కొత్త ఏడాది.. ఆశల పల్లకి

న్యూ ఇయర్ లో కూడా కొన్ని ప్రామిసింగ్ ప్రాజెక్టులు క్యూ కట్టాయి.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే సినిమాలు ప్రతి ఏటా వస్తుంటాయి. అందులో కొన్ని అంచనాలు అందుకుంటాయి, కొన్ని మాత్రం షాక్ ఇస్తాయి. 2024లో కూడా అలాంటి షాకులు తగిలాయి, కొన్ని మెరుపులు మెరిశాయి. మరి 2025 టాలీవుడ్ పరిస్థితేంటి? న్యూ ఇయర్ లో కూడా కొన్ని ప్రామిసింగ్ ప్రాజెక్టులు క్యూ కట్టాయి.

కొత్త ఏడాది సంక్రాంతి సినిమాల నుంచే ఎవెయిటింగ్ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది గేమ్ ఛేంజర్. మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఇది. చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమా. దిల్ రాజు కెరీర్ లోనే పెద్ద చిత్రం. ఇప్పటికే చిరంజీవి, సుకుమార్ లాంటి ప్రముఖులు బ్లాక్ బస్టర్ రివ్యూలు కూడా ఇచ్చారు. కొత్త ఏడాది మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ముందు వరుసలో ఉన్న చిత్రం ఇదే.

ఈ సినిమాతో పాటు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా ఉన్నాయి. వరుసగా హిట్స్ ఇస్తున్న బాలకృష్ణ నుంచి డాకు మహారాజ్ వస్తోంది. ఇటు అనీల్ రావిపూడి బ్రాండ్ తో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా నిలిచింది. 2025లో బాలయ్య నుంచి మరో సినిమా కూడా రాబోతోంది. అదే అఖండ-2. సూపర్ హిట్ కాంబినేషన్ బాలయ్య-బోయపాటి నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

పవన్ కల్యాణ్ నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయింది. కొత్త ఏడాదిలో పవన్ నుంచి 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు సినిమా 8-9 రోజులు మాత్రమే షూట్ పెండింగ్ ఉంది. మార్చి 28కి వచ్చే ఛాన్స్ ఉంది. అటు ఓజీ సినిమా కూడా 2025లోనే థియేటర్లలోకి వస్తుంది.

ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజాసాబ్ కూడా లిస్ట్ లో ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా వేసవి తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. చేతిలో మరికొన్ని సినిమాలున్నప్పటికీ, 2025లో వచ్చేది అనుమానమే. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా దాదాపు రెడీ అయింది. కొత్త ఏడాదిలో సందడి చేయబోతోంది.

విజయ్ దేవరకొండ నుంచి కొత్త ఏడాదిలో 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా పేరు పెట్టని ఓ సినిమాను మార్చిలో విడుదల చేయాలని నిర్ణయించారు. మరో సినిమా ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నాగచైతన్య తండేల్, అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటీ సినిమాలు కూడా న్యూ ఇయర్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.

వీళ్లతో పాటు కుబేర, హిట్-3, కాంతార ఛాప్టర్-1, మిరాయి, రెట్రో, థగ్ లైఫ్ లాంటి సినిమాలపై అంచనాలున్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్ నుంచి 2025లో సినిమాలొచ్చే అవకాశం లేదు.

5 Replies to “కొత్త ఏడాది.. ఆశల పల్లకి”

Comments are closed.