కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక మాట అన్నాడు. తాను సరదాగా అన్నానని చెప్పాడు. సరదాగా అన్నానని ఆయన చెబుతున్నా సీరియస్ గా ఆన్నాడనే అనిపిస్తోంది. ఇంతకూ గడ్కరీ ఏమన్నాడు? నాలుగోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నాడు. రెండుసార్లు విజయవంతంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే మొన్న మూడోసారి కష్టంగానే అధికారంలోకి వచ్చిందని చెప్పాలి.
ప్రధానంగా రెండు పార్టీల మద్దతుతోనే మోడీ సర్కారు నిలబడింది. బీహార్ నుంచి నితీష్ కుమార్ జేడీయూ, ఏపీ నుంచి చంద్రబాబు టీడీపీ. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అత్యధిక సీట్లు సాధించడం, మద్దతు ఇవ్వడంతో మోడీ సర్కారు బతికి బట్ట కడుతోంది. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది.
సీట్ల విషయంలో ఎన్డీయేకు, ఇండియా కూటమికి పెద్ద తేడా లేదు. ఎన్డీయేలో ఏ పార్టీ బయటకు పోయినా ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. జేడీయూ లేదా టీడీపీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నా మోడీ ప్రభుత్వం కుప్పకూలుతుంది. కాబట్టి బీహార్ లోగానీ, ఏపీలో కానీ లోకల్ బీజేపీ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
వీళ్ళు పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తే అది మోడీ ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఇచ్చే ప్రమాదం ఉంది. ఇక నితీష్ కుమార్ కు జంప్ జిలానీ అనే పేరుంది ఆయన కొంతకాలం కాంగ్రెస్ కూటమిలో ఉంటాడు. కొంతకాలం ఎన్డీయేలో ఉంటాడు. ఎన్నికల ముందువరకు ప్రతిపక్ష కూటమితోనే ఉన్నాడు. ఏపీలో చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు బీజీపీతో గొడవపడి ఎన్డీయే నుంచి బయటకు వచ్చినా , పవన్ కళ్యాణ్ కారణంగా మళ్ళీ ఎన్డీయేలో చేరాడు.
జగన్ దురదృష్టమో, బాబు అదృష్టమో, తీవ్ర ప్రజా వ్యతిరేకతో …కారణం ఏదైనా టీడీపీ -జనసేన -బీజేపీ కూటమి సూపర్ డూపర్ మెజారిటీ సాధించింది. అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవి నెరవేర్చాలి. ప్రధానంగా అమరావతిని డెవెలప్ చేయాలి. పోలవరం పూర్తి చేయాలి.
ఇవన్నీ చేయాలంటే కేంద్రం మద్దతు అండ్ ఆర్ధిక సాయం కావాలి. కాబట్టి దాంతో సఖ్యతగా ఉండాలి. ప్రత్యేక హోదా వగైరా అటక మీదికి చేరిపోయింది. కాబట్టి బాబు మోడీ సర్కారుకు మద్దతు ఉపసంహరించకపోవొచ్చు. నితీష్ కుమార్, చంద్రబాబు సజావుగా ఉంటే ఈ ఐదేళ్లూ మోడీ ప్రభుత్వం నిలబడుతుంది.
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేం. అప్పటికి ఇండియా కూటమి మరింత బలపడొచ్చు. మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోవొచ్చు. ఇక ఎన్డీయే పాలన చాల్లే అనుకోవచ్చు. ఏదైనా జరగొచ్చు.
Call boy works 9989793850
Call boy jobs available 9989798350
పంది కొవ్వు తేరగా వొచ్చిందని తినొద్దురా అని చెప్పినా వినిపించు కోకుండా గుటుకు గుటుకు మని మింగాడు, చిన్న మెదడు పుటుక్కు మంది, ఎలక్షన్స్ లో చతికిల పడ్డాడు జగన్. ఎవరెవరి అదృష్టమో దురదృష్టమో గాని, రాష్ట్రం అయితే గెలిచింది ’24 లో.
AP ప్రజలు చాలా ..తెలివైనొల్లు
జగన్ లా విపరితమైన గర్వాన్ని మరియు అలసత్వాన్ని సహించరు ..
పవన్…. బాబు లా ఒవర్ యాక్షన్ పాలిటిక్స్ సహించరు ..
తిరుమల లడ్డు విషయం CBIకొ.. SUPREM COURT JUDGE కొ ఇచ్చెయండీ
State development పై ద్రుష్టి పెట్టండి ..మీ mp ల సంఖ్యా బలంతొ డిల్లి నుండి నిదులు తెండి
Can we expect that BJP will come to power directly without relying on other parties for the fourth time?
సీట్ల విషయం లో NDA కి ఇండి కూటమి కి పెద్ద తేడా లేదా? మరీ నిద్ర పోతూ రాస్తే ఎలా? ఒక్క బీజేపీ కే 240 ఉంటే ఇండి కూటమి కి 232 మాత్రమే ఉన్నాయి. బేరం చేస్తే ఉద్దవ్ థాకరే లాంటి వాళ్ళు బీజేపీ వైపు వచ్చేస్తారు.
ఈ గడ్కరి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు లేకున్నా ఫర్వాలేదు కాని తమ పార్టీ తరపున వేరే వాళ్ళు పీఎం గా ఉండకూడదు.
vc estanu 9380537747
బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము గాని ..ఆంధ్ర లో మాత్రం వై చీపి మాత్రం అధికారంలోకి రాదు అని మాత్రం గట్టిగ చెప్పగలను . సీబీన్ ఈ సారి చాలా తెలివిగా టార్గెట్ చేసాడు వై చీపి ని .. వై చీపి నాయుకలని టీడీపీ లోకి రానివ్వకుండా జెనసేన లకి పంపిస్తున్నాడు అంటే జనసేన ని బలోపేతం చేస్తున్నాడు ..పక్క ప్రణాళికతో 2029 నాటికి టీడీపీ కి ప్రత్యనయమాగా జనసేన అనేటట్లు తయారు చేస్తున్నాడు .2029 లో టీడీపీ /జనసేన విడివిడిగా పోటీచేసిన టీడీపీ లేక జనసేన లేక ఇద్దరు కలిసి మల్లి అధికారంలోకి రావడం .. వై చీపి కి ఎలక్షన్ నాటికి రెండు కులాలు మాత్రమే మిగులుతాయి ఒక్కటి క్రిస్టియన్స్ /అండ్ 50% రెడ్లు మాత్రమే మిగులుతారు . రెడ్లు వద్దు అంటున్నా నెల్లూరు లో అనిల్ కుమార్ యాదవ్ కి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చాడు అంటేనే రెడ్లు సపోర్ట్ వద్దు అనే కదా . తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందో లేదో తెలియదు కానీ హిందూ అనే వాడు వై చీపి అంటే ఆశాహించుకొనేలా చేయగలిగాడు .