ఒక్క రోజులో… రెండేళ్ల ఇండియా బ‌డ్జెట్ ఆవిరి!

మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ల మార్కెట్ క్యాప్ దాదాపు స‌మాన‌మైన స్థాయిలో 100 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో త‌గ్గిపోయింది.

అప్పుల‌ను ప‌క్క‌న పెడితే భార‌త‌దేశ వార్షిక బ‌డ్జెట్ అటు ఇటుగా 32 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు! అమెరికన్ స్టాక్ మార్కెట్స్ లో సోమ‌వారం రోజున ఆవిరైన సంప‌ద అటు ఇటుగా 65 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు! గ‌త మూడేళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌నంత దారుణ‌మైన ప‌తనాన్ని చూసింది నాస్ డ‌క్. ప్ర‌త్యేకించి అమెరికా ఆయువు ప‌ట్టులాంటి టెక్ కంపెనీలు సోమ‌వారం నాడు అత్యంత చేదు అనుభ‌వాన్ని చ‌వి చూశాయి!

యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఆల్ఫాబెట్, అమెజాన్, మీటా.. అమెరికా అంటే ప్ర‌పంచం మ‌దిలో మెద‌లాడే ఈ టెక్ ధిగ్గ‌జ‌కంపెనీలు మార్కెట్ ప‌త‌నంలో భారీ స్థాయి న‌ష్ట‌పోయాయి! ఈ ఆరు కంపెనీలూ ఒక్క రోజు మార్కెట్ ప‌త‌నంలో కోల్పోయిన మొత్తం భార‌త ద్ర‌వ్య‌మానంలో చెప్పాలంటే అక్ష‌రాలా 65 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు! ఇది ఇండియా రెండేళ్ల వార్షిక బ‌డ్జెట్ తో స‌మానం!

కంపెనీల వారీగా చూస్తే.. బాగా న‌ష్ట‌పోయింది యాపిల్. ఈ సంస్థ అటుఇటుగా 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లకు స‌మాన‌మైన షేర్ల న‌ష్టాన్ని చ‌వి చూసింది! ఆ త‌ర్వాత టెస్లా ఏకంగా 130 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో న‌ష్ట‌పోయింది. ఇది కంపెనీ షేర్ల విలువ‌లో 15 శాతంతో స‌మానం! ఇది గ‌త కొన్నేళ్ల‌లో ఆ కంపెనీకి ఎద‌రైన అతి పెద్ద ఎదురుదెబ్బ‌!

మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ల మార్కెట్ క్యాప్ దాదాపు స‌మాన‌మైన స్థాయిలో 100 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో త‌గ్గిపోయింది. అమెజాన్ 50 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో, మీటా 70 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో స్టాక్ మార్కెట్ న‌ష్టాల‌ను చ‌వి చూశాయి!

టెక్ ధిగ్గ‌జ కంపెనీలు ఈ స్థాయిలో న‌ష్ట‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం దిగుమ‌తుల‌పై ట్రంప్ విధిస్తున్న టారిఫ్ లే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ కంపెనీల‌న్నీ దిగుమ‌తుల మీద బాగా ఆధార‌ప‌డి ఉండ‌టంతో.. వీటి ధ‌ర‌ల‌పై ఆ ప్ర‌భావం ప‌డుతుంద‌నే అంచ‌నాల‌తో మ‌దుప‌రులు అమ్మ‌కాల‌కు సిద్ధ‌ప‌డ‌టంతో ఈ ప‌త‌నం చోటు చేసుకుంద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి.

గ‌త వారంలోనే ట్రంప్ ఒక భారీ పెట్టుబ‌డిని ప్ర‌క‌టించాడు. ఒక తైవాన్ సెమీకండ‌క్ట‌ర్ సంస్థ వంద బిలియ‌న్ డాల‌ర్ల మొత్తంతో అమెరికాలో సెమీకండ‌క్ట‌ర్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఇండ‌స్ట్రీని పెడుతుందంటూ ట్రంప్ ప్ర‌క‌ట‌న చేశారు. ఇత‌ర దేశాల దిగుమ‌తుల‌పై సుంకాల‌ను విప‌రీతం చేస్తున్నాడు. దీని ఫ‌లితాలు ర‌క‌ర‌కాలుగా మ‌ళ్లీ అమెరికా మీద‌నే చూపిస్తూ ఉన్నాయి. మ‌రి ఇది తాత్కాలిక‌మో.. లేక అమెరిక‌న్ టెక్ ధిగ్గ‌జాల ఆధిప‌త్యాన్ని కూడా ట్రంప్ విధానాలు ప్ర‌భావితం చేస్తాయో!

6 Replies to “ఒక్క రోజులో… రెండేళ్ల ఇండియా బ‌డ్జెట్ ఆవిరి!”

  1. మేమే మా ఇష్టం అంటే మింగదు బాస్! తిక్కల ట్రంప్ గాడు మళ్ళా గెలుచినపుడే …ఈ వలసల దేశం తనకి తాను మొగ్గేసుకు పోయింది..

  2. భాస్మాసురుడు లా తయారు అయ్యాడు,

    తుగ్లక్ పరిపాలనను ఇప్పటి తరానికి పరిచయం చేస్తున్నాడు 😂

  3. 56 haathi sorry chaathi will make india developed by 2029. wait wait. Gujarat ki bullet train vasthadi janam developed ayipotharu. jai 56.

Comments are closed.