సారీ సర్!

ఏ మాయ అయినా బుడగ లాంటిది.. అది కొంతకాలం వరకే భ్రమపెట్టగలుగుతుంది. కానీ ఏదో ఒకనాటికి పగిలిపోతుంది.

నాలుగు దశాబ్దాల పైబడిను సుదీర్ఘ రాజకీయ అనుభవం. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిపాలన దక్షత. బీజాలు ఎవరు వేసినప్పటికీ.. హైదరాబాదు నగరం ఐటీ హబ్ గా రూపుదిద్దుకోవడంలో కీలకమైన మలుపు.. ఇలాంటివన్నీ అచ్చమైన సత్యాలు. ఒకసారి జగన్ కు అవకాశం ఇచ్చిన తర్వాత.. మళ్లీ చంద్రబాబునాయుడు సారథ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారంటే దాని అర్థం.. ఆయన దక్షత మీద నమ్మకమే. ఆయన మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఏర్పడిఉంటే తప్ప ఈ స్థాయి విజయం సాధ్యం కాదు. మంచిదే.. కానీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఎలా ఉన్నాయి. అంచనాల్ని అందుకోగలుగుతున్నారా? ఆ పరిస్థితుల్ని విశ్లేషించే ప్రయత్నమే.. ఎల్. విజయలక్ష్మి కలం నుంచి గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘సారీ సర్!’!

ప్రియమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి..
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు.

అయిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మీ సారథ్యంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి మీరు వేడుకల రూపంలో ఏదీ వద్దు.. ఒక మంచి నాయకుడి నిష్క్రమణం కారణంగా మనం సంతాపదినాల్లో ఉన్నాం అని చెప్పిన సంగతి మాకు గుర్తుంది. కానీ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజలుగా మా భవిష్యత్తు గురించి కోటి ఆశలతోనే మీ నాయకత్వంలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకున్నాం. రాబోయే అయిదేళ్ల పట్ల నమ్మకంతోనూ ఉన్నాం.

గత అయిదేళ్లలో ఏదైతే జరగలేదో.. ఎలాంటి పనుల మీద దృష్టి సారించలేదో.. ఆ పనులు చేయడానికి మాత్రమే మిమ్మల్ని ఎన్నుకున్నాం అనుకోకండి సార్! మేం కోరుకున్నది అది కాదు. ఎన్నికలు ఎడాదికంటె బాగా దూరంలో ఉన్నప్పుడే మీరు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. ఎన్నికల ప్రచారం జోరెత్తుకున్న తరువాత.. పవన్ కల్యాణ్ తో కలిసి ఒక సవివరమైన మేనిఫెస్టోను తమరు విడుదల చేశారు. మీరు జట్టుకట్టిన, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేవ్రాలు చేయకపోయినప్పటికీ.. ఆ మేనిఫెస్టోలో ప్రస్తావించిన విషయాలన్నింటినీ కేవలం మీమీద ఉన్న నమ్మకంతోనే మేం పరిగణనలోకి తీసుకున్నాం. మీ కూటమికి ఓట్లు వేశాం.

అమరావతి జోరుకు కృతజ్ఞతలు!

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా.. ప్రపంచం మొత్తం తలతిప్పి మన రాష్ట్రం వైపు చూసేలా నిర్మిస్తానని మీరు గతంలో చెప్పారు. మేం నమ్మాం. కానీ.. కేవలం డిజైన్ల మాయ తప్ప, కార్యక్షేత్రంలోకి అడుగులు పడకపోవడం కొంత అనుమానం కలిగించింది. జగన్ కు కూడా ఒక అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం మాలో పుట్టింది. ఆయనను ముఖ్యమంత్రిని చేశాం. కానీ.. అమరావతిని ఆయన పక్కన పెట్టేశారు. అధికార వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అనే పదాలన్నీ కరక్టే గానీ.. అందుకు అమరావతి భూములని ఆ రకంగా నాశనం చేయాల్సిన అవసరం లేదని ఆయన గుర్తించలేదు.

విశాఖపట్నానికి ప్రత్యేకంగా ఏమైనా రాజధాని రూపంలో అభివృద్ధి చేయదలచుకున్నారో లేదో తెలియదు. కోర్టు కేసులు, విరుద్ధమైన తీర్పులు ఆయన మూడు రాజధానుల ఆలోచన మీద కూడా నీలినీడలనే ప్రసరింపజేశాయి. అమరావతిని మీరు ప్రేమించినట్టే మేం కూడా ప్రేమించాం. దాని మీద దృష్టి పెట్టినంత మాత్రాన మీరు మూడు ప్రాంతాల సమాన అభివృద్ధిని ఇగ్నోర్ చేస్తారనే అనుమానం మాకు లేదు. కనుకనే అధికారం కట్టబెట్టాం.

అమరావతి రాజధాని నగరాన్ని వడివడిగా పూర్తి చేయడం దిశగా ఈ ఆరునెలల్లో మీరు చాలా అడుగులు ముందుకేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇక్కడ మీరు ఒక సంగతి ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు ఎంత చురుగ్గా అయితే అమరావతి నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళుతున్నారో అందులో పదోవంతు 2014–19 మధ్య పాలన కాలంలో, కనీసం చివరి సంవత్సరంలో కనబరచి ఉంటే.. లేదా, అమరావతి దిశగా ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రెస్ లో పదోవంతు అప్పడు చూపించి ఉంటే బహుశా 2019 ఎన్నికల్లో అధికార బదలాయింపు జరిగి ఉండేదే కాదేమో.

గతం గతః! అయిపోయిన వాటిని తవ్వుకోవడం అనవసరం. ఈసారి మీరు అమరావతి నిర్మాణం పట్ల చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు గారూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, సమతుల అభివృద్ధి అంటే కేవలం అమరావతి నిర్మాణం ఒక్కటే కాదు! ఆ విషయం మీకు స్పృహలో ఉన్నదా? అమరావతి నిర్మాణం దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయి.

కేంద్రం తీరుస్తుందో, రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాల్సి వస్తుందో స్పష్టత లేని పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇవాళో రేపో అందబోతున్నది. రాష్ట్రం మొత్తమ్మీద సంపద సృష్టిస్తానని, అమరావతి అనేది సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టు అని.. అభివృద్ధి చేసిన తర్వాత.. ఈ యాభైవేల పైచిలుకు ఎకరాల్లో ప్రభుత్వ వాటాకు దక్కే భూములను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో అప్పులు తీరుస్తామని మీరు, మీ సచివులు, సహచరులు చెబుతున్నారు. సంతోషం. తీర్చడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మరీ అప్పు చేయడం అనేది ఇవాళ్టి రోజుల్లో చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మీ దార్శనికతకు అభినందనలు.

కానీ జరుగుతున్న పనుల క్రమం గురించి అతిగా జరుగుతున్న ప్రచారం.. ఆ ప్రచారం కోసం ప్రభుత్వ వర్గాలు కనబరుస్తున్న యావ గమనిస్తోంటే మాలో కొత్త భయాలు మిక్కులంగా కలుగుతున్నాయి. అమరావతి నిర్మాణాల కోసం ఒక్క పని జరుగుతున్నదంటే దాని గురించి డప్పు కొట్టడానికి కనీసం పది పదిహేను సార్లు ప్రచారం చేసుకుంటూ వార్తల్ని ముద్రింపజేసుకుంటూ మాయ చేస్తున్నారనే భయం అది.

ఫరెగ్జాంపుల్.. ఒక నిర్మాణం జరుగుతుందని అనుకుంటాం. దాని గురించి ఆలోచన చేయగానే ఒక వార్త, అప్పు గురించి ఎవడినైనా ఆశ్రయించగానే ఒక వార్త, వాడు సూత్రప్రాయంగా ఒప్పుకోగానే ఒక వార్త, వాడు బోర్డు మీటింగులో ఓకే చెప్పగానే ఒక వార్త, ఆ పనికి ప్లాన్లు సిద్ధం అయ్యాయని ఒక వార్త, వాటికి సీఆర్డీయే ఆమోదం తెలిపిందని ఒక వార్త, ఆ పిమ్మట కేబినెట్ ఆమోదం తెలిపిందని ఒక వార్త, టెండర్లు పిలిచారని ఒక వార్త, త్వరలో పని ప్రారంభం కాబోతున్నదని నాలుగైదు వార్తలు.. ఇలా ప్రచార పరంపర– నిజం చెప్పాలంటే– ఏవగింపు, అసహ్యం పుట్టిస్తోంది.

ఒక పని గురించి ఇన్ని వార్తలూ, అన్ని దశల్లోనూ రావడం విచిత్రం కాకపోవచ్చు.. సాధారణ సంగతే కావొచ్చు. కానీ ప్రతి దశలోనూ ఉండే ప్రతివార్తనూ పత్రికల పతాకశీర్షికల్లో మాత్రమే వచ్చేలా మానిప్యులేట్ చేయడం అనేది అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. మీడియాను తమ చెప్పుచేతల్లో ఉంచుకున్న వాళ్లు గానీ, సొంత మీడియా కలిగి ఉన్నవాళ్లు గానీ ఇంత చాకచక్యంగా ప్రచారమాయను ప్లాన్ చేయలేరు.

మీరు అమరావతి పనుల గురించి వ్యూహాత్మకంగా కల్పిస్తున్న అతి ప్రచారం.. రాష్ట్ర ప్రజలందరినీ మెస్మరైజ్ చేయడానికి మాత్రమేనని, ఆ మాయలో పడి మీరు చేయవలసిన ఇతర అన్ని ముఖ్యమైన పనులను, మీరు దృష్టి నిలపవలసిన అసలైన పరిపాలనను ప్రజలు విస్మరించేలా చేయడమే అంతిమలక్ష్యం అని గుర్తించగలిగిన వారు ఈ అయిదుకోట్ల మందిలో ఎందరుంటారు? కనీసం అయిదుశాతమైనా ఈ ఇంద్రజాల పరిణామాలను గుర్తిస్తున్నారా?

మరో సంగతి– కనీసం అయిదు శాతమైనా మీరు చేస్తున్నది మాయ అని గుర్తించినట్లయితే.. వారు అధికార పీఠాలను తలకిందులు చేయగలరని, ఓడలను బండ్లు చేయడానికి అవసరమైన శక్తి ఆ కెరటానికి ఉంటుందని మీరు గుర్తించగలుగుతున్నారా?

జగన్ చేసిన తప్పే కదా మీరూ చేస్తున్నారు!

జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒకసారి అధికారం కట్టబెట్టాము. ఆయన ఏం చేశారు? పేద ప్రజలకు నేరుగా డబ్బు ఇవ్వడమే సంక్షేమం అనే సరికొత్త విధానాన్ని ‘ఎడ్మినిస్ట్రేషన్’గా భావించారు. బటన్ నొక్కితే చాలు.. ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపేస్తే చాలు.. రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టే అనుకున్నారు. ప్రజాసంక్షేమం అంటే డబ్బు పంపకం ఒక్కటే అనే నిర్వచనాలను స్థిరీకరించారు. అలా డబ్బు పంచడం కోసం ఆయన రకరకాల కొత్త మార్గాలను కనుగొన్నారు కూడా. అది డబ్బు కదా.. దానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. ఆ పథకాలన్నీ ప్రజలను బాగానే ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని నిజంగానే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పును తీసుకువచ్చాయి కూడా. అవన్నీ మంచి పథకాలు గనుకనే.. మీరు కూడా ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఆయా పథకాల కొనసాగింపును, మరింత పెద్ద మొత్తాలతో ప్రకటించారు తప్ప.. వాటిని విస్మరించే, తొక్కేసే సాహసం చేయలేకపోయారు. ఆ సంగతి కొంత పక్కన పెడదాం. జగన్ అవి తప్ప మరేం చేయలేదనే అంశానికి వద్దాం.

కానీ ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అమరావతి తప్ప మీ కళ్లెదుట మరో రకమైన రాష్ట్ర పరిపాలన కనిపించడం లేదా? ఏడు నెలలు గడుస్తున్నాయి. మీరు ప్రతి విషయంలోనూ నాన్చివేత, సుదూర లక్ష్యాల మాటలు వల్లిస్తున్నారే తప్ప క్రియాశీల, ఆచరణాత్మక అడుగులు వేయడం లేదు.

మళ్లీ ఒకసారి సవినయంగా గుర్తు చేస్తున్నాము సర్. జగన్ మోహన్ రెడ్డి చేయకుండా విస్మరించిన, పక్కకు పెట్టిన పనులు చేయడానికి మాత్రమే మేం మిమ్మల్ని నాలుగోసారి ముఖ్యమంత్రిని చేయలేదు. అలా అని మీరు తలపోస్తే పప్పులో కాలేసినట్టే. మీరూ పవన్ కల్యాణూ కలిసి.. (బిజెపికి పూచీలేని) ఇచ్చిన అనేక హామీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటుందనే విశ్వాసంతోనే గెలిపించాము.

చంద్రబాబు గారూ.. ఒక్క విషయానికి సూటిగా, స్పష్టంగా, డొంకతిరుగుడు లేకుండా సమాధానం చెప్పగలరా? సూపర్ సిక్స్ అనే హామీలను ఎన్నికలకు ఏడాదికంటె ముందే మీరు చాలా ఆర్భాటంగా ప్రకటించారు. అంత ముందస్తు ఆలోచన, ప్రణాళిక, దార్శనికత ఉన్న మీరు వాటిని అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాల వ్యవధి కావాలని కోరుకుంటున్నారు? ఎన్నికల వాకిట్లో ప్రకటించిన నాలుగువేల పెన్షను పథకాన్ని, ప్రకటించినట్టే ఏప్రిల్ నుంచి అరియర్స్ సహా, గెలిచిన మరుక్షణం అమలయ్యేలా చేశారే.. అంత చిత్తశుద్ధి మిగిలిన ప్రమాణాల విషయంలో మీకు ఎందుకు లేదు. దానికంటె సీనియారిటీ ఉన్న వాగ్దానాలను నానుస్తున్నారెందుకు? గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి తెచ్చారు. మిగిలిన వాటి సంగతేమిటి?

సర్.. మిమ్మల్ని అభిమానించి, నమ్మి గెలిపించిన అందరి తరఫునుంచి మరోమారు ధ్రువీకరిస్తున్నాను. చేసిన ప్రతి వాగ్దానమూ గెలిచిన తక్షణమే లేదా, గెలిచిన ఆరునెలల్లోనే చేసి చూపించాలని మేం అడగడం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగా తూర్పారపట్టడం లేదు. కానీ.. ఎప్పటికి వాటన్నింటినీ అమల్లోకి తేవాలనుకుంటున్నారో ఆ ప్రణాళిక గురించి అడుగుతున్నాం.

హామీల క్యాలెండర్ కావాలి!

జాబ్ క్యాలెండర్ అనే మాట కూడా మీరు ఇటీవల వాడారు. కానీ, మాకు మీ హామీల క్యాలెండర్ కూడా కావాలి సర్! అయిదేళ్లు పాలించడానికి మేం మీదకు అధికారం ఇచ్చిన మాట నిజమే. అన్నింటినీ అమలు చేయడానికి అయిదేళ్ల గడువూ వాడుకోండి. కానీ.. ఏదేది ఎఫ్పుడెప్పుడు చేయదలచుకుంటున్నారో.. కనీసం ఒక సూత్రప్రాయ ప్రణాళికను మా ముందు పెట్టండి. అప్పటి వరకు మీమీద నమ్మకంతో ఎదురుచూస్తాం.

పింఛన్లు చెప్పినట్టుగా ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లను కనీసం దీపావళి నాటికి ఇచ్చారు. కనీసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే ఎందుకు చేయలేకపోయారు. ఇంత కాలానికి ఉగాది నుంచి అమలు చేస్తామని ఓ ప్రకటన వచ్చింది. రైతులకు పంటసాయం విషయం ఇంకా ఆలోచన దశలోనే ఉన్నట్టు చెబుతున్నారు. మహిళలకు నెలకు రూ.1500 సొమ్ము అందజేత ఎప్పుడో మీరు లీకు ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ప్రస్తావన కూడా చేయడం లేదు.

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం అనేది అధ్యయనానికి ఏడాది కాలం అవసరమయ్యేంత పెద్ద పనా సర్? ఏదో అజ్ఞానం కొద్దీ అడుగుతున్నాం. మీ శిష్యుడు, మిమ్మల్ని సర్వోన్నతుడిగా, సర్వసమర్థుడిగా భావించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా హామీ ఇచ్చారు.. అలా అధికారంలోకి వచ్చిన తర్వాత చిటికెలో ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని మహిళలకు కల్పించారు. మీ శిష్యుడికి చేతనైనది కూడా మీకు చేతకాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. పైగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న దానితో పోలిస్తే.. మీరు ఇచ్చిన హామీ పిపీలికం, అంగుష్ఠమాత్రం అని చెప్పాలి. ఆయన ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రతి మహిళకు రాష్ట్రమంతా ఉచితంగా తిరిగే అవకాశం కల్పిస్తున్నారు.

మీరు ప్రకటించినదే.. జిల్లా వరకు మాత్రమే మహిళకు ప్రయాణం ఉచితం. దాన్ని అమలు చేయడం కూడా మీకు ఏడునెలలుగా చేతకాలేదు. తీరా ఇంత కాలం తర్వాత.. నలుగురు మంత్రుల్ని అధికారుల్ని సమూహంగా బెంగుళూరు పంపి.. అక్కడ ఎలా అమలవుతున్నదో అధ్యయనం చేయాలంటూ కొత్త ప్రహసనం, డ్రామా నడిపిస్తున్నారు. మీరిచ్చిన బుల్లి హామీ అమలుకు అంత కష్టం ఉన్నదా? మంత్రులు యిక్కడి పనులు మానుకుని.. అక్కడకు వెళ్లి బస్సులెక్కి తిరుగుతూ వీడియోలు పంచుకుంటూ చేస్తున్నది డ్రామా కాదని, చిత్తశుద్ధితో హామీని అమలు చేయడానికి జరుగుతున్న అధ్యయనం అని మీరు గుండెల మీద చేయివేసుకుని చెప్పగలరా?

గర్తుంచుకోండి.. హామీల క్యాలెండర్ విడుదల చేయండి. మేనిఫెస్టోలో ప్రతి హామీకి పక్కన రాబోయే అయిదేళ్లలో ఒక తేదీ వేసి.. ఆ హామీల మేనిఫెస్టోలను ప్రమాణ పత్రాలుగా పునర్ముద్రించి ఇంటింటికీ పంచండి. మీ చిత్తశుద్ధిని ప్రజలు వేనోళ్ల కొనియాడుతారు. అసలే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. హామీల మేనిఫెస్టోను కనీసం మీ పార్టీ వెబ్ సైట్ లో కూడా కనిపించనివ్వకుండా మాయం చేసేస్తారనే అపప్రధ మీకు ఉన్నది. అలాంటి అపకీర్తిని తుడిచిపెట్టేయడానికైనా ఇలాంటి హామీల క్యాలెండర్ ను విడుదల చేయండి.

వర్క్ అంటూ జరిగితే కదా..

మీ ప్రతి మాటలోనూ ప్రచారార్భాటం జాస్తిగా ఉంటుందని ఎవరైనా అంటే మీకు కోపం రావొచ్చు. కానీ కాదనలేని సత్యం. హార్డ్ వర్క్ వద్దు స్మార్ట్ వర్క్ చేయండి.. అంటూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ రకరకాల పడికట్టు పదాలు, మార్మికమైన ప్రయోగాలు మీరు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ అసలు వర్క్ అంటూ ఏదీ జరగకుండానే.. వాటికి స్మార్ట్, హార్డ్ అంటూ ప్రిఫిక్సులు జోడించుకుంటూ కాలం గడిపితే ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి పరిపాలనను మార్చేస్తానని.. వాట్సప్ లో ప్రజల సమస్యలు తీర్చేస్తానని.. గూగుల్ సలహాలతో రాష్ట్ర పరిపాలన రూపురేఖలు మారిపోతాయని మాయమాటలు తమరు ఎన్నాళ్లు చెబుతారు? ముందు పనులు ప్రారంభించాలి.

మీరు చెబుతున్న ఏఐ, గూగుల్ ఇతర టెక్నాలజీ గొడుగు కింద ఉండే వ్యవహారాలన్నీ పెద్ద మాయలు. హైటెక్ ముఖ్యమంత్రిగా దశాబ్దాల కిందటే కీర్తి గడించిన తమకు తెలియని సంగతి కాదు అది. కానీ అవి మాయలనే సంగతి ప్రజలెవ్వరికీ తెలియదని మీరు ఇప్పటికీ భ్రమపడుతుండడమే చిత్రం. మీరు హైటెక్ సీఎం అనిపించుకున్న తొలినాళ్లకూ ఇప్పటికీ.. ప్రజల సాంకేతిక చైతన్యంలో చాలా చాలా మార్పు వచ్చింది. మీ మాయలను వాళ్లు గుర్తించగల స్థితిలో ఉన్నారు. మీరు జోడిస్తానంటున్న ఏఐ, గూగుల్, వాట్సప్ సాంకేతికతల గురించి వారికి అంతో ఇంతో తెలుసు.

టెక్నాలజీ అని ముసుగు తొడిగిన తర్వాత.. పావలా ఖర్చవుతుందో, అర్థరూపాయి వెచ్చించాలో తెలియని వ్యవహారాలకు కూడా వందల కోట్ల రూపాయలు తగలేసినా దానికి లెక్కాజమా ఉండదు. అన్నప్రాసన నాడే ఆవకాయ తినిపించాలని కోరుకుంటున్నట్టుగా అవన్నీ మీరు ఇప్పుడే చేసేయాలని ఎందుకు ఆరాటపడుతున్నారు. ముందు పనిచేయడం ప్రారంభించి.. ఆతర్వాత కాలక్రమంలో అదనపు వ్యయం కోరుకునే వీటన్నింటినీ జోడిస్తూ పోవాలి గానీ.. వీటన్నినంటినీ జోడించిన తర్వాత పనిచేస్తానని చెప్పడం కార్యసమర్థుల లక్షణమా? కాదు కదా సర్!

అసలే రాష్ట్రం ఆర్థికంగా ఘోరమైన స్థితిలో ఉన్నది. ఈ సమస్త దురవస్థలకి మీరు ఆరోపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏకైక కారకులని అనుకుందాం. కానీ ఆయన వైఫల్యం గతం! మీ సామర్థ్యం వర్తమానం! మీరు చేస్తున్నది ఏమిటి? అప్పులే కదా? ఆర్థికంగా మరింత ఊబిలోకి దింపడమే కదా. అప్పులే తప్పు అని మేం అనడం లేదు సర్. అవసరమే. అమరావతి నిర్మాణం లాంటి కార్యక్రమాలు, అనేక పథకాలు అప్పులతో తప్ప ఆచరణలోకి రావు. మేం మీ నిర్ణయాల్ని సమర్థిస్తాం. కానీ సాంకేతిక ముసుగుల మీద కూడా ఇంత ఆర్థిక భారం ఉన్నదశలో తగలేయడం అవసరమా? అప్పులు తెచ్చి పెడుతున్న ఖర్చులను, అవసరమూ అనివార్యమైన వాటికి మాత్రమే వెచ్చించాలనే స్పృహ మీకు ఉన్నదా?

మీ నుంచి మేం ఆశించేది ఇది కాదు సర్..

నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సింహాసనం మీదకు తెచ్చే ముందు మేం మీ నుంచి ఆశించినది ఇది కాదు సర్. ఇంతకంటె నిర్మాణాత్మక అడుగులు పడాలని అనుకున్నాం. చేయవలసిన వాటి విషయంలో కనీస స్పష్టత ఇవ్వకుండా.. చేసిన, చేస్తున్న మంచి పనుల గురించి అతిశయమైన ప్రచార ఆర్భాటంతో మాయలు చేస్తూ సాగే ధోరణిని గుర్తించగలిగే స్థితిలో ఉన్నాం.

ఏ మాయ అయినా బుడగ లాంటిది.. అది కొంతకాలం వరకే భ్రమపెట్టగలుగుతుంది. కానీ ఏదో ఒకనాటికి పగిలిపోతుంది.

సారీ సర్.. మీరు ఇలా నిరాశ పరుస్తారని అనుకోలేదు. ఏడునెలల వ్యవధిలోనే ఇలాంటి అభిప్రాయానికి రావడం తప్పని కూడా అనిపించడం లేదు. మాలోని ఈ అభిప్రాయాన్ని చెరపివేయడానికి మీకు అవకాశం ఇవ్వడానికే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాం.

ఇట్లు ప్రేమతో..
మిమ్మల్ని అభిమానించే..
మీ సమర్థతను, కార్యశీలతను విశ్వసించే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.

40 Replies to “సారీ సర్!”

  1. ఎన్నికలకు ముందు ఈ కామెంట్స్ సెక్షన్ లో కొన్ని కొండగొర్రెలు ఉండేవి.. వాటి రోజు వారీ పనేంటంటే..

    .. మా ఆఫీస్ లో కొందరు కమ్మోళ్లను అడిగాను.. వాళ్ళందరూ జగన్ రెడ్డి కే ఓటేస్తాము అని చెపుతున్నారు.. నేను ఆశ్చర్యపోయాను..

    .. మా విల్లేజ్ లో కొందరు కాపులను అడిగాను.. వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ కోపం గా ఉన్నారు..

    .. మా ఊరిలో కొందరు హార్డుకోర్ టీడీపీ ఫాన్స్ ని అడిగాను.. వాళ్ళందరూ ఈ సారి జగన్ రెడ్డి కే ఓటేస్తాము అని చెపుతున్నారు.. నేను ఆశ్చర్యపోయాను..

    .. పిఠాపురం లో మా బంధువులు ఉన్నారు.. వాళ్లకి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ కి డిపోసిట్స్ కూడా రావు అంటున్నారు..

    .. మంగళగిరి లో మా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు.. వాళ్ళని కలిసినప్పుడు తెలిసింది.. గ్రౌండ్ లో లోకేష్ అంటే ఎవరో కూడా తెలీదు అంటున్నారు..

    ఇలా టన్నుల కొద్దీ కామెంట్స్ పెడుతూ శునకానందం పొందేవాళ్ళు..

    ఇప్పుడు కూడా కొందరు పవన్ కళ్యాణ్ ఫాన్స్ పేరుతో లోకేష్ ని, చంద్రబాబు ని తిడుతూ కామెంట్స్ పెడుతుంటారు ఇక్కడ..

    ..

    ఇప్పుడు ఈ ఆర్టికల్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.. పేరుతో కథలు రాసేశారు..

    అరే .. కొండగొర్రెల్లారా.. ఈ క్రాస్ బ్రీడ్ నాటకాలు చూసి చూసి జనాలు విసిగిపోయారు..

    ముందు మీ జగన్ రెడ్డి పార్టీ ని పునర్నిర్మించుకోమను.. 175 నియోజకవర్గాల్లో కనీసం 125 స్థానాల్లో అభ్యర్థులే లేరు మీ పార్టీ కి..

    ప్రతి రోజు పథకాలు పథకాలు అని ఏడిస్తే .. మాకు కూడా మీలాగే 11 వస్తాయి.. మాకు ఆ ఖర్మ పట్టలేదు..

    1. orey ejay fake ga okkadaniki answer cheppu.mebathukki me chnafram potthulu lekunda gelavamanu. vanipolitics antha parannajeevi bathuke.bjpmodi janasna pk veellu lenute meevodu kaneesammla ga kuda gelavaledu. enduku ra nayana nuvvu nee sollupurnam. oorike tagudunamma ani varruthavu. potthulatho bathike bathuku oka bathuka thu thu chandram political broker adhi telusuko

      me babori ruling lo 7 months lo prajalaki chukkalu chupisthunnadu super six govindha. state gdp gst -loki vellindhi. lakshakotla appu.prajalkipanchindhiledhukaryakarthalaki tdpleaders ki dochukuntunnaru.lakshakotlu mottamjebulloke

      jagan chesina appu 2 lakhs crore prajalakiichhindhi 3 lakhs crores. deeniki thodu rbk cnetrs village clinics nadu nedu schools hospitals,sachivalayalau ports fishing harboures.ila jagan ruling lo sankshema abivruddhi vunnadhi. anduke recent ga rbi report kuda adecheppindhi jagan rulings lo state gdp gst lo no.1 state income perigindhi

      kevalamkulala sameekarana potthulu alavikani hamilatho adhikaramloki vachhina chandram oka political broker tappa leader kaadhu..

    2. orey ejay fake ga okkadaniki answer cheppu.mebathukki me chnafram potthulu lekunda gelavamanu. vanipolitics antha parannajeevi bathuke.bjpmodi janasna pk veellu lenute meevodu kaneesammla ga kuda gelavaledu. enduku ra nayana nuvvu nee sollupurnam. oorike tagudunamma ani varruthavu. potthulatho bathike bathuku oka bathuka thu thu chandram political broker adhi telusuko

      me babori ruling lo 7 months lo prajalaki chukkalu chupisthunnadu super six govindha. state gdp gst -loki vellindhi. lakshakotla appu.prajalkipanchindhiledhukaryakarthalaki tdpleaders ki dochukuntunnaru.lakshakotlu mottamjebulloke

      jagan chesina appu 2 lakhs crore prajalakiichhindhi 3 lakhs crores. deeniki thodu rbk cnetrs village clinics nadu nedu schools hospitals,sachivalayalau ports fishing harboures.ila jagan ruling lo sankshema abivruddhi vunnadhi. anduke recent ga rbi report kuda adecheppindhi jagan rulings lo state gdp gst lo no.1 state income perigindhi

      kevalamkulala sameekarana potthulu alavikani hamilatho adhikaramloki vachhina chandram oka political broker tappa leader kaadhu..

  2. కెవలం ఉచ్చితాలని నమ్ముకొని, భటన్లు నొక్కటమె పాలనగా పాలించిన మన జగన్ అన్నకి 11 సీట్లు ఇచ్చారు!!

    ఇప్పుడు ఈ Y.-.C.-.P వాలకం చూస్తుంటె చంద్రబాబు కూడా అదె తప్పు చెయాలి అన్నటు ఉంది! సంగ్షెమం, అబిరుద్ది రెండూ బ్యలెన్సె చెస్తూ బ్రమ్హండం గా ఉంది పాలన. నువ్వు eno తాగు!

  3. Orey GA, 15 medical colleges, 5 ports, improving facilities in health and education system, village level administration by sachivalayam, 1.5 lakhs permanent jobs… Evanni development kaadu antav entra pacha spyco gorrelu laaga… Veetini development antara leka welfare antara gadidaa… Nuvvi ee yellow boku media tdp psyco fans laga

  4. Medical hospitals, sachivalayam, medical cliniks in each village, ports.. Improving health and school infra.. All these are part of development.. Nuvu yellow boku media tdp gajji pasyco laga vunnav

  5. Medical hospitals, sachivalayam, medical cliniks in each village, ports.. Improving health and school infra.. All these are part of development.. Nuvu yellow media tdp gajji pasyco laga vunnav

  6. అలా నీకు మేము చెప్పలేదు విజయలక్ష్మి అక్క….నువ్వు వైసీపీ వాళ్ళు వేస్తున్న ముష్టి తీసుకుని ఈ వ్యాసం రాశావు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.

  7. ముందు ప్యాలస్ లో పని వాళ్ళకి జీతాలు ఇవ్వమని చెప్పు జగన్ కి. సొంత పార్టీ కార్పొరేటర్ లకి బిల్లులు చెల్లించ మని చెప్పు. మొన్న అద్దం మాత్రమే పగలకొట్టారు, మరి ఈసారి ఈ మెట్టె తో కొడతారో, ఆ వీర అభిమానులు.

    జీతాలు పెంచడం లేదు అంట పని వాళ్ళకి.

    అతను మాత్రం ప్రజలనుండి దోచు*కున్న డబ్బుతో విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.

  8. బెయిల్ మీద బయట తిరుగుతున్న విజయ పాల్ అనే మాజీ పోలిసు నీ ప్యాలస్ కి పిలిపించి అతని కాళ్ళు మీద పడటమే లేదు మిగతా అంత చేసారు అంట కదా , rrr నీ కొడతా వుంటే మొబైల్ లో లైవ్ లో చూసింది తానే అని తన పేరు మాత్రం చెప్పవద్దు, ఎంత డబ్బు అయిన సెటిల్ చేస్తా అని ప్యాలస్ పులకేశి అన్నాడు అని బోగట్టా.

  9. ఇప్పుడు జగన్ గారి సారథ్యం లోని వైసీపీ పరిస్థితి ముసలి ఆంబోతు లాగా వుంది అది గెలవదు కాంగ్రెస్ ని రానివ్వదు అది వైసీపీ పరిస్థితి అందుకే మోడీ గారు జగన్ గారిని ఎన్ని అక్రమాలు వున్నా సహిస్తున్నాడు అదే బాబు గారికి కూడా కావలసింది జగన్ గారు ఉండగా నుఎట్రాల్ వోటింగ్ బాబు గారికి తప్ప వైసీపీ కి పడదు ఇక జగన్ గారు గెలిచే ఛాన్స్ ఉండదు

    1. 2019 – 2023 వరకు చెంబుగాడి పరిస్థితి కూడ అంతే. ఎలెక్షన్స్ కి 1-2 సంవత్సరాలకి ముందు నుండి క్రియాశీల రాజకీయాలు నడుస్తాయి. ఎవరు ప్రతిపక్షంలో వున్నా ఇదే జరుగుతుంది.

  10. orey ejay fake ga okkadaniki answer cheppu.mebathukki me chnafram potthulu lekunda gelavamanu. vanipolitics antha parannajeevi bathuke.bjpmodi janasna pk veellu lenute meevodu kaneesammla ga kuda gelavaledu. enduku ra nayana nuvvu nee sollupurnam. oorike tagudunamma ani varruthavu. potthulatho bathike bathuku oka bathuka thu thu chandram political broker adhi telusuko

    me babori ruling lo 7 months lo prajalaki chukkalu chupisthunnadu super six govindha. state gdp gst -loki vellindhi. lakshakotla appu.prajalkipanchindhiledhukaryakarthalaki tdpleaders ki dochukuntunnaru.lakshakotlu mottamjebulloke

    jagan chesina appu 2 lakhs crore prajalakiichhindhi 3 lakhs crores. deeniki thodu rbk cnetrs village clinics nadu nedu schools hospitals,sachivalayalau ports fishing harboures.ila jagan ruling lo sankshema abivruddhi vunnadhi. anduke recent ga rbi report kuda adecheppindhi jagan rulings lo state gdp gst lo no.1 state income perigindhi

    kevalamkulala sameekarana potthulu alavikani hamilatho adhikaramloki vachhina chandram oka political broker tappa leader kaadhu..

  11. హాయ్ లచ్చక్కా.. మావోడు అతి నిజాయితీ తో, అతి మంచితనంతో ఇచ్చిన మాట తప్పకుండా,మడమ తిప్పకుండా 99% అమలు చేసి, ఇంటింటికీ & ప్రతీ వొంటికీ మంచి చేస్తే ఏమైంది??

    ఆ మంచి తీసుకున్న వాళ్ళే

    “గుంపులుగా వచ్చి, సింగల్ సింహానికి” 11 గజాల లోతు దింపారు

    గుర్తులేదా?? లేక మర్చిపోయినట్టు డ్రామాలు దె0గుతున్నావా నీలి లచ్చి??

    నీ రహస్య విషపు ఎజెండా ఏంటో ఇక్కడ 99% మందికి తెలుసు.. అవునా కాదా తమ్ముళ్లు??

      1. సింగల్ సింహం ఇప్పుడు కాపీ క్యాట్ అయిపోయిందా ..

        పెపంచం మొత్తం జగన్ రెడ్డి ని ఫాలో అవుతుంది అని భజన చేసుకొంటుంటారు కదా ..

        మరి అంతటి ధీరుడికి గెలవగలిగే అవకాశాలు చంద్రబాబు ని చూసి నేర్చుకొంటున్నాడా ..!

        హతవిధీ..సింహాన్ని పిల్లి పిల్ల గా మార్చేశారు కదా..

        1. లాస్ట్ చాన్స్ అని గుక్కపెట్టి ఏడ్చి అడుక్కున్నప్పుడు, వన్ సైడ్ లవ్ అని పొత్తులకోసం వెంపర్లాడినప్పుడుచెప్పు, చెంబుని జగన్ ఫాలో అయ్యడని ఓప్పుకుంటాను.

          1. మరీ ఇంత అమాయకంగా వుంటే ఎలా బ్రదర్. సొంతంగా గెలవలేననే కదా నేను కన్ను కొట్టానుగానీ పవన్ రెస్పాండ్ అవ్వడం లేదని చెంబు చెప్పింది.ఆ తరువాత కాళ్ళావేళ్ళాబడి పొత్తు కుదుర్చుకుంది.

          2. రాజకీయాల్లో గెలవడం కావాలి కానీ .. ఎలా అని ఎవడికి కావాలి .. శ్రీ వైస్సార్ గారు కూడా ౨౦౦౪ లో తెరాస, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని గెలిచారు అని మరిచి పోతే ఎలా .. నిజాలు మీరు మర్చిపోయిన మారవు ..

          3. జగన్ రెడ్డి చంద్రబాబు ని ఫాలో అవుతాడని నేను చెప్పలేదురా వెర్రి వెంగళప్ప.. నీ కామెంట్స్ లో నువ్వే చెప్పుకొన్నావు..

            అది ప్రశ్నించేసరికి.. సొల్లు రాస్తున్నావు..

          4. ఓరి పచ్చ కొండెర్రిపప్పా, 2019 లో చెంబుగాడికి 23 గజాల లోతు దింపినప్పుడు ఎంచేసాడో చెప్పమంటే, సొల్లు పురాణం మొదలెట్టింది నువ్వే. అక్కడ చెంబుగాడు డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ పచ్చ కొండెర్రిపప్ప పేటియం బ్యాచ్ డైవర్షన్ కామెంట్లు.

          5. సింగల్ సింహం ఇప్పుడు కాపీ క్యాట్ అయిపోయిందా ..

            పెపంచం మొత్తం జగన్ రెడ్డి ని ఫాలో అవుతుంది అని భజన చేసుకొంటుంటారు కదా ..

            మరి అంతటి ధీరుడికి గెలవగలిగే అవకాశాలు చంద్రబాబు ని చూసి నేర్చుకొంటున్నాడా ..!

            హతవిధీ..సింహాన్ని పిల్లి పిల్ల గా మార్చేశారు కదా..

          6. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు.. తిప్పి తిప్పి అదే రాస్తున్నావు..

            మీకు 1 కి 11 సార్లు చెప్పాలి.. లేకపోతే మీ దద్ది బుర్రలకు అర్థమై చావదు..

  12. ఒరేయ్ గ్రేట్ గూట్లేగా & లచ్చక్క…ముందు మీ జగ్లక్ గాన్ని…వాడి తప్పులు తెల్సుకోమను…EVM ల వల్లే ఓడిపొయాను…జనాలు నా వైపే ఉన్నారు అనే మాయ నుండి (పాలస్ నుండి కూడా) బైటికి వచ్చి పార్టీ మీద ద్రుష్టి పెట్టమను…అప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా అన్నా వస్తుంది…అలా కాకుండా వాడ్ని వాడు మోసం చేస్కుంటే…ఈ జన్మలో గెలవడు…CBN కి తర్వాత సుద్దులు చెప్పొచ్చు… ముందు వాడి ఉప్పు తినే మనిషిగా వాడికి నిజాలు చెప్పి వాన్ని మార్చండి

  13. నీ సారి ఎవ్వడికి కావాలి రా .. మడచి నీ /లేకపోతే జగని గాడి గు*ద్దలో పెట్టు కో పో రా కన్వెర్టడ్ నా కొ డ కా

Comments are closed.