30 కోట్లా? వార్నాయనోయ్!

తెలుగు థియేటర్ మార్కెట్ మొత్తం కలిపినా అయిదు కోట్లు వుండదు.. కానీ దానికి అయిదింతలు కావాలంటే ఏ నిర్మాత మాత్రం ధైర్యం చేస్తాడు.

డ్యాన్స్ మాస్టర్ అతగాడు. అనుకోకుండా దర్శకుడయ్యాడు. హీరో అయ్యాడు. హిట్ లు వున్నాయి, ఫ్లాపులు వున్నాయి. కానీ ప్రస్తుతం లెక్కలు చూసుకుంటే తెలుగులో పెద్దగా మార్కెట్ అయితే ఏమీ లేదు.

గత కొంతకాలంగా వచ్చిన సినిమాలు అన్నీ థియేటర్ రెంట్లు కూడా పెద్దగా రాబట్టని సినిమాలే. అయినా రెమ్యూనిరేషన్ విషయంలో తగ్గేదే లే అన్నట్లున్నాడట. రేటు విషయంలో తగ్గకుండా వుండడం కాదు. రేటు వుంటే గుండె గుభేల్ అంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పోనీ అడిగినంత ఇచ్చేసి, సిన్మా స్టార్ట్ చేయాలన్నా, మళ్లీ టెక్నికల్ క్రూ, హీరోయిన్ ఇలా అన్నింటిలో హీరో సెలక్షన్ కూడా వుంటుంది. అక్కడ తగ్గించుకుందాం అన్నా కుదరదు. ఎందుకంటే ఇవ్వాళ రేపు సరైన హీరోయిన్ లేకుండా హిట్ కొట్టడం కొంత మంది హీరోల వల్ల కావడం లేదు. అందమైన హీరోయిన్ ను తెచ్చుకుని పాటలు, డ్యాన్స్ లు చేయించుకుని, హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం అన్నది ఓ స్ట్రాటజిగా మారిపోయింది.

నిజానికి చాలా మంది హీరోల రేట్లు ఇలాగే వున్నాయి. అది వేరే సంగతి. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో మాత్రం అడుగుతున్నది 25 కోట్లకు పైగానే అంట. తెలుగు థియేటర్ మార్కెట్ మొత్తం కలిపినా అయిదు కోట్లు వుండదు.. కానీ దానికి అయిదింతలు కావాలంటే ఏ నిర్మాత మాత్రం ధైర్యం చేస్తాడు. రెండు భాషల్లో కలిపినా మహా అయితే మరో అయిదు కోట్లు జోడించుకోవచ్చు. అంతకు మించి వుండదు. నాన్ థియేటర్ అన్నది ఇప్పుడు లాటరీ లా తయారైంది. నిర్మాతకు వున్న ఇన్ ఫ్లూయన్స్ కీలకం అయిపోయింది.

తెలుగులో పాతిక కోట్లు తీసుకునే హీరో నాన్ థియేటర్ యాభై కోట్లు రావడం లేదు. అంటే అందులో సగం హీరోనే తీసేసుకుంటున్నారన్న మాట. థియేటర్ మార్కెట్ మరో పాతిక వుందనుకుంటే… యాభై కోట్లలో సినిమా ఎలా తయారవుతుంది?

15 Replies to “30 కోట్లా? వార్నాయనోయ్!”

  1. దెయ్యాల సినిమాలు sequels తీసే అతని పేరు రాయడానికి కూడా భయమేనా? రేపొద్దున అతని దగ్గరికి కూడా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి వస్తుంది అనా?

  2. ప్రేక్షకులే ఇలాంటి వాళ్ళను బహిష్కరిస్తున్నారు, నిర్మాతలు ఆ పనేందుకు చేయలేకపోతున్నారు?

Comments are closed.