చంద్రబాబు రాజకీయానికి పవన్ విలవిల

గతచరిత్రలో ఇలాంటి ఘటనలు చంద్రబాబు జీవితంలో లెక్కకు మించి ఉండవచ్చు కానీ తాజాగా మాత్రం ఇవే చెప్పుకోవాలి.

చంద్రబాబు రాజకీయం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. తన నాలుగున్నర దశాబ్దాల పర్యంతపు రాజకీయ చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు. తనకు కావాల్సింది సాధించడంలో తనకంటే సిద్ధహస్తుడైన రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో లేకపోవచ్చు.

ఎందుకంటే ఇక మోదీతో మళ్లీ పొత్తుకు చాన్సే లేదనుకుంటే అందరూ అవాక్కయ్యేలా, ప్రత్యర్ధులు నెవ్వెరబోయేలా మోదీతో కలిసి ఎన్నికల బరిలో నిలబడ్డాడు.

151 ఎమ్మెల్యేలతో తిరుగులేని నేత అనుకున్న జగన్ మోహన్ రెడ్డిని తన నవరత్నాలు అందుకుంటున్న ఓటర్ల చేతనే విసిరిగొట్టించగలిగాడు.

గతచరిత్రలో ఇలాంటి ఘటనలు చంద్రబాబు జీవితంలో లెక్కకు మించి ఉండవచ్చు కానీ తాజాగా మాత్రం ఇవే చెప్పుకోవాలి.

అలాంటి జనబలం, కేడర్ బలం ఉన్న నేతలతోనే కావాలనుకుంటే సంధి చేసుకోవడం, లేకపోతే మట్టి కరిపించడం చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం.

అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏవిటి?

చంద్రబాబు అనే మహావృక్షం నీడలో మొక్కగా ఉన్న తన పార్టీని ఎదిగించగలడా?

ఈ విషయంలో రాజకీయవర్గాల నుంచి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఎవరైనా జనసేనలో చేరాలనుకున్నా దానికి చంద్రబాబు అనుమతి అవసరమనిపించేలా ఉందట. తన పార్టీ సభ్యులు నిలబడిన అన్ని స్థానాలు గెలిచేసినా పవన్ కళ్యాణ్ ఒక సామంతరాజు మాత్రమే అన్నట్టుంది. పార్టీలో ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ తప్ప మరొక నాయకుడే బలంగా కనిపించడు.

ఇంతకీ పార్టీ గురించి పవన్ కి ఆలోచన ఉందా? ఉన్నా దానిని నిర్మించుకోవడానికి తగిన వాతావరణం ఉందా?

లేవనే కొన్ని సంకేతాలను బట్టి తెలుస్తోంది అంటున్నారు రాజ్కీయ విశ్లేషకులు.

ఈ అనుమానానికి ఊతమిచ్చే కొన్ని సంఘటనలు చూద్దాం.

వరద బాధితుల సహాయార్ధం సీయం సహాయనిధికి విరాళాలిస్తున్న సినీనటుల సంగతే చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెక్కుని అందజేస్తూ ఫోటో దిగడం సమంజసం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఇచ్చేది ముఖ్యమంత్రి సహాయనిధికి కనుక ఎవ్వరైనా అదే కోరుకుంటారు. బాలకృష్ణ అదే పని చేసాడు. ఆయనతో వెళ్లిన విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా ముఖ్యమంత్రికే చెక్కులు అందజేసారు.

ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోతే తదుపరి చాయిస్ గా ఉపముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి ఇవ్వాలనుకోవచ్చు. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి సాధారణ పొలిటీషియన్ కాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న సినిమా స్టార్ అయినప్పుడు ఆ చాన్స్ ని అస్సలు వదులుకోరు. మీడియాలో కూడా ఫోటో చలామణీ కావాలంటే అందులో స్టార్ పవర్ ఉన్నప్పుడు ఆ లెక్కే వేరేగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వద్దకు ఎవ్వరూ రావట్లేదు. చంద్రబాబు కాని పక్షంలో లోకేష్ వద్దకు వెళ్లి చెక్కును అందజేస్తున్నారు. ఆశ్చర్యమేంటంటే ఆ లిస్టులో సాయితేజ్ కూడా ఉన్నాడు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. తాను సీయం రిలీఫ్ ఫండ్ కి చెక్కుని ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని తన మామయ్య పవన్ కళ్యాణ్ కి చెప్పకుండా మాత్రం ఉండి ఉండడు సాయితేజ్. చెప్పాక ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది కూడా పవనే చెప్పి ఉండొచ్చు.

ఇదే నిజమనుకుంటే, పవన్ కళ్యాణ్ ని బలవంతంగా లో-ప్రొఫైల్ లో ఉంచుతోంది తెదేపా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇవ్వడానికి ముఖ్యమంత్రో, ఉపముఖ్యమంత్రో కాకుండా ముఖ్యమంత్రి గారబ్బాయి దగ్గరికి వెళ్లడమేంటి? ఆయన అర్హత కూడా ఒక మంత్రి… అంతే కదా. ఉపముఖ్యమంత్రి హోదా కంటే తక్కువే కదా!

ఇదంతా చూస్తుంటే మొన్నీమధ్య విజయవాడ వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ విమర్శలకి కారణమైనా కూడా, దాని వెనుక తెదేపానే ఉందేమోనని అనిపిస్తోంది.

“మీరొస్తే జనం మీద పడతారు కనుక బాబుగారు వద్దంటున్నారు” అని యంత్రాంగం చేత నిజంగానే పవన్ కి చెప్పించి ఉండొచ్చు బాబుగారు.

పవన్ మీడియాలో అదే చెప్పారు. కానీ అది తన మీదే బ్యాక్ ఫైర్ అయ్యింది.

మరి అలా మూగే జనం పిఠాపురంలో ఉండరా? పిఠాపురం బాధితుల వద్దకు వెళితే నిజంగానే ఎవరూ పెద్దగా మూగలేదు. పవన్ ని స్టార్ గా కంటే తమ ఎమ్మెల్యేగానే చూసారు నియోజకవర్గ ప్రజలు.

అంటే, తన నియోజకవర్గం పిఠాపురం తప్ప, తక్కిన ఊళ్లల్లో పవన్ రాజకీయ ఉనికి ఉండకూడదనే విధంగా చుట్టూ ఒక కనిపించని కంచె కట్టి ఉండొచ్చు తెదేపా. అంటే పేరుకే ఉపముఖ్యమంత్రి తప్ప హోదాకి, పనికి మాత్రం కాదనుకోవాలి.

పదవి అనేది అనుభవించడానికి, సేవ చేయడానికి ఉండాలి. అది లేనప్పుడు ఉన్నా ఉపయోగమేమున్నట్టు? పైగా వరదల వేళ బయటికి రాకపోతే జనం పవన్ నే విమర్శిస్తారు తప్ప వెనుక ఇదంతా జరగడానికి చాన్సుంటుందని ఎవరూ ఆలోచించరు.

ఎక్కిన కుర్చీకి పవర్ లేదని అనిపిస్తున్నా బయటికి చెప్పుకోలేక,

జనంతో మమేకమై తన మాస్ పవర్ ని చూపించే అవకాశమున్నా కంచెను దాటి రాలేక…

పవన్ విలవిలలాడుతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి.

కూటమి ప్రభుత్వంలో నెంబర్ వన్ చంద్రబాబైతే, నెంబర్ టు లోకేష్ బాబేనని జరుగుతున్న సంఘటనలను బట్టి తెలుస్తోంది.

ఇదంతా పవన్ కి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా సర్దుకుపోవచ్చు.

కానీ తనని నమ్ముకున్న ఒక వర్గం, కార్యకర్తలు మాత్రం కుదేలవుతారు. పదవి లేనంతకాలం జెండాలు మోసి అలసిపోయారు. తమ నాయకుడు పదవిలో ఉన్నా లేనట్టే అనే భావన వారిని ఇంకా కృంగదీస్తుంది. ఇంతోటి దానికి జనసేన పార్టీ దేనికి అని కూడా అనిపించడం సహజం.

తమ నాయకుడిని గొప్ప ప్రజాసేవకుడిగా చూస్తూ, భవిష్యత్తులో ముఖ్యమంత్రైతే చూడాలని చాలా కలలుగంటున్నారు పవన్ అభిమానులు. కానీ అవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో జరగడం కష్టం. అలాగని చేయగలిగేది కూడా ప్రస్తుతానికి పెద్దగా ఏమీ లేదు.

శ్రీనివాసమూర్తి

81 Replies to “చంద్రబాబు రాజకీయానికి పవన్ విలవిల”

  1. Pawan Kalyan doesnt have the fitness to work hard like Babu. He knows it. He goes for 2-3 days and he gets some viral fever. We have seen this in election campaigne as well. Babu did non stop public meetings, 3 per day in peak summer. Pawan could not able to do it.

  2. మూర్తి గారు మళ్ళీ ఏసేశారు కదా. పవన్ వరదలు కోసం ఇచ్చిన ఒక కోటి వెళ్లి బాబు కె ఇచ్చాడు కదా? తనకు తానే ఇచ్చుకోవాలి అంటారా?

    మీరన్నట్టు క్రెడిట్ కోసం బాబు ఒక్కడే మొత్తం తానై తిరిగి ఉండొచ్చు , లోకల్ మైలవరం మ్మెల్యే కూడా ఎక్కడ కనబడలేదు, కలెక్టరమ్మ కూడా కూడా లేదు అన్నిచోట్లకి. పవన్ వరద ప్రాంతాలకి వెళ్లి ఉండాల్సింది, బాధితులకు గౌరవ ప్రదంగా ఉండేది. కానీ కవరేజి పవన్ కి కి ఎక్కువగా వచ్చేది, బాబు కి అది ఇష్టం ఉండి ఉండకపోవచ్చు , అది సమంజసమే. ముఖ్యమంత్రి కోరుకున్నది మిగతా మంత్రులు ఆచరించాలి, పవన్ అదే చేసాడు. దానికి మర్రి చెట్టు, ఊడలు అనక్కర్లేదు.

    అలానే మంచో చెడో అన్ని బాబే చేస్తున్నప్పుడు, చందాలు కూడా ఆయనకే ఇస్తున్నారు. పవన్ ఇంకో పవర్ సెంటర్ ల చందాలు తీసుకుంటే, నువ్వే తినేసాడు అని రాస్తావు, దానికి దూరంగా ఉన్నాడేమో. కట్టెల పొయ్యి పెట్టుకుంటే నీకు బోలెడు గ్యాస్ ఆదా, ఇక్కడ పుల్లల్ని వేస్ట్ చేస్తున్నావు.

  3. Swantga బాలం మీద మనకి నమ్మకం.లేదు 24 లో పొత్తులు.లేకుండా ప్రయత్నం చేశాం కుదరలేదు ఇప్పుడు వలల్ని విదగిడితే నే మనకి భవిష్యత్ లేక పోతే పార్టీ మూసుకోడమే

  4. దేనికదే చెప్పుకోవాలి లోకేష్, జగన్ రెడ్డి కంటే ఎక్కువ మెజారిటీ వోట్ తెచ్చుకుని జగన్ ని మట్టి కురిపించాడు , జగన్ రెడ్డి కంటే చాలా బలమైన నాయకుడు లోకేష్

  5. వాళ్ళు కూటమి అన్నపట్నుంచి .. ఇలా గాలి వార్తలు వొండి వరుస్తూనే ఉన్నారు ..వాళ్ళు విడిపోవాలి అని ..అయినా ఏమైంది ..

  6. పవన్ గారి గురుంచి ఏమో గాని బాబు గారి రాజకీయానికి జగన్ వల వల – విల విల, బెంగళూరుకి packup !!

  7. ఎంత బ’లంగా’ కోరుకుంటున్నా….. పులకేశి కి అనుకూ’లంగా’ ఏమీ జరగటం లేదు అని బాధ కదా నీకు

  8. జగన్ చచ్చు కావచ్చు, చచ్చు కాకా పోవచ్చు, చచ్చు కాక పోయినా చొచ్చుకు పోవచ్చు, టీడీపీ – జేఎస్పీ ల మధ్య గొడవలు వొస్తే అని కాసుకు కూర్చున్నాడు చచ్చు జగన్, అని మటుకు రాయడు చచ్చు జీఏ గాడు. జీఏ గాడి బాష ఆలా ఉంది.

  9. ఈ శ్రీనివాసమూర్తి కలహాలు సృష్టించే వాడి లాగ ఉన్నాడు. వీడి వ్యాసాలు గమనిచించాలి.

  10. మేమంతా ఒకటే అని చెప్పలనుకుంటున్నారేమో అని అనుకోవచ్చుగా. జగన్ మీద మానేసి వీళ్ళ మీద ఫోకస్ పెట్టే 11 వచ్చాయి. ఇంకా ఇలాగే రాస్తె ఎలా?

    1. ఇందుకే చెప్పేది, ప్రజలు రెడ్డీస్ ముడ్డీస్ పగలకొట్టారు, ఇప్పుడు రెడ్డీస్ చెడ్డీస్ లోనే యెరుగు తున్నారని. నువ్వు కూడా ఒకడివా వాళ్ళల్లో?

    2. నిద్ర లెగువు బ్రదర్. కలలు కనచ్చు కధలు ఎంగకూడదు అన్నట్టు..

      తెలివైన మోవాళ్ళు పిచ్చి cristi ఎడ్ల దెగ్గరికి వెళ్లారు..

  11. మళ్ళి ఆవు కదె!

    .

    జనసెన, TDP విడిపొవాలి. వాళ్ళు వాళ్ళు కొట్తుకొని.. వొట్లు చీల్చుకొని… మా జగన్ అన్న పార్టికి ప్రాణం పొయాలి.

    1. ఎన్నికల ముందు కూడా ఇదె గొల.. pawan కి 175 కి 175 పొటీ చెసె దమ్ము ఉందా అంటూ!

      .

      నువ్వు 175 పొటీ చెసావ్, మరి చివరికి ఎన్ని గెలిచావ్?

    2. ఎన్నికల ముందు కూడా ఇదె గొల.. pawan కి 175 కి 175 పొటీ చెసె ద.-.మ్ము ఉందా అంటూ!

      .

      నువ్వు 175 పొటీ చెసావ్, మరి చివరికి ఎన్ని గెలిచావ్?

  12. ఓరి పిచ్చి GA నీకు ఇంకా అర్థం కాలేదా? పవన్ తొక్కటం బాబుకి చాలా తేలికైన పని.

    కానీ పక్కనే ఎందుకు కూర్చోపెట్టుకుంటున్నాడు? మనల్ని నామ రూపాలు లేకుండా చెయ్యటానికి. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి పవన్ కాంగ్రెస్ కి దగ్గర అయ్యట్లు చేసి మంచి అబ్యర్దులని దించి మన కి గుణపం దించే కార్యక్రమం జరుగుతుంది.

    మనకి వచ్చే ఎలక్షన్స్ కి అభర్దులు కూడా దొరకరు..ఎందుకంటే ఒక్కసారి అమరావతి ఔటర్ రింగ్ పాడిందంటే ..రియల్ ఎస్టేట్ పిచ్చి పీక్స్ వెళ్లిపోతుంది..అప్పుడు బాబు ఎన్నికల ప్రచారం చెయ్యంకరలేదు జనాలే చేస్తారు

  13. The Panchayat Raj and Rural Development Department had issued a G.O. giving Administrative Sanction for Providing Housekeeping, Man Power, and Security Services for the Guest House & Camp Office and Other Conference Halls with an estimated cost of Rs 82,14,471. YSR Congress Social Media is trying to make a mountain out of the mole giving an impression that Pawan Kalyan is usurping the funds.

    Firstly, these expenses are for a period of nine months. That means it comes to around 9 Lakhs per month. These 82 Lakh Rupees is also for basic facilities like Housekeeping, Man Power, and Security Services.

    The state govt purchased furniture for setting the camp office for Jagan Mohan Reddy at his residence by spending 40 Crore Rupees. Another 2 Crore Rupees have been spent for installing view-cutters for the house. Even the road leading to the house was extended with about Rs 5 Crore. Lakhs of Rupees have been spent on landscaping and beautification as well.

    YSR Congress should first return the furniture that was purchased with public money before making silly comments. Pawan Kalyan donated 5 Crore Rupees for the victims of Vijayawada Floods. YSR Congress made a namesake donation announcement and has not yet divulged how the donation will be spent on the victims. Jagan did nothing in his personal capacity despite being one of the richest politicians in the country.

    m9.news/politics/the-real-side-camp-office-expenses-of-pawan-kalyan-jagan/

  14. The Panchayat Raj and Rural Development Department had issued a G.O. giving Administrative Sanction for Providing Housekeeping, Man Power, and Security Services for the Guest House & Camp Office and Other Conference Halls with an estimated cost of Rs 82,14,471. YSR Congress Social Media is trying to make a mountain out of the mole giving an impression that Pawan Kalyan is usurping the funds.

    Firstly, these expenses are for a period of nine months. That means it comes to around 9 Lakhs per month. These 82 Lakh Rupees is also for basic facilities like Housekeeping, Man Power, and Security Services.

    The state govt purchased furniture for setting the camp office for Jagan Mohan Reddy at his residence by spending 40 Crore Rupees. Another 2 Crore Rupees have been spent for installing view-cutters for the house. Even the road leading to the house was extended with about Rs 5 Crore. Lakhs of Rupees have been spent on landscaping and beautification as well.

    YSR Congress should first return the furniture that was purchased with public money before making silly comments. Pawan Kalyan donated 5 Crore Rupees for the victims of Vijayawada Floods. YSR Congress made a namesake donation announcement and has not yet divulged how the donation will be spent on the victims. Jagan did nothing in his personal capacity despite being one of the richest politicians in the country.

  15. The state govt purchased furniture for setting the camp office for Jagan Mohan Reddy at his residence by spending 40 Crore Rupees. Another 2 Crore Rupees have been spent for installing view-cutters for the house. Even the road leading to the house was extended with about Rs 5 Crore. Lakhs of Rupees have been spent on landscaping and beautification as well.

    YSR Congress should first return the furniture that was purchased with public money before making silly comments. Pawan Kalyan donated 5 Crore Rupees for the victims of Vijayawada Floods. YSR Congress made a namesake donation announcement and has not yet divulged how the donation will be spent on the victims. Jagan did nothing in his personal capacity despite being one of the richest politicians in the country.

  16. The state govt purchased furniture for setting the camp office for Jagan Mohan Reddy at his residence by spending 40 Crore Rupees. Another 2 Crore Rupees have been spent for installing view-cutters for the house. Even the road leading to the house was extended with about Rs 5 Crore. Lakhs of Rupees have been spent on landscaping and beautification as well.

    1. YSR Congress should first return the furniture that was purchased with public money before making silly comments. Pawan Kalyan donated 5 Crore Rupees for the victims of Vijayawada Floods. YSR Congress made a namesake donation announcement and has not yet divulged how the donation will be spent on the victims. Jagan did nothing in his personal capacity despite being one of the richest politicians in the country.

      m9.news/politics/the-real-side-camp-office-expenses-of-pawan-kalyan-jagan/

    2. YSR Congress should first return the furniture that was purchased with public money before making silly comments. Pawan Kalyan donated 5 Crore Rupees for the victims of Vijayawada Floods. YSR Congress made a namesake donation announcement and has not yet divulged how the donation will be spent on the victims. Jagan did nothing in his personal capacity despite being one of the richest politicians in the country.

    3. YSR Congress should first return the furniture that was purchased with public money before making silly comments. Pawan Kalyan donated 5 Crore Rupees for the victims of Vijayawada Floods. YSR Congress made a namesake donation announcement and has not yet divulged how the donation will be spent on the victims. Jagan did nothing in his personal capacity despite being one of the richest politicians in the country.

  17. ఈ ఆర్టికల్ లో పవన్ పేరు ఉన్నచోట జగన్ అని మారిస్తే దాదాపు నిజాలే

  18. ఇంత చెసినా మా అన్న egg puff లు అంత కూడా కాలెదా?

    The Panchayat Raj and Rural Development Department had issued a G.O. giving Administrative Sanction for Providing Housekeeping, Man Power, and Security Services for the Guest House & Camp Office and Other Conference Halls with an estimated cost of Rs 82,14,471. YSR Congress Social Media is trying to make a mountain out of the mole giving an impression that Pawan Kalyan is usurping the funds.

  19. The Panchayat Raj and Rural Development Department had issued a G.O. giving Administrative Sanction for Providing Housekeeping, Man Power, and Security Services for the Guest House & Camp Office and Other Conference Halls with an estimated cost of Rs 82,14,471. YSR Congress Social Media is trying to make a mountain out of the mole giving an impression that Pawan Kalyan is usurping the funds.

    • Blue media great andhra… నీకు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయినా పర్లేదు మీకు జగన్ అన్న దోచుకున్న డబ్బులు ఐస్తే చాలు 🤦‍♂️.. తుగ్లక్ లాగా 3capitals అని, పోలవరం నీ నాశనం చేసినాడు…ఒక్క company రాలేదు, ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు,.. కాని bhoom bhoom లాంటి చెత్త liquor బ్రాండ్స్క తెచ్చాడు 🤭..ఇంక కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, ప్రత్యేక package, రైల్వే zone ఎన్నో తెచ్చాడు 🤦‍♂️.. జనాలకి 10000 ఐచ్చి వేల కోట్లు దోచుకున్నారు liquor, mining లో… హౌస్ టాక్స్, road టాక్స్, power బిల్, RTC చార్జెస్ last కి చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి 🤣… సొంత బాబాయ్ కి న్యాయం చేయలేనోడు జనాలకి ఏమి చేస్తాడు 🤦‍♂️
  20. ఇంకో ఆర్టికల్ లో పవన్ లో మార్పు, అనుమానిస్తున్న టిడిపి అని రాశారు. ఒకరోజే ఇలా రాసేస్తే ఎలా?

  21. అదేంటో గాని.. మా జగన్ రెడ్డన్న “సింగల్ సింహం” అని చెప్పుకుని తిరుగుతాడు..

    కానీ ప్రత్యర్ధులు మాత్రం “కూటమి” గా ఉండకూడదు అనే కండిషన్ పెడతాడు..

    1. వాస్తవం ఏమిటంటే సింహాలు గుంపుగా తిరుగుతాయి, కుక్కలే సింగిల్ గా వస్తాయి

  22. 11 ….రెండు కర్రలు ఆల్రెడీ అన్నకి ఇచ్చేశాడు కుంటు కుంటూ నడవమని , పవన్ కి వచ్చిన ఢోకా ఏమీలేదు డోంట్ క్రై

  23. Correct Title: చంద్రబాబు పవన్ రాజీకయాలకి… జగన్ విలవిల! మీరు విడిపొవాలి… అంటూ బులుగు మెడియాలొ అసత్య ప్రచారం.

    1. ఎది చెసినా చాలా రిచ్ గా ఉండాలి అబ్బా! మా జగన్ అన్న చూడు కమొడ్ కె 25 లక్షలు కర్చు చెసాడు!

      Egg puff లకె మా అన్న 3.6 కొట్లు కర్చు చెసాడు!!

      .

    2. ఎది చెసినా చాలా రిచ్ గా ఉండాలి అబ్బా! మా జగన్ అన్న చూడు కమొడ్ కె 25 లక్షలు కర్చు చెసాడు!

      Egg puff లకె మా అన్న 3.6 కొట్లు కర్చు చెసాడు!!

  24. At several places TDP candidates joined Janasena just before days and contested on Janasena ticket. Just one example Avani Gadda out of many. Generally defections will not happen with in those parties that are in alliance. This is a tactic adopted by Babu. Janasena party is being used by babu as a placeholder filling with his own party men. Real Jana sena cadre should realise and enlighten to Pawan and focus on expanding his party, otherwise people will not see it as a separate entity to avoid losses in long term.

  25. నీ ఏడుపు వరదలై పారినా jag…..gulu j….ail కే….చూడలేని చవట …. ఆడు పొయ్యకా ap ki పీడ విరగడయ్యింది

  26. GA..you feel that you are trying to play an intelligent game?

    in one article you blame Maavayya..in other article you praise jr. in other article you are trying to create sympathy on pk fans.. overall oka batch ki neemeda nammakam vachela and cbn nundi vidakottela prayathnalu baagane chesthunav but it will not workout… janaalau ychipi lanti gorrelu kaadu

  27. అన్నియ్య కోటి ఇచ్చాడు అన్నారు కదా రా ఎవరికి ఇచ్చాడో ఎంత ఇచ్చాడో చెప్తారా .ఆఖరికి ఇది కూడా ఫేక్ ఎనా

  28. అవును Ga గారూ…next elections ki ఏమన్నా విడి గా పోటీచేసి మనకు లబ్ధి చేకూరుస్తారేమో చూద్దాం

  29. In my opinion, Pawan garu achieved what he wants to achieve… He won’t bother whether he is in limelight or not… Getting attention or not. By nature he is like that only.

  30. 😂😂😂…ఇవ్వాళ మన అన్నయ్య చేసిన కామెడీ videos చూసాక మైండ్ పనిచెయ్యట్లేడా GA…

  31. హెడ్డింగ్ లో “జగన్” అని రాయబోయి సిగ్గేసి “పవన్” అని రాసావు కదా బాసూ…

  32. pk రాజకీయాలు లేకపోతే సినిమాలు చేసుకుని బతికేయగలడు…కానీ pk మాట ఇచ్చి తప్పడం వలన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు దిక్కుమాలినొల్లవుతున్నారు

Comments are closed.