పాకిస్తాన్.. రైలునే హైజాక్ చేశారు!

తాము బంధించిన వారిలో పాక్ సైన్యానికి సంబంధించిన వ్య‌క్తులు, ఐఎస్ఐకు సంబంధించిన వ్య‌క్తులు ఉన్న‌ట్టుగా హైజాక‌ర్లు ప్ర‌క‌టించారు.

ఇదే ఘ‌ట‌న ఒక ఇర‌వై రోజుల కింద‌ట జ‌రిగి ఉంటే.. ప‌రిస్థితి ఎలా ఉండేదో కానీ, పాక్ లో ఒక చోద్యం చేసుకుంది. పాకిస్తాన్ లో ఒక రైలు హైజాక్ అయ్యింది. బ‌లూచిస్తాన్ ప్రాంతంలో పాక్ రైలు ఒక‌టి హైజాక్ కు గురైంది. దాంట్లో 350 మంది ప్ర‌యాణిస్తున్నార‌ట‌! చాలా కాలంగా బ‌లూచిస్తాన్ లో పాక్ ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో.. బలూచిస్తాన్ స్వ‌యం ప్ర‌తిప‌త్తిని కోరుకుంటున్న కొంద‌రు ఈ సారి పాక్ రైలును హైజాక్ చేశార‌ట‌. దీన్ని పాక్ ప్ర‌భుత్వం కూడా ధ్రువీక‌రించింది.

దాదాపు 400 మంది ప్ర‌యాణిస్తున్న ఒక రైలును వేర్పాటు వాదులు హైజాక్ చేశార‌ని, అయితే ప్ర‌యాణికుల్లో 350 మందిని చెర నుంచి విడిపించిన‌ట్టుగా పాక్ పోలీసులు ప్ర‌క‌టించుకుంటున్నారు. అయితే 35 మంది మాత్రం బంధీలుగా ఉన్నార‌ని కూడా చెబుతున్నారు!

అయితే విడిపించింది ఏమీ లేద‌ని, 350 మందిని హైజ‌క‌ర్లే విడుద‌ల చేశార‌నే వార్త‌లూ వ‌స్తున్నాయి. ఆ మూడు వంద‌ల యాభై మందిలో మ‌హిళ‌లు, పిల్ల‌లు, బ‌లూచ్ ప్రాంత ప్ర‌జ‌లు ఉన్నార‌ట‌. వారంద‌రినీ విడుద‌ల చేసి, 35 మందిని బంధీలుగా తీసుకున్నార హైజాక‌ర్లు. జాఫ‌ర్ ఎక్స్ ప్రెస్ అనే రైలు బలూచ్ ప్రాంతంలో ప్ర‌యాణం సాగిస్తుండ‌గా, హైజ‌కార్లు దాడికి పాల్ప‌డ్డారు. డ్రైవ‌ర్ ను చంపి, రైలు ను ఆపేసి, రైలు రోడ్డును ధ్వంసం చేసి.. రైలును స్వాధీన ప‌రుచుకున్నారు. కొంత‌మంది ప్ర‌యాణికుల‌ను విడుద‌ల చేశారు. అన‌ధికారిక స‌మాచారం ప్ర‌కారం వంద మంది వ‌ర‌కూ హైజాక‌ర్ల చెర‌లో ఉన్నార‌ట‌.

తాము బంధించిన వారిలో పాక్ సైన్యానికి సంబంధించిన వ్య‌క్తులు, ఐఎస్ఐకు సంబంధించిన వ్య‌క్తులు ఉన్న‌ట్టుగా హైజాక‌ర్లు ప్ర‌క‌టించారు. తమ డిమాండ్ల‌కు తలొగ్గితే వారిని విడుద‌ల చేస్తామ‌ని అంటున్నార‌ట‌. ఇప్ప‌టికే పాక్ భ‌ద్ర‌తా ద‌ళాల‌కూ హైజ‌కార్ల‌కు మ‌ధ్య‌న జ‌రిగిన గ‌న్ ఫైట్లో 20 మంది వ‌ర‌కూ మ‌ర‌ణించార‌ట‌. మ‌రి హైజాక‌ర్ల చెర నుంచి పాక్ త‌మ వారిని ఎలా తీసుకెళ్తుందో చూడాల్సి ఉంది.

ఇటీవ‌లే క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌తో ఐసీసీ చాంఫియ‌న్స్ ట్రోఫీలో భాగంగా కొన్ని మ్యాచ్ ల‌కు పాక్ ఆతిథ్యం ఇచ్చింది. త‌ద్వారా చాలా కాలం త‌ర్వాత ఒక పెద్ద ఈవెంట్ లో కొన్ని మ్యాచ్ ల‌కు అయినా ఆతిధ్యం ఇవ్వ‌గలిగింది. ఇంత‌లోనే ఇలాంటి సంఘ‌ట‌న చోటు చేసుకుంది పాకిస్తాన్ ప‌రిధిలో!

4 Replies to “పాకిస్తాన్.. రైలునే హైజాక్ చేశారు!”

Comments are closed.