చంద్రబాబుకు జగనే కరెక్ట్ – నాగబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెచ్చుకోవడానికి, ఆయన చేస్తున్న మంచి పనుల్ని ప్రశంసించడానికి మెగా బ్రదర్స్ కు నోరు రాదు. జనసేనాని పవన్ కల్యాణ్ ఎప్పుడూ జగన్ పై విమర్శలే. చివరికి అందరికీ…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెచ్చుకోవడానికి, ఆయన చేస్తున్న మంచి పనుల్ని ప్రశంసించడానికి మెగా బ్రదర్స్ కు నోరు రాదు. జనసేనాని పవన్ కల్యాణ్ ఎప్పుడూ జగన్ పై విమర్శలే. చివరికి అందరికీ మంచి జరిగే నవరత్నాల పథకాలపై కూడా పవన్ విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. పవన్ ఏమంటే దానికి తందానా అంటారు నాగబాబు.

ఇలా ఇద్దరు అన్నదమ్ములు, నిత్యం వైసీపీనే టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో తొలిసారి నాగబాబు, సీఎం జగన్ కు వత్తాసు పలికారు. చంద్రబాబుకు జగనే కరెక్ట్ అంటూ స్పందించారు. ఇంతకీ అది ఏ విషయంలో తెలుసా? చంద్రబాబు మీడియాను కట్టడి చేయడంలో జగనే కరెక్ట్ అని రియాక్ట్ అయ్యారు నాగబాబు.

“టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని,టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం,మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం ,మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం, మనబాబు కి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని,, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ,, బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే.”

ఇలా బాబు అను'కుల' మీడియాపై సెటైర్లు వేశారు నాగబాబు. ఈ విషయంలో “ఎల్లో” మీడియాను కట్టడి చేయడంలో జగన్మోహన్ రెడ్డే వీళ్లకు కరెక్ట్ ఏమో అంటూ స్పందించారు నాగబాబు.

ఈమధ్య ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి టీడీపీ ఛానెళ్లు. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి సృష్టించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ఛానెళ్లు మన దగ్గరున్నాయి. అంతెందుకు.. నిన్నటికినిన్న చిరంజీవితో పాటు పలువురు సినీప్రముఖులు జగన్ ను కలవడానికి వస్తే.. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓ 10 మంది ప్లకార్డులు పట్టుకుంటే దాన్ని పట్టుకొని కొన్ని ఛానెల్స్ పెట్టిన డిబేట్లు మనం చూశాం. ఇదంతా చూసిన నాగబాబు, చంద్రబాబు అనుకూల మీడియాపై సెటైర్లు వేశారు. ఇలాంటి వాళ్లకు జగనే కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. 

జగన్ గారికి చాలా థాంక్స్