ఖైరతాబాద్ వినాయకుడు ఇంక ఒక్క అడుగే

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన గణేష్ మండపం ఖైరతాబాద్. నాలుగైదు నెలల ముందు నుంచే ఈ సారి ఎలాంటి విగ్రహం ఏర్పాటుచేయాలి, దాని భావమేమిటి? దాని కొలతలేమిటి? ఇలాంటివి అన్నీ నిర్ణయిస్తారు. జనం…

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన గణేష్ మండపం ఖైరతాబాద్. నాలుగైదు నెలల ముందు నుంచే ఈ సారి ఎలాంటి విగ్రహం ఏర్పాటుచేయాలి, దాని భావమేమిటి? దాని కొలతలేమిటి? ఇలాంటివి అన్నీ నిర్ణయిస్తారు. జనం లక్షలాదిగా తరలివెళ్లి ఆ వినాయకుడిని దర్శిస్తారు. కానీ బహుశా తొలిసారి కావచ్చు. జస్ట్ ఒక్క అడుగు ఎత్తు వున్న విగ్రహాన్ని మాత్రమే ఈ వినాయకచవితికి ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.

ఏటికేడు కొత్తదనం సంతరించుకుని భక్తులను ఆకట్టుకునే ఖైరతాబాద్ వినాయకుడు ఇక అడుగు ఎత్తులో మాత్రమే వుంటాడు. అది ఈ ఏడాదికి మాత్రమే కావచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేషుడి విగ్రహం ఉండనుందని ప్రకటించిది.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు ఈసారి గణేష్ మండపాల మీద కూడా వుండొచ్చు. అనుమతులు ఇవ్వడం, ఊరేగింపులు ఇలాంటివాటన్నింటిపై కూడా నియమనిబంధనలు రూపొందిస్తారేమో? అందుకే దీనికి ముందుగా లీడ్ తీసుకుంది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. ఒక విధంగా ఎవరో చెప్పి, అమలు చేయించడం కన్నా, ఇది మంచి నిర్ణయమే.

ఆగలేక స్వయంగా మాట్లాడిన చిరంజీవి