రేపట్నుంచి ఇయర్ మారడమే కాదు, దాంతో పాటు కొన్ని రూల్స్ కూడా మారుతున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, గ్యాస్, పెన్షన్.. ఇలా రోజువారీ జీవితానికి సంబంధించి కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం.
మీరు కారు కొనాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, రేపట్నుంచి కాస్త ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బిఎమ్‌డబ్ల్యూ వంటి ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచబోతున్నాయి.
మరో ముఖ్యమైన మార్పు రేపట్నుంచి అమల్లోకి వస్తోంది. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఆ గడువు ఈరోజుతో ముగుస్తోంది. ఈ-కేవైసీ పూర్తిచేయని రేషన్ కార్డులు రేపట్నుంచి రద్దవుతాయి.
పెన్షనర్లు రేపట్నుంచి ఓ కొత్త వెసులుబాటను ఎంజాయ్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు నిబంధనలను సులభతరం చేసింది కేంద్రం. ఇప్పుడు వారు దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా తమ పెన్షన్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు. దీని కోసం వాళ్లు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఈపీఎఫ్ఓ కింద నమోదైన ఉద్యోగుల కోసం ఏటీఎం కార్డ్ సదుపాయాన్ని కూడా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఫీచర్ ఫోన్లు, అంటే చిన్న ఫోన్లలో యూపీఐ వాడేవాళ్లు 5వేల రూపాయలకు మించి యూపీఐ సేవలు పొందలేరు. ఇప్పుడా నిబంధనను ఆర్బీఐ సవరించింది. ఫీచర్ ఫోన్లలో యూపీఐ పరిమితిని 10వేల రూపాయలకు పెంచింది. ఇక బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్బీఐ.
రేపట్నుంచి ఇండియాలోని యూఎస్ ఎంబసీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు అదనపు రుసుము లేకుండా అపాయింట్‌మెంట్‌లను ఒకసారి రీ-షెడ్యూల్ చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. మరోసారి రీషెడ్యూల్ చేయడానికి మాత్రం మళ్లీ దరఖాస్తు చేసుకొని, అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది, తద్వారా రైతులు ఇప్పుడు రూ. 2 లక్షల వరకు హామీ లేకుండా రుణాలు పొందగలరు. ఇకపై రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులు కూడా ఎయిర్ పోర్టుల్లో లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. కాకపోతే కనీస ఖర్చు పరిమితి ఉంది. వీటితో పాటు ఎప్పట్లానే గ్యాస్ ధరల్లో మార్పులు ఉండబోతున్నాయి. జీఎస్టీ ఫైలింగ్ లో మల్టీ ఫ్యాక్టర్ అథంటికేషన్ రాబోతోంది.
Jeggul ది లంగా Leven gaddu oka Lanjha ki puttinadu, vaddu sankkrra jaathhi cross breeding