ఢిల్లీ నూత‌న సీఎంగా అతిషీ!

ఢిల్లీ నూత‌న సీఎం పీఠంపై ఓ మ‌హిళా ఎమ్మెల్యే ఆసీనులు కానున్నారు. లిక్క‌ర్ స్కామ్‌లో నిర్దోషిగా నిరూపణ అయ్యే వ‌ర‌కూ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌న‌ని కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ…

ఢిల్లీ నూత‌న సీఎం పీఠంపై ఓ మ‌హిళా ఎమ్మెల్యే ఆసీనులు కానున్నారు. లిక్క‌ర్ స్కామ్‌లో నిర్దోషిగా నిరూపణ అయ్యే వ‌ర‌కూ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌న‌ని కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ త‌న ప‌దవికి కేజ్రీవాల్ రాజీనామా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆప్ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌య‌మై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆప్ సీఎం అభ్య‌ర్థిపై స‌స్పెన్స్‌కు కేజ్రీవాల్ తెర‌దించారు. ఆప్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ సీఎం అభ్య‌ర్థిగా అతిషీని ప్ర‌క‌టించారు. ఆమె అభ్య‌ర్థిత్వానికి ఆప్ ఎమ్మెల్యేలంతా మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇదిలా వుండ‌గా గ‌తంలో ఢిల్లీ సీఎంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు షీలా దీక్షిత్ సుదీర్ఘ కాలం పాటు ప‌ని చేశారు. అనంత‌రం ఆమె చ‌నిపోయారు. మ‌రోసారి ఢిల్లీ పీఠంపై ఆప్ మ‌హిళా ఎమ్మెల్యే కూచోనుండ‌డం విశేషం.

కేజ్రీవాల్ త‌న స‌తీమ‌ణి సునీత‌ను సీఎం చేస్తార‌ని అంతా అనుకున్నారు. అయితే వంశ‌పారంప‌ర్య పాల‌న‌కు కేజ్రీవాల్ అంగీక‌రించ‌క‌పోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. లిక్క‌ర్ స్కామ్‌లో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్న‌ప్పుడు పాల‌నను అతిషీ చూసుకున్నారు. సీఎంగా అతిషీ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తార‌ని కేజ్రీవాల్ న‌మ్మారు. అందుకే ఆమె వైపు మొగ్గు చూపారు.

4 Replies to “ఢిల్లీ నూత‌న సీఎంగా అతిషీ!”

  1. ఈ తరహా నాటకాలతో వున్నపరువుకూడపోతుంది .

    వాస్తవానికి ఆయనజైల్లకివెళ్ళినవెంటనేరాజీనామాచేస్తే

    ఎంతో ఉన్నతంగావుండేది .ఒక ఆదర్శంనిలబడేది .

    అప్పుడెవరినీనమ్మలా .తానులోపలవుంటే బయట తనవాళ్ళే వెన్నుపోటుపొడుస్తారని ,తనమాటసాగదేమోనని భయపడ్డాడు .ఇప్పుడు బయటికొచ్చాడు తానునిర్దోసషిననిచెప్పుకుంటున్నాడు

    ఇప్పుడురాజీనామా అవసరంలేదు .కానీచేశాడు కారణం

    ఇప్పుడుముఖ్యమంత్రిఎవరైనా చక్రంతనదే .త్యాగం

    చేసినట్టుబిల్డప్పులివ్వచ్చు . ఈమాత్రంతెలివిప్రజలకు లేదనుకోవటమే రాజకీయాల్లో మోసపోవటం .

    1. జైలుకు వెళ్లినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదో అతను క్లియర్గా చెప్పాడు. బీజేపీ ఆశించిందే అది, అందుకే అతను అప్పుడు రాజీనామా చేయకుండా ఇప్పుడు బెయిలు పై వచ్చి, ప్రజల్లోకి వెళ్తా అంటున్నాడు.

      బీజేపీ లాంటి అరాచకాన్ని ఎదురుకోవాలంటే ఇలాంటి స్ట్రాటజీ తప్పనిసరి

Comments are closed.