ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ .. ఎవ‌రి రేంజ్ ఏంటి?

ఇప్పుడు యావ‌రేజ్ స్మార్ట్ ఫోన్ కావాల‌న్నా 25 వేల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి ఉంది.

ప‌దేళ్ల కింద‌ట కొత్త యాపిల్ ఫోన్ విడుద‌ల అవుతుందంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో స్టోర్ల ముందు క్యూ క‌ట్టేవారు! పుష్క‌ర కాలం కింద‌టే యాపిల్ అలాంటి క్యూల‌ను నిల‌బెట్టింది. అప్పుడు కూడా ఇండియాలో ఐ ఫోన్ అంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే అప్పుడు ఐఫోన్ కొన‌డానికి భార‌తీయుల ఆర్థిక స్తోమ‌తకు అంత తేలిక కాదు! ఐఫోన్ 4, 4ఎస్ కాలాల్లో.. 27 వేల రూపాయ‌లు వెచ్చించి ఆ ఫోన్ కొన‌డానికి భార‌తీయులు ఎంతో కొంత ఆలోచ‌న‌లో ప‌డేవారు! దీంతో అప్పుడు ఐఫోన్ అంద‌రి వ‌ద్దా క‌నిపించేది కాదు!

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఐ ఫోన్ దే హ‌వా అంటున్నాయి అధ్య‌య‌నాలు! వీటి అంచ‌నాల ప్ర‌కారం.. ఇప్పుడు ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 25 శాతం వాటా యాపిల్ దే! ఇదే అతి పెద్ద సంస్థ కూడా! 2024 లెక్క‌ల ప్ర‌కారం చూస్తే.. ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో యాపిల్ వాటా 25 శాతం!

ఆ త‌ర్వాత వివో ఉంది. 19 శాతం మార్కెట్ ను ఆ సంస్థ క‌లిగి ఉంది. ఒక‌ప్పుడు ఇండియాలో లీడింగ్ అనుకున్న సాంసంగ్ 16 శాతం మార్కెట్ వాటాకు ప‌రిమితం అయ్యింది. ఎంఐ 18 శాతం, ఒప్పో 12 శాతం మేర స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ ను క‌లిగి ఉన్నాయి. మిగిలిన వాటాను ఇత‌ర సంస్థ‌లు క‌లిగి ఉన్నాయి!

ఐదేళ్ల కింద‌ట ఒప్పో, షావ్ మీ, సాంసంగ్ లు మార్కెట్ ను దున్నేశాయి. ఎటు చూసినా వీటి హ‌వానే క‌నిపించింది. అయితే ఐఫోన్ 12, 13 లాంఛింగ్ త‌ర్వాత యాపిల్ దూసుకుపోయింది. ఇదే స‌మ‌యంలో ఈ ఫోన్ల లాంఛింగ్ ధ‌రలు 75 వేల స్థాయికి ఏమీ త‌క్కువ లేదు! అయితే వీటిల్లో కూడా ప్రీమియం మోడ‌ళ్ల వైపు కూడా భార‌తీయులు చూస్తూ ఉన్నారు. బేసిక్ ఐ ఫోన్ కే ప‌రిమితం కావ‌డం లేదు, ప్రో వైపు కూడా ఎక్కువ‌మంది మొగ్గుచూపుతున్నారు.

ఇప్పుడు యావ‌రేజ్ స్మార్ట్ ఫోన్ కావాల‌న్నా 25 వేల రూపాయ‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి ఉంది. అంత‌కన్నా త‌క్కువ అంటే ఫోన్ దీర్ఘ‌కాలం ప‌ని చేయ‌క‌పోవ‌డ‌మో, లేదా అంతంత‌మాత్రంగా ప‌ని చేయ‌డ‌మో జ‌రుగుతుంది. అలాగే ఈఎంఐ ఆప్ష‌న్లు విచ్చ‌ల‌విడిగా అందుబాటులోకి వ‌చ్చాయి. దీంతో మెరుగైన ఫోన్ .. అందునా ఐ ఫోన్ల వైపు ఇండియ‌న్స్ చూస్తున్నారు. ఐటీ రంగాల్లో ప‌ని చేసే వాళ్ల ద‌గ్గ‌ర అయితే.. నూటికి యాభై శాతం పై స్థాయిలోనే ఐఫోన్లు క‌నిపిస్తాయి. మిగిలిన వారు ఈ విష‌యంలో తీసిపోవ‌డం లేదు. ఏతావాతా ఇప్పుడు ఫోన్ల కోసం భార‌తీయులు పెడుతున్న మొత్తంలో యాపిల్ వాటా నాలుగో వంతుగా ఉంది!

3 Replies to “ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ .. ఎవ‌రి రేంజ్ ఏంటి?”

  1. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

Comments are closed.