కుల వ్య్వవస్థ చాలా మంచిది.. దేశానికి మేలు !

మన దేశంలో కుల వ్యవస్థ అనేది చాలా చెడ్డదని, కులాల కారణంగానే సమాజంలో అంతరాలు ఉన్నాయని హేతువాదులు, సామాజిక వేత్తలు, యాక్టివిస్టులు, ప్రధానంగా కమ్యూనిస్టులు చెబుతుంటారు. కుల వ్యవస్థ మీద తెలుగులోనూ చాలా పుస్తకాలు…

మన దేశంలో కుల వ్యవస్థ అనేది చాలా చెడ్డదని, కులాల కారణంగానే సమాజంలో అంతరాలు ఉన్నాయని హేతువాదులు, సామాజిక వేత్తలు, యాక్టివిస్టులు, ప్రధానంగా కమ్యూనిస్టులు చెబుతుంటారు. కుల వ్యవస్థ మీద తెలుగులోనూ చాలా పుస్తకాలు వచ్చాయి. ఇతర భాషల్లో వచ్చిన పుస్తకాలు అనువాదమయ్యాయి.

హిందువుల్లో కుల వ్యవస్థను చీదరించుకొని వేరే మతాల్లోకి మారిపోయినవారూ ఉన్నారు. రాజ్యాంగం రాశాడని చెబుతున్న డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించారు. బుద్ధుడు కుల వ్యవస్థను వ్యతిరేకించాడని చెబుతారు. మన దేశంలో ఆధిపత్య కులాలు, అణగారిన కులాలు ఉన్నాయి. ఆధిపత్య కులాలు ఎప్పుడూ కింది కులాలను అణిచివేయాలని చూస్తుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కుల ఘర్షణలు జరిగాయి. ఊచకోత ఘటనలు జరిగాయి. మారణ కాండ జరిగింది. వెలివేతలు జరిగాయి. ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. నిమ్న కులాలకు సమాన అవకాశాలు రావడానికి, వారు అభివృద్ధి చెందడానికే రిజర్వేషన్లు పెట్టారు.

అంబేద్కర్ పదేళ్లు అంటే, రాజకీయ ప్రయోజనాల కోసం అరవై ఏళ్లకు పైగా కొనసాగిస్తున్నారు. చివరకు అది వెర్రి తలలు వేస్తోంది. అగ్ర వర్ణాలుగా చెబుతున్నవారికి అవకాశాలు కరువైపోతున్నాయి. కుల వ్యవస్థ, రిజర్వేషన్లు అనేది ఒడవని చర్చ. కులాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టు పార్టీలు సమసమాజం మంత్రం జపిస్తుంటాయి.

పాత తరం కమ్యూనిస్టులు తమ పేరు పక్కన కులం పేరు సూచించే రెడ్డి, చౌదరి, శర్మ, శాస్త్రి ఇలాంటివి తీసేసేవారు. కానీ ఇప్పుడు ఆ పని చేయడంలేదు. ఒక కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘాల్లో కుల నిర్మూలన సంఘం ఉంది. ఎక్కువమంది కులాంతర వివాహాలు చేసుకుంటే కులం అంతరిస్తుందని వీరి అభిప్రాయం.

కానీ చట్ట ప్రకారం అలాంటిది ఏమీ జరగదు. భార్యా భర్తల కులాలు మారవు. వాళ్ళ పిల్లలకు మాత్రం తండ్రి కులం వర్తిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణా కంటే ఆంధ్రాలో కుల ప్రభావం ఎక్కువ. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా కథ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులం లేకుండా భారత దేశం లేదు.

ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే .. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్ ) అధికార పత్రిక “పాంచజన్య ” తాజాగా కుల వ్యవస్థను గట్టిగా సమర్ధించింది. కుల వ్యవస్థ వల్లనే భారత దేశం ఐక్యంగా ఉందని తేల్చిపారేసింది. మొఘల్ పాలకులు కుల వ్యవస్థను అర్ధం చేసుకోలేదని చెప్పింది.

కానీ బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు అనే విధానంలో దేశాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేశారని చెప్పింది. అసలు పాంచజన్య ఇలా ఎందుకు చెప్పిందంటే …కాంగ్రెస్ పార్టీ కుల గణన చేయాలని డిమాండ్ చేస్తోంది కదా.

దాన్ని విమర్శిస్తూ కుల వ్యవస్థను సమర్ధించిందన్నమాట. హిందువుల ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్ కుల గణనను సాధనంగా ఎంచుకుందని మండిపడింది. బ్రిటీషర్ల మెంటాలిటీ, కాంగ్రెస్ మెంటాలిటీ ఒకటేనని చెప్పింది. మొత్తం మీద దేశ ప్రజలను చీల్చడమే కాంగ్రెస్ లక్ష్యమంది.

10 Replies to “కుల వ్య్వవస్థ చాలా మంచిది.. దేశానికి మేలు !”

  1. కులం ఒక జన్యువు. అది ఎవరూ కాదనలేని సత్యం. కుల వ్యవస్థ లేకపోతే కొందరికి అధికారం దక్కేది కాదు.మరి కొందరికి రిజర్వేషన్ ఉండేది కాదు. కానీ కుల వృత్తులను రూపుమాపడం వల్ల నిరుద్యోగం ప్రబలింది. కొండొకచో మానవ వనరులు లోపిస్తున్నాయి. ఇక్కడ డబ్బు ఎందుకు కోరగావడం లేదు.

  2. మా ఇంటిలో ఆకులో వడ్డిస్తాం అన్న బెమ్మడు రాడు. నాకూ నీచు వాసనా పడదు అంటాడు, ముక్కు మూసుకుంటాడు. మిగతా అందరము ఎక్కడికి వెళ్లి అయినా విస్తరియ్యగలం ఎందుకో మరి! కులమా? మాంసాహారి, శాకాహారి య? ఏది విడదీస్తోంది?

  3. కుల వ్యవస్థలో , కుల వృత్తి లో తప్పు లేదు GA….. ఈ స్వతంత్ర దేశంలో ఎవడి కులం వాడికి గొప్పే….కానీ ధన బలం లేక, వాడి కులం ను వాడే తక్కువ అనుకుని రెడ్డి గారో , నాయుడు గారో చెప్పినట్టు బతకడం వల్లే సమస్య…. వాళ్ళు నుంచుని నమస్కారం పెట్టినంత వరకే మీకు ఈ డాబు దర్పం….

  4. ప్రపంచం లో అన్ని నాగరికతలలో కులాలు ఉండేవి.. అవి కనుమరుగు అయిన చోట.. మూలాలు నశించిన చోట.. ఇతర మతాలు అక్కడ వ్యాప్తి చెందాయి.. మన దేశం లో కులం పటిష్టంగా ఉండటం వలన ధర్మం నిలబడింది.. ఇతర మతాల వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.. కులం అన్నది మూలం.. ఆ మూలం మారిచిపోతే.. ఆ అయోమయం లో.. అంధకారం లో.. అగమ్యగోచరం లో.. మతం మరే ఆస్కారం చాలా సులువు…

  5. scst బీసీ లకు రిజర్వేషన్స్ ఇస్తున్నారు కానీ ఆయా కులాలలో పేద ప్రతిభావంతులకు చెందవలసిన సీట్స్ ఆయా కులాలలో బలసిన వారి పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ లో చదివి రిజర్వేషన్స్ ఫలాలను తన్నుకు పోతున్నారు అలాగని ఓసీ పేద పిల్లలకు కూడా ఇదే పరిస్థితి ఓపెన్ సీట్స్ వాళ్ళు పొందలేరు చివరకు తేలేది పేదల పిల్లలు పొందలేరని దీనికి పరిస్కారం కులం తో పాటు పెదకారికాన్ని చదివిన స్కూల్ ని కూడా బేరీజు వేసి ఇవ్వాలి అప్పుడే ప్రతిభావంతులు కు అవకాశాలు దొరుకుతాయి

  6. భారత దేశ ఔన్నత్యం కులాల పాత్ర వల్లనే. నిస్ట్నాథులను తయారు చేసింది ఈ కుల వ్యవస్థే. అరిషడ్వర్గల్లాలో ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ లేదు. దేవుని ఊరేగింపు లో బ్రాహ్మణునికి, మాదిగకు భాగం వుంది , ఒకరు లేక పొతే ఇంకొకరు కదలరు. పెళ్లి లో కూడా అంతే. ఒకరి కులం లో ఇంకొకరు వేలు పెట్టడం వల్లనే ఈ బాధలు. బ్రాహ్మణుడు వచ్చి ఒక మంగలి ఇంట్లో పెళ్లి క్రతువు నిర్వహించి, మనస్ప్పోర్తిగా దీవించి, దక్షిణ తాంబూలాలలు తీసుకెళ్తే ఇంకా ఏంటి ఇబ్బంది? అతను భోజనం చేసి వెళ్లాలనే నిబంధన ఏమి లేదు కదా? ఇవన్నీ మనం సృష్టించుకున్నవే.

Comments are closed.