వేణు స్వామి జ్యోతిష్యుడు కాదు- తస్మాత్ జాగ్రత్త!

జ్యోతిష్యులు సమస్య వచ్చినప్పుడు ధైర్యం చెప్పే సైకియాట్రిస్టుల్లా ఉండాలి తప్ప, సమస్యల్ని సృష్టించే సాడిస్టుల్లా ఉండకూడదు.

శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిషం- ఈ ఆరింటినీ షడంగాలు అంటారు. సనాతనంగా వస్తున్న విద్యలివి.

వీటిల్లో మొదటి రెండు భాషా జ్ఞానానికి సంబంధించినవి; ఛందస్సు కావ్య శాస్త్రానికి సంబంధించినది; నిరుక్తం వేదంలోని పదాల అర్ధాలను వడబోసి చెప్పేది- అంటే ఇది కూడా ఒక రకంగా భాషకి సంబంధించినదే; కల్పం పూర్తిగా వేద విధులకి సంబంధించిన శాస్త్రం; ఇక జ్యోతిషం ఖగోళ శాస్త్రం- గ్రహాల గతులు చెప్పి, అవి మానవాళిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే శాస్త్రం.

ఇక్కడ జనానికి పై వాటిల్లో ఏదీ అక్కర్లేదు, ఒక్క జ్యోతిషం తప్ప. ఎందుకంటే చాలామందికి భవిష్యత్తు తెలుసుకోవాలనే కోరిక. తమ సమస్యలకి తాము తప్ప ఏవో బయటి శక్తులే కారణం అనుకునే వాళ్లే ఎక్కువ. అందుకే జ్యోతిష్యులకి తప్ప మిగిలిన శాస్త్రాలు చదివిన ఎవరికీ సమాజంలో గుర్తింపు లేదు.

అలాగని ప్రస్తుతం చలామణీలో ఉన్న జ్యోతిష్యులంతా శాస్త్రం చదివారా అంటే లేదనే చెప్పాలి. దశాబ్దాల తరబడి మూల సంస్కృత జ్యోతిష్య‌ పాఠంలోని శ్లోకాలని ఔపోసన పట్టి, వాటి అర్థాలు గురువుల నుండి తెలుసుకుని; అప్పటికప్పుడు ఆ శాస్త్రాన్ని వల్లెవేసుకుంటూ ఉండే తరం ఉండేది. ఫలానా వ్యక్తి ఫలానా తిథిన ఫలానా సమయంలో తనువు చాలిస్తాడని చెబితే అది తూచా తప్పకుండా జరిగేది. ఆ రకంగా తమ అంత్యకాలాన్ని పాతికేళ్ల మునుపే డైరీలో రాసుకుని సరిగ్గా అదే సమయానికి సహజ మరణం పొందిన జ్యోతిష్యులు కూడా ఉండేవారు. ఆ తరం ఇప్పుడు లేదు.

బీవీ రామన్ పుస్తకాలు కొనుక్కుని చదివి తమకి తాము పెద్ద జ్యోతిష్యులుగా చలామణీ అయిపోతున్నవారే నూటికి 99 శాతం ఉన్నారిప్పుడు. ఎక్కాల పుస్తకం కొనుక్కుని అందులో పదో ఎక్కం వరకు నేర్చుకుని గణిత శాస్త్రంలో తాము ఉద్దండులం అని చెప్పుకునే వాళ్లని ఏమంటాం? నవ్వి ఊరుకుంటాం. ఎందుకంటే గణితశాస్త్రమంటే మనకి అవగాహన ఉంది కనుక. ఎటొచ్చీ జ్యోతిష శాస్త్రం మనకి అవగాహన లేకపోయే సరికి టీవీల్లో కూర్చుని నాలుగు గ్రహాల పేర్లు, నక్షత్రాల పేర్లు చెప్పి, గోచారం, గ్రహచారం అనే టర్మినాలజీ వాడే సరికి వాళ్లని జ్యోతిష్యులుగా గుర్తించేస్తాం. అది మన అజ్ఞానం.

పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎమ్మే జ్యోతిషం కోర్స్ ఉంది. మనకి టీవీల్లో కనిపించే జ్యోతిష్యులని ఆ సిలబస్సులో వాళ్లు కనీసం విన్న అంశాలు ఎన్నున్నాయో చెప్పమంటే అసలు వాళ్లల్లో డొల్లతనం ఎంతో అర్ధమవుతుంది.

సరే అవన్నీ పక్కన పెడదాం. ప్రస్తుతం వివాదంలో ఉన్న సో కాల్డ్ జ్యోతిష్యుడు వేణు స్వామి. “సో కాల్డ్” అని ఎందుకు అనాల్సి వస్తోందంటే అసలితను జ్యోతిష్యుడే కాదు. తనకి జ్యోతిష్యమే రాదు. ఈ విషయం తానే స్వయంగా గతంలో బాబు గోగినేని ముందు ఒప్పుకుని టీవీ షో నుంచి పలాయనం చిత్తగించాడు. నిజంగా శాస్త్రం తెలిసినవాడు వాదనకి కూర్చోగలగాలి. ఒక హేతువాది ప్రశ్నలకి తాను చదివిన శాస్త్ర ప్రకారం సమాధానాలు చెప్పగలగాలి. పొట్టలో మందుచుక్కలు తప్ప అక్షరం ముక్కలు లేని వేణు స్వామికి ఆ ధైర్యం ఎక్కడుంటుంది. అవును తాను తాగుతానని ఆయనే ప్రకటించాడు కనుక “మందు చుక్కలు” అని ప్రస్తావించాల్సి వచ్చింది.

మళ్లీ ఈ మధ్యన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి తప్పుడు ప్రెడిక్షన్ చెప్పాక, జనం తిడుతుంటే, బిక్కమొహం వేసుకుని ఇక తాను ప్రెడిక్షన్స్ చెప్పను అని చెప్పాడు. అది జరిగి రెండు నెలలు కూడా కాలేదు. తాజాగా నాగ చైతన్య-శోభిత నిశ్చితార్ధం చేసుకుంటే, వాళ్ల పెళ్లి 2027 లోపు పెటాకులౌతుందని ప్రెడిక్షన్ చెప్పాడు. అసలితను ఫేమస్ అయ్యిందే సమంత-నాగ చైతన్య విడిపోతారని చెప్పడం-అది జరగడం.. వల్ల. అతను చెప్పగా తప్పులైన 10 విషయాలు వదిలేసి నిజమైన ఆ ఒక్కటీ పట్టుకుని తనని తాను మార్కెట్ చేసుకున్నాడు.

జ్యోతిష్యుడికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం గోప్యత. అడిగిన వాళ్లకి చెప్పాలి. అది కూడా వాళ్లకి మాత్రమే చెప్పాలి. అంతే తప్ప బాహాటంగా చెప్పడం శాస్త్రవిరుద్ధం. శాస్త్రం దాకా వెళ్లనక్కర్లేదు.. ఇంగిత జ్ఞానం చాలు దీనికి.

సమాజంలోని అధిక శాతం ప్రజల్లో ఒక రుగ్మత ఉంది. డ్రెస్ కోడ్ మెయింటేన్ చేస్తూ, గ్రహాల గురించి మాట్లాడుతూ, తీవ్ర దేవతల పూజలు చేసే వారంటే భయపడిపోతారు. వాళ్లల్లో నిజంగా శక్తులున్నాయనో, లేక శక్తుల్ని దింపగలరనో నమ్మేస్తారు. ఎటువంటి వ్యక్తులకి దైవశక్తులు పలుకుతాయో అనే కనీసమైన లెక్క వేసుకోరు. దీనినే వాళ్లు క్యాష్ చేసుకుంటారు.

ఫలానా హీరోయిన్ కి ఫలానా పూజ చేయించాడు కనుక ఆమె కెరీర్ బాగుంది అని ప్రచారం. చేయించినా మంచి రోజులు రాని వారి గురించి మాట్లాడడు. అంతెందుకు అంత శక్తే ఉంటే తన వాక్శుద్ధి ఏమయింది? తాను చెప్పిన ఆంధ్ర ఎన్నికల ఫలితాలు మొదలైనవి నిజం కాలేదు కదా.

అన్నట్టు తాజాగా అతను బోర్డ్ మీద రాసి చక్రం వేసి మరీ శోభిత, నాగ చైతన్యల బంధం సజావుగా సాగదని చెప్పాడు కదా! ఆ జాతకచక్రం అసలు నిజం కాదట. తాను అనుకున్న చక్రమేదో వేసి, మనసులో ఉన్న భావాలు బయట పెట్టేసాడంతే. నిజమైతే మార్కెట్ చేసుకుకోవచ్చు, తప్పైతే సైలంటుగా ఉంటే జనం అదే మర్చిపోతారనే ధీమా!

“సత్యం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యం అప్రియం” అని శాస్త్రం. “నిజమే పలకాలి. అయితే నిజమే అయినా మంచి విషయం కాదనుకున్నప్పుడు పలకకూడదు” అని అర్ధం.

ఇవన్నీ వేణుస్వామికి ఏం తెలుస్తాయి?

ఎంత మంది జనం గడ్డి పెడుతున్నా, ఎన్ని టీవీ చానల్స్ ఛీ కొడుతున్నా వేణు స్వామి తన సహజ నైజాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నాడు.

ఇంతా చేసి “నేను నా మాట మీదే నిలబడుతున్నాను. సెలెబ్రిటీ జాతకాలు, రాజకీయ విశ్లేషణలు చేయను. ఇది కూడా ఎందుకు చెప్పానంటే గతంలో సమంత విషయం చెప్పాను కనుక దానికి కొనసాగింపుగా చెప్పాను తప్ప ఇది కొత్త టాపిక్ కాదు” అంటున్నాడు.

జాతకాలు నమ్మే జనం నమ్ముతారు, నమ్మని వాళ్లు నమ్మరు. సగం నమ్మి సగం నమ్మని వాళ్లూ ఉంటారు.

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణాలు, వర్షపాతం లెక్కల వరకు నమ్మి రాశి ఫలాలు చదవకుండా పంచాంగం పక్కన పెట్టేసే వాళ్లూ ఉంటారు. ఎవరెలా ఉన్నా ప్రజల్ని జాతకాలకి బానిసల్ని చేయకూడదు, ప్రజలు అవ్వకూడదు.

స్వయంకృతాపరాధాలు, వ్యక్తిత్వంలో లోపాలు, తనను తాను అంచనా వేసుకోవడంలో పొరపాట్లు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి తప్ప ఏదో గ్రహానికి పూజ చేసేస్తే మారిపోదు. మనిషి తనలోని తప్పుల్ని ఒప్పుకునే శక్తి లేకనో, ఈగో వల్లనో గ్రహాలకి పూజలు చేసి ఇక నుంచి అంతా మంచే జరుగుతుంది అని ఫీలయ్యి పాజిటివ్ థింకింగ్ తో ఉండడం వల్ల ఫలితం మారొచ్చు. ఆ మార్పు పాజిటివ్ థింకింగ్ వల్ల, తద్వారా చేసిన పనుల వల్ల తప్ప గ్రహానికి పూజ వల్ల కాదని చాలామంది గుర్తించరు.

అయినా పర్వాలేదు. “ప్లేస్-బో ఎఫెక్ట్” అని ఒకటుంటుంది. నిజంగా మందు కాకపోయినా, మందు అని చెప్పి, బాధితుడి చేత మింగిస్తే నొప్పో, బాధో తగ్గిన ఫీలింగొస్తుంది అతనికి. అంతా జస్ట్ సైకలాజికల్. అలా మానసికంగా పాజిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందనుకుంటే జాతకాల్ని ఆశ్రయించడం తప్పు కాదు. అంతే తప్ప కుహనా జ్యోతిష్యుల్ని నమ్మి, వాళ్ల మాయలో పడి, ఆర్ధికంగా దెబ్బ తినే పనులు చేయాల్సిన అవసరం లేదు.

నిజమైన జ్యోతిష్యులు అలా ప్రజల్ని దోచుకోరు. అసలు వాళ్లు ప్రచారం కూడా చేసుకోరు. జ్యోతిష్యులు సమస్య వచ్చినప్పుడు ధైర్యం చెప్పే సైకియాట్రిస్టుల్లా ఉండాలి తప్ప, సమస్యల్ని సృష్టించే సాడిస్టుల్లా ఉండకూడదు.

– దర్భశయనం శ్రీరామకృష్ణ

23 Replies to “వేణు స్వామి జ్యోతిష్యుడు కాదు- తస్మాత్ జాగ్రత్త!”

  1. బలిసిన వీధి పిచ్చి కుక్క వీడు. రాళ్ళు వేసి దూరం గా తరమాలి తప్పితే, ఇంట్లో కి రానియ్య కూడదు

  2. GA లో జర్నలిస్టులు అనే వాళ్ళు లేరు, తస్మాత్ జగ్రత్త. అందరూ ఇంట్లో కూర్చొని వైకాపా పార్టీ కంటెంట్ ప్రచారం చేయటమే ఉద్యోగుల పని. సినిమా రివ్యూస్ మాత్రమే ఈ సైట్ నుంచి నిక్కచ్చిగా వచ్చేది

  3. నలభై రోజుల్లో జోతిష్యం నేర్చుకోవచ్చు అనే పుస్తకం కొని జాతకం వెయ్యడానికి ప్రయత్నం చేస్తే నా వల్ల కాలేదు.

    1. దానికి అండకోశమే లేనప్పుడు, పవన్ ఎంత పోటుగాడైనా దానికి కడుపు ఎలా వస్తుంది? అసలే బెంగళూర్ వెళ్ళొచ్చి,

    2. అసలే బెంగళూరులో “ఆ పరేషాన్” చేయించుకొని, ఈమధ్యనే rest తీసుకుంటున్న 4 నాలుగో పెళ్ళాం గురించేనా!

      1. అవును..

        “సాక్షాత్తు మహిళ ఐన Jeggulu ఆ0టీ” పవన్ అంకుల్ తో h*neymoon కోసం లండన్ కి ప్రపోజల్ పెట్టి PASSPORT కూడా ready చేసుకుంది.

  4. ycp గెలుస్తుంది అని చెప్పగానే ఆ వేణి స్వామి కి భయంకరమైన eకవరేజ్ఈచ్చింది గ్రేటంద్ర కాదా ?

  5. ఆయన చెప్పడం మానేయాలంటే పెట్టిన వీడియోస్ చూడకూడదు, మీడియా అటెంషన్ ఇవ్వకూడదు, ఎవరూ ఇంటర్వూస్ కి పిలవకూడదు. తాను చెప్పిన జ్యోతిష్యం ని ప్రచారం చేయకూడదు.

    ఆయనకి కావాల్సిందే పబ్లిసిటీ… మీరు అది వచ్చేలా చేసినంత కాలం అతను ఇలాగే చేస్తాడు…

      1. పాపం మీ అన్న చంద్రన్న గ్రహస్థితులు బాగాలేక.. పప్పుగాడిని వెంటేసుకుని విజయవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించినప్పుడు, తిరుమల దేవాలయంలో తవ్వకాలు జరిపినప్పుడు ఇదే ప్రశ్న అడిగుంటే బాగుండు ర.. B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M వెధవ.

    1. ఆపైన రాసిన రచయిత ఆర్టికల్ పంపితే అచ్చేశారు ర. నువ్వు పంపితే అచ్చేస్తారు. ఇక్కడ రచయిత లు చాలామంది రాస్తుంటారు దాని వ్యూయర్షిప్ ను బట్టి పబ్లిష్ చేస్తుంటారు.

    2. ఆపైన రాసిన రచయిత Art!cle పంపితే అచ్చేశారు ర. నువ్వు పంపితే అచ్చేస్తారు. ఇక్కడ రచయిత లు చాలామంది రాస్తుంటారు దాని వ్యూయర్షిప్ ను బట్టి పబ్లిష్ చేస్తుంటారు.

Comments are closed.