బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్!

నిర్దేశించిన గడువు ముగిసినా అనిల్ ఇంకా లొంగిపోకపోవడం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ బెయిల్ పొడిగింపుపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బోరుగడ్డ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. నిర్దేశించిన గడువు ముగిసినా అనిల్ ఇంకా లొంగిపోకపోవడం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌ తన తల్లి ఆరోగ్యం బాగోలేదని ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిల్ పొందారు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టు నుండి మధ్యంతర బెయిల్ పొందారని తెలుసుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం గత కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నారు. బెయిల్ ముగియడంతో జైల్లో లొంగిపోతారా లేదా అన్నదానిపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది.

తప్పుడు వైద్య ధ్రువపత్రంతో బెయిల్ గడువు పొడిగించుకున్న విషయాన్ని పోలీసులు ఇప్పటికే ప్రభుత్వ న్యాయవాదికి తెలియజేసి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము అనిల్‌కు ఎటువంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని వైద్యులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. వైద్యులు చెప్పేవి నిజం అయితే అనిల్‌పై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. తల్లికి సహాయంగా ఉండాలని చెప్పి జైలు నుంచి బయటకొచ్చిన అనిల్ ఇన్నాళ్లూ ఎక్కడున్నాడు? ఎవరెవరిని కలిశాడు? ఎవరితో ఫోన్లో మాట్లాడాడన్నదానిపై పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

గడువు ముగిసినా జైల్లో లొంగిపోకపోతే బోరుగడ్డ అనిల్‌పై కోర్టు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, తన తల్లి నిజంగా అనారోగ్యంతో ఉన్నారని అనిల్ రెండు రోజుల క్రితం వీడియో విడుదల చేసిన విష‌యం తెలిసిందే.

13 Replies to “బోరుగడ్డ అనిల్‌పై హైకోర్టు సీరియస్!”

  1. తల్లితో రాజకీయాలు చేయడం లో వైసీపీ నాయకులు భలే ఉత్సాహం గా అంటారు..

    ..

    ఒకడేమో బాబాయ్ హత్య కేసులో సిబిఐ నుంచి తప్పించుకోడానికి తల్లికి గుండెపోటు అని చెప్పి కర్నూల్ హాస్పిటల్ మొత్తం బ్లాక్క్ చేసేసాడు.. అప్పటి సీఎం కూడా ఒక నిందితుడే కాబట్టి.. సిబిఐ వాళ్ళు ఆ హాస్పిటల్ లోకి అడుగు కూడా పెట్టలేకపోయారు..

    ..

    ఇంకొకడు.. తల్లి కి గుండెపోటు అని చెప్పి ఫెక్ సర్టిఫికెట్స్ పెట్టి బెయిల్ తెచ్చుకొంటాడు..

    ..

    ఇంకొకడు.. దళిత డ్రైవర్ హత్య కేసులో.. తల్లికి అనారోగ్యం అని చెప్పి బెయిల్ మీద వచ్చి 3 ఏళ్ళు అవుతోంది.. హ్యాపీ గా ఉన్నాడు..

    ..

    ఇంకొకడు.. తల్లిని చంపేస్తే సింపతీ తో గట్టెక్కేసి.. మళ్ళీ సీఎం అయిపోవచ్చని ప్లాన్ చేసాడు.. ఆ ఆ తల్లి చిలక కి విషయం అర్థమైపోయి.. అమెరికా కి జంప్..

    ..

    ఏమన్నా మనుషులా.. థూ .. మీ బతుకు చెడా ..

  2. ప్యాలస్ పులకేశి బోయ్ ఫ్రెండ్ నీ ఇలా చేస్తే ఎలా, కో*ర్టు గారు. అసలే వంశి తర్వాత మగ తోడు లేక ప్యాలస్ పులకేశి వొళ్ళు జిమ జిమా లాడటా వుంది. ఇలా బొరుగడ్డ తో బోరు కొట్టించుకోవాలని ప్యాలస్ పులకేశి విరహం తో తహ తహ లాడుతున్నాయి.

Comments are closed.