మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడి అరెస్ట్‌!

అగ్రిగోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ జ‌ప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయ‌డం, అనంత‌రం ఇత‌రుల‌కు విక్ర‌యించార‌ని, పూర్తిగా అక్ర‌మాల‌కు…

అగ్రిగోల్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ జ‌ప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయ‌డం, అనంత‌రం ఇత‌రుల‌కు విక్ర‌యించార‌ని, పూర్తిగా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌పై రాజీవ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇవాళ ఉద‌యం ఇబ్ర‌హీంప‌ట్నంలోని జోగి ర‌మేశ్ నివాసంలో 15 మంది ఏసీబీ బృందం సోదాలు చేప‌ట్టింది. ప‌లు పైళ్ల‌ను త‌నిఖీ చేసింది. అనంత‌రం ఈ కేసులో ఏ1 నిందితుడైన జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను అరెస్ట్ చేసి తీసుకెళుతున్న సంద‌ర్భంలో రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ త‌న తండ్రిపై రాజ‌కీయ క‌క్ష‌తో త‌న‌ను అరెస్ట్ చేశార‌ని ఆరోపించారు. అంద‌రూ కొన్న‌ట్టే ఆ భూమిని తాము కొన్నామ‌న్నారు.

ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. న్యాయం పోరాటం చేస్తామ‌న్నారు. కొడుకు అరెస్ట్ నేప‌థ్యంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ మీడియాతో మాట్లాడుతూ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూముల్ని ఎవ‌రైనా కొంటారా? అని ప్ర‌శ్నించారు. అది కూడా 2300 గ‌జాల భూమి అని ఆయ‌న అన్నారు.

త‌న‌పై క‌క్ష వుంటే తీర్చుకోవాల‌ని ఆయ‌న కోరారు. త‌న కుమారుడిపై క‌క్ష తీర్చుకోవాల‌ని అనుకోవ‌డం న్యాయ‌మేనా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాలు వ‌స్తుంటాయ్‌, పోతుంటాయ్ అని ఆయ‌న అన్నారు. ఇదిలా వుండ‌గా జోగి రాజీవ్‌ను గొల్ల‌పూడిలోని ఏసీబీ కార్యాల‌యానికి త‌ర‌లించారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం కోర్టుకు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.

17 Replies to “మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడి అరెస్ట్‌!”

  1. నాకు తెలియక అడుగుతాను, cid జప్తు లో ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సమాచారం ఇవ్వరా? అందుకేనేమో జగన్ బిల్లు లో కమిటీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే అమ్మాలి అని రూల్ పెట్టి ఉంటారు.

  2. ఒ’రేయ్ గూర్ఖా రమేష్.. నువ్వు నిజంగా ఒక అబ్బ కే పుట్టింte మందిని ఏసుకుని చంద్రబాబు ఇంటి గేట్ తాకు చూద్దాం..

  3. గూర్ఖా రమేష్

    next

    గుట్కా నాని

    తర్వాత గంజాయి వంశీ

    ఆ తర్వాత

    ఆంబోతు రాంబాబు

    Final గా

    ల0గా Leven lanjaa***

    ఇంతకీ గోరంట్ల maadav ఏకడ??

  4. జోగి రమేష్ తన పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై దాడికి కనీసం వంద కార్లతో నాలుగు వందల మందిని తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు జరిగితే.. . ఆయనకు మద్దతుగా పట్టుమని పది మంది కూడా రాలేదు. ఆయన కుమారుడ్ని అ రెస్టు చేసి తీసుకెళ్తూంటే.. కారు ముందు అడ్డం పడి బలం చూపించేవారు కూడా లేరు. జోగి ఇంటి దగ్గర పోలీసులు, ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధులు తప్ప.. ఆయన అనుచరులు ఎవరూ కనీసం నైతిక మద్దతు ఇవ్వడానికి కూడా రాలేదు. వై సీ పీ మార్క్ రాజకీయంలో చివరికి మిగిలేది?

  5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి ఉంటే ఒక్క ఆస్తి కూడా ఉండేది కాదు Jogi Ramesh

    జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశారు…

    సర్వే నంబరు మార్చేసి.. వాటిని కొట్టేసి తన కొడుకు బాబాయ్‌ పేరిట మార్చేసి.. ఏకంగా ప్రహరీ నిర్మించేశారు….

    వాటి యజమానులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా జోగి రమేష్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడు కావడంతో విచారణ లేకుండా తొక్కిపెట్టారు….

    విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో రీ సర్వేనంబరు 87లో అవ్వా వెంకట శేషునారాయణరావు, వారి బంధువులకు భూములు ఉన్నాయి….

    వీరు అగ్రిగోల్డ్‌ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు అగ్రిగోల్డ్‌ కేసులో ప్రభుత్వం రీసర్వే నంబరు 87లో 2,293.05 గజాల స్థలాన్ని జప్తు చేసింది…. వాటిపై వైకాపా నాయకుల కన్ను పడింది పక్కా ప్రణాళిక వేశారు….

    అంబాపురంలోనే రీసర్వే నంబరు 88లో పోలవరపు మురళీమోహన్‌ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్‌ 1,074 గజాలు ఆయన బాబాయ్‌ జోగి వెంకటేశ్వరరావు 1,086 గజాలు కొని 2022లో రిజిస్టర్‌ చేయించారు…

    ఆ దస్తావేజుల్లో సర్వే నంబరు 88 అని స్పష్టంగా ఉంది తర్వాత నెల రోజులకే తమ దస్తావేజుల్లో సర్వే నంబరు 87కు బదులు 88 అని తప్పుగా నమోదైందంటూ దరఖాస్తు చేశారు…

    అప్పటికే జోగి రమేష్‌ మంత్రిగా ఉండటంతో ఏమాత్రం విచారణ లేకుండా అధికారులు సర్వే నంబరు మార్చేశారు….

    వెంటనే అమ్మకం దొంగదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే 2023 మే నెలలో వైకాపా కార్పొరేటర్‌ పడిగపాటి చైతన్యరెడ్డి బంధువులకు అమ్మేశారు…..

  6. చరిత్రలో అబ్బా — కొడుకు ఒకేరోజు అరెస్టు అయిన సందర్భం ఈరోజు చూడబోతున్నామా??? అయితే సాయంత్రం వరకు వేచి చూడండి

  7. చరిత్రలో అబ్బా — కొడుకు ఒకేరోజు అ రె స్టు అయిన సందర్భం ఈరోజు చూడబోతున్నామా? అయితే సాయంత్రం వరకు వేచి చూడండి

Comments are closed.