మద్యానికి మద్యం.. పాలకు పాలు తెలిపోతాయి!

ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారై, ఎమ్మెల్సీ క‌విత త‌న‌పై నిరాద‌ర ఆరోప‌ణ‌లు చేసిన‌వారు క్ష‌మ‌ప‌ణ చెప్ప‌ల‌ని డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ బీజేపీ ఎంపీ…

ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారై, ఎమ్మెల్సీ క‌విత త‌న‌పై నిరాద‌ర ఆరోప‌ణ‌లు చేసిన‌వారు క్ష‌మ‌ప‌ణ చెప్ప‌ల‌ని డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ బీజేపీ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ స్పందించ‌లేదు.

ఎంపీ మాట్లాడూతు త‌న‌కు కోర్టు నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నోటీసులు అంద‌లేని.. అంద‌గానే దానిపై స్పందిస్తాన‌ని అన్నారు. ఎమ్మెల్యీ క‌విత దాఖ‌లు చేసిన ప‌రువున‌ష్టం దావా కేసును నిన్న కోర్టు విచారించి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

ప్ర‌తివాదులైన బీజేపీ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ‌, మాజీ ఎమ్యెల్యే ముజంధ‌ర్ సిర్సాల‌కు నోటీసులు జారీ చేసింది. దానిపై క‌విత‌పై సోష‌ల్ మీడియాలోగాని, మీడియా ముందు ఎవ‌రూ ఎలాంటి వాఖ్య‌లు చేయ‌కుడ‌ద‌ని న్యాయ‌స్థానం అదేశించింది. 

కోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఇవాళ ఢిల్లీలో రియాక్ట్ అయ్యారు. కోర్టు నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని, అందిన తర్వాత స్పందిస్తా.. కాస్త వేచిచూడమని అన్నారు. ‘‘ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో మేము ఎవరి పేర్లు లేవనెత్తామో వారికి సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీబీఐ నోటీసులు ఇస్తుంది.. ప్రతి ఒక్కరినీ విచారణకు పిలుస్తుంది.. సిబిఐ విచారణలో మద్యానికి మద్యం.. పాలకు పాలు తెలిపోతాయి’’ అని పర్వేశ్ వర్మ పేర్కొన్నారు.