గులాబీ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఇదీ ఇప్పుడు ప్రశ్న. ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అనుకుంటున్నారా. కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ కు కొత్త అధ్యక్షుడు వస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పాడు. అంటే కొత్త ఏడాదిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందన్న మాట.
సాధారణంగా ప్రాంతీయ పార్టీలో అధ్యక్ష ఎన్నిక అనేది తూతూ మంత్రమే. అంటే నిబంధనల ప్రకారం ఎన్నిక జరపాలి కాబట్టి ఆ తతంగాన్ని మమ అనిపిస్తారు. పార్టీ స్థాపకుడే జీవితాంతం అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన అనంతరం ఆయన వారసుడు లేదా వారసురాలు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు.
అంటే కుమారుడు లేదా కుమార్తె అన్నమాట. వాళ్ళు మినహా ఇతరులెవ్వరూ పార్టీ చీఫ్ అయ్యే అవకాశం ఉండదు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయి. గులాబీ పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదు. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టిందే కేసీఆర్. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే బీఆర్ఎస్ గా మారిన తరువాత కూడా కేసీఆరే అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఎప్పటికీ ఆయనే అధ్యక్షుడిగా ఉంటాడని ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఇతర నాయకులు కూడా చెబుతుంటారు. కాబట్టి కొత్త ఏడాదిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినా కేసీఆరే అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. లేదా కేసీఆర్ మరింత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే ఆయన కుమారుడు కేటీఆర్ అధ్యక్షుడు అవుతాడు.
అంతే తప్ప మరొకరు అయ్యే అవకాశం లేదు. అప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా కుమార్తె కవితనో, మేనల్లుడు హరీష్ రావునో నియమిస్తారు. ఏడాదిగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. ప్రజల్లోకి రావడంలేదు, అసెంబ్లీకి రావడంలేదు. కథ మొత్తం కేటీఆర్, హరీష్ రావు, కవితే నడిపిస్తున్నారు. అసెంబ్లీలో వీళ్ళ గొంతులే వినబడుతున్నాయి. ప్రజల్లోకి కూడా ఈ ముగ్గురే వెళుతున్నారు. కాబట్టి ఈ ముగ్గురికి బాధ్యతలు అప్పగిస్తారని అంచనా.
కొందరు నాయకులు బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు. రాష్ట్రానికి బీసీని సీఎంను చేస్తానని చెప్పిన కేసీఆర్ దాన్ని నెరవేర్చలేదు. కాబట్టి బీసీ అధ్యక్షుడు అనేది కూడా నెరవేరకపోవచ్చు. పార్టీ తమ కుటుంబం చేతుల్లో ఉండాలనేది కేసీఆర్ లక్ష్యం.
అంటే తెలంగాణా పిత దర్శన భాగ్యం లేదా??
Peetha kaadhu pitha
YCHEEPEE KI VINASH AVUTHAADU GAA
బీసీ ని కాదురా ముండాకొడక దళితుణ్ణి సీఎం చేస్తా అని నాటకాలు దేంగిండు
Jagan or sajjala niyamiste baguntadi