వ‌ర్కౌట్ కాక‌పోవ‌డం వ‌ల్లే టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?

ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌లో పోటీపై టీడీపీ వెన‌క్కి త‌గ్గింది. బ‌రిలో నిలిస్తే గెలిస్తే ఓకే, లేదంటే ప‌రువు పోతుంద‌ని టీడీపీ నేత‌లు ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ని స‌మాచారం. టీడీపీ అధికారంలో…

ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌లో పోటీపై టీడీపీ వెన‌క్కి త‌గ్గింది. బ‌రిలో నిలిస్తే గెలిస్తే ఓకే, లేదంటే ప‌రువు పోతుంద‌ని టీడీపీ నేత‌లు ఒక అభిప్రాయానికి వ‌చ్చార‌ని స‌మాచారం. టీడీపీ అధికారంలో వున్న నేప‌థ్యంలో పోటీ చేయ‌డ‌మంటూ జ‌రిగితే క‌చ్చితంగా గెలుపుపై భ‌రోసా వుండాలి. ఏ ర‌కంగా చూసినా టీడీపీ అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశాల్లేవు.

స్థానిక సంస్థ‌ల్లో టీడీపీ బ‌లం చాలా త‌క్కువ‌. వైసీపీకి మంచి మెజార్టీ వుంది. ఇప్ప‌టికే వైసీపీ త‌ర‌పున మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నామినేష‌న్ కూడా వేశారు. ఇవాళ్టితో నామినేష‌న్ గ‌డువు ముగుస్తుంది. నిజానికి పోటీ చేయాల‌నే ఉద్దేశంతోనే టీడీపీ పావులు క‌దిపింది. అయితే గెలుపున‌కు కావాల్సినంత మందిని రాబ‌ట్టుకోలేమ‌ని అర్థ‌మై, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ బ‌రి నుంచి త‌ప్పుకోవ‌డ‌మే గౌర‌వంగా వుంటుంద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ఎన్నిక విష‌య‌మై ఇప్ప‌టికే కూట‌మి, వైసీపీ మ‌ధ్య డైలాగ్ వార్ న‌డిచింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలిచి తీరుతామ‌ని జ‌న‌సేన ఎమ్మెల్యే వంశీకృష్ణ‌యాద‌వ్ బీరాలు ప‌లికారు. ఆయ‌న రాజీనామాతోనే ఉప ఎన్నిక వ‌చ్చింది. ఇప్పుడు వంశీకృష్ణ‌నే వైసీపీపై క‌వ్వింపు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇవాళ టీడీపీ నుంచి నామినేష‌న్ వేయ‌క‌పోతే బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్టు ప్ర‌క‌టిస్తారు. బొత్స గెలుపును వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం కూడా వైసీపీకి క‌లిసొచ్చే అంశంగా ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, గెల‌వాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను చెబుతూ వ‌చ్చారు. అటు వైపు వెళ్ల‌కుండా జ‌గ‌న్ దిశానిర్దేశం ఎంతోకొంత ప‌ని చేసే అవ‌క‌శాలున్నాయి. ఏది ఏమైనా బొత్స‌లాంటి సీనియ‌ర్ నాయ‌కుడు మండ‌లిలో అడుగు పెడితే వైసీపీకి రాజ‌కీయంగా ప‌ని కొస్తుంది.

25 Replies to “వ‌ర్కౌట్ కాక‌పోవ‌డం వ‌ల్లే టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?”

  1. నిన్న కాక మొన్న ప్రజలు తిరస్కరించిన నత్తి సత్తి గాడు కాకుండా వేరే ఎవరూ లేరా?

  2. నీ party leaders తో నువ్వు vote లు veyinchukuni gelavadam కూడా విజయమా?? అదేదో జనరల్ పబ్లిక్ ఓటు వేసి మళ్లీ వాడి papaala పాలన మళ్లీ కోరుkuన్నట్టు నీ build-up ఏంటి?

    1. ఈ—ముక్క—మీ—లంగా—గాడితో—చెప్పు——గుద్దలో—దమ్ము—ఉంటే—పిఠాపురం—పాపని—ట్రై—చెయ్యమను—

  3. బొత్స గెలిచిన తరువాత ఫ్రీ గా కూటమికి జై కొడతాడేమో, అలాంటపుడు వీళ్ళు ఖర్చు పెట్టడం దండగని ఊరుకొని ఉంటారు.

  4. “గెలవడం కష్టం కాదు హుందా రాజకీయం చేద్దామని వెనక్కు తగ్గింది”. ఎందుకో ఇది చదవగానే పతంజలి రాసిన “వీరబొబ్బిలి” పాత్ర గుర్తుకు వచ్చింది, బాబుకు

    సరిపోలే పాత్ర ఎప్పుడో సృష్టించబడింది గుర్తించడం లేట్ అయింది అంతే !

    1. ha ha ala chese vallu aithe standing commite elections lo enduku poti chesaru . corporaters ni lagesthunnaru . mayers ni dinchataiki prayathnisthunnaru .

      ikkada chala ekkuva madi vundatam valla konadaniki veelu padatam ledu anthe . hundatahanm ledu bokka ledu

  5. నాకు మటుకు వీడు do గ అని ముద్ర వేసినవాడికంటే అవే లక్షణాలు దాచిపెట్టిన ఎప్పుడు దొరకకుండా ఉండేవాడు చాలా ప్రమాదం అనిపిస్తుంది. విపక్ష పక్షి అయినా, అధికార పక్ష ఆషాఢభూతి అయినా.

  6. A1నత్తి పకోడి తో బొచ్చు నత్తి

    నీ పార్టీ మనుషులతో votes వేయించుకుని నీ బొచ్చు గాడిని MLC చేసి పారిపోకుండా ఉంచుకోవడ0 కూడా పెద్ద విజయమా?? అవును లే ఆడు అయితే నీకు correct నత్తి మొగుడు..

  7. అసలు రోజు రోజుకు నీకు సిగ్గు లేకుండా పోతోంది. ఇందాకే ఈ ఆర్టికల్//బాబు చాణక్య తెలివిపై ఉత్తరాంధ్ర తమ్ముళ్ల గుస్సా!//

    చదివా. నువ్వూ నీ సిగ్గులేని రాతలు

  8. //బాబు చాణక్య తెలివిపై ఉత్తరాంధ్ర తమ్ముళ్ల గుస్సా!//

    ఇందాకే ఈ ఆర్టికల్ చదివా. నువ్వూ నీ సిగ్గులేని రాతలు.

  9. పెద్దల సభను కేవలం విద్యావంతులు మాత్రమే ఎన్నుకొనే లాగా చట్టాన్ని మార్చాలి అతున్నత దర్యాప్తు సంస్థ ను ఈ సభ కు మాత్రమే నిర్వహించే అధికారం ఉండాలి కొంతైన దర్యాప్తు సంస్థలు పారదర్సకం గ ఉంటాయి

  10. గెలిచినోళ్ళని ప్రలోభ పెట్టడం ఆ ముఠాకి తెలిసిన విద్యే..ఈ mlc ఖాళీ అయింది అలాగే కదా..

Comments are closed.