లు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు, ఆదేశాలు చూస్తుంటే, వైఎస్ గుర్తుకు వస్తున్నారు.

ఆయన ఎవరు ఏమనుకుంటారు? ఎవరు ఏమంటారు? ఇలాంటివి ఏవీ పట్టించుకునేవారు కాదు, అంతా బుల్ డోజింగ్ టైపులో వుండేది వ్యవహారం. చకచకా చేసుకుంటూ వెళ్లిపోవడమే. అయితే వైఎస్ వర్కింగ్ స్టయిల్ లో ఓ ఫోర్స్, స్పీడ్ వుండేది. జగన్ మాత్రం స్మూత్ గా, హడావుడి లేకుండా వెళ్లిపోతున్నారు.

అధికారులను మార్చడం కానీ, హైదరాబాద్ భవనాల అప్పగింత కానీ, పనులు ఆపడం కానీ, అన్నీ అలా అలా జరిగిపోయాయి. అంతే. గింజుకునేవాళ్లు గింజుకుంటున్నారు. ఈ నిర్ణయం అలా, ఆ నిర్ణయం అలా అని. కానీ వైకాపా నుంచి చిన్న కౌంటర్ కూడా రావడంలేదు. ఎందుకంటే ఈ గింజుకునే వాళ్లంతా వాట్సప్ ల్లో తప్ప, బయటకురావడం లేదు. జనాల తీర్పును తప్పుపట్టే దైర్యం అప్పుడే చేయడంలేదు. అందుకే ఇదే అదనుగా జగన్ చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఈరోజు అమావాస్య కావడంతో, రేపటి నుంచి పొలిటికల్ నియామకాలు కూడా షురూ అవుతాయని తెలుస్తోంది. గత ఏడెనిమిదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారిని ఏదో ఒక చిన్నదో, పెద్దదో పదవితో సంతృప్తి పరిచే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే తన సామాజిక వర్గ జనాలకు పెద్ద పీట, టక్కున నియమాకాలు ఆపేసారు. అయిదేళ్ల పాటు ఇదిగో, అదిగో అంటూనే గడిపారు నామినేటెడ్ పోస్టులు చాలా అంటే చాలా వున్నా, అవి నింపే ధైర్యం చేయలేదు.

కానీ జగన్ మాత్రం చకచకా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలోనే వున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఇది కూడా వైఎస్ స్టయిల్ నే. మొత్తంమీద వైఎస్ ఆహార్యం, విగ్రహం, మాట తీరువల్ల ఓ ఫోర్స్ కనిపించేది. జగన్ దగ్గర ఆ ఒక్కటి కనిపించదు కానీ పని తీరు మాత్రం అంతా వైఎస్ మాదిరిగానే కనిపిస్తోంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు