మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వెంటనే పిచ్చాస్పత్రికి తరలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ జబ్బు లక్షణాలు ఆయనలో బాగా కనిపిస్తున్నాయంటున్నారు. రాజకీయాలకు సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమా మానసిక స్థితిపై తెలుగు తమ్ముళ్లకే అనుమానం కలుగుతోంది.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడిన అంశాలను పరిశీలిస్తే ఉమాలో పిచ్చి అన్ని దశలు దాటుకుని ఫైనల్ స్టేజ్‌కు చేరిందనే అనుమానాలను తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో ఉమా ఏం మాట్లాడారో పరిశీలిద్దాం.
రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన కర్నూలు జిల్లాను సందర్శించే ధైర్యం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఉందా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు. రాష్ట్రంలో కొవిడ్-19 వేగంగా విస్తరిస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా అని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్ తాడేపల్లి రాజప్రాసాదం దాటి బయటికి రావడం లేదని ఆయన విమర్శించారు.
విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్ బయటికి వెళ్లి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాలని ఉమా డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు కర్నూలుకు వెళ్లడానికి జగన్‌కు ధైర్యం కావాలా? అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలనే సూచనలకు బదులు ఏ మాత్రం ప్రయోజనం కలిగించని రాజకీయ విమర్శలకు ఇది సమయమా?
రాష్ట్రంలో కొవిడ్-19 విస్తరణ గురించి జగన్ కంటే బాగా తెలిసిన వ్యక్తులు ఎవరున్నారు? మామూలు రోజుల్లో విమర్శలు చేసినట్టు, విపత్కర వేళల్లో చేయడం విజ్ఞత అనిపించుకుంటుందా? జగన్ నివాసం రాజప్రాసాదం అయితే మరి తమరి నాయకుడి నివాసాన్ని ఏమని పిలవాలి? ఇలాంటి చిల్లర రాజకీయాలు ఈ సమయంలో అవసరమా? ఏపీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాళ్లను లాక్‌డౌన్ ముగిసే వరకు ఏ పిచ్చాస్పత్రిలోనో పెడితే మంచిది.