కాంగ్రెస్ ఉచితాల వలకు జనం చిక్కలేదు

ఎన్నికలంటే వాగ్దానాలు, ఆ వాగ్దానాల్లో ఉచితాలు. ఇది మన దేశంలో సర్వసాధారణం.

ఎన్నికలంటే వాగ్దానాలు, ఆ వాగ్దానాల్లో ఉచితాలు. ఇది మన దేశంలో సర్వసాధారణం.

కర్ణాటకలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎన్నికల్లో విజయం సాధించింది. జనం ఆ వాగ్దానాలకు ఆశపడి ఓట్లు వేసారని విశ్లేషణలు వచ్చాయి. కానీ పథకాలు అమలు కాక, జనం అసంతృప్తితో, అమలు చేయలేక ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని వార్తలు వచ్చాయి.

అయినా సరే, అదే బాటలో తెలంగాణా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కర్ణాటక వాగ్దానాలను యథాతథంగా ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని చూసినా, తెలంగాణాలో జనం కాంగ్రెస్‌కు ఓట్లు వేయరని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించింది.

సక్సెస్ ఫార్ములా వాగ్దానాలు చేసిపెట్టడమే అనుకుంటున్నారు. జనం ముందు వెనుక చూడకుండా ఓట్లు వేస్తారని నమ్మకం బలపడుతోంది.

దాంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెదేపా కూటమి కూడా అలాంటి అతివాగ్దానాలు చేసి, ఘనంగా గెలిచింది. చంద్రబాబు చెప్పిన తప్పుడు వాగ్దానాలను జనం నమ్మారు, అందుకే మేము ఓడిపోయాం అని వైకాపా నాయకులు కూడా అంటున్నారు.

తప్పో ఒప్పో, గెలుపు సూత్రం అతివాగ్దానాలే అన్న నమ్మకం దేశంలో చాలామందికి ఉంది.

కానీ తాజా హర్యానా ఫలితాలు ఈ అభిప్రాయాలపై తీరైన సమాధానం ఇచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని భావించారు. ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. కానీ ఊహించని ఓటమి చవిచూసింది.

జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే, కాంగ్రెస్‌కు సోలోగా వచ్చినవి ఆరు సీట్లే, ఓట్ల శాతం 11% మాత్రమే. ఎన్సీతో కూటమిగా గెలిచింది. అసలు 29% ఓట్లు ఓడిపోయిన బీజేపీకి పడ్డాయి. 21% ఓట్లు ఎన్సీపీకి పడ్డాయి. ఓటింగ్ శాతాల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో సింగిల్ లార్జ్ పార్టీ భాజపా.

దాంతో అసలు కారణాలు వెతుక్కోవడం మొదలుపెట్టారు కాంగ్రెస్ నాయకులు. వాగ్దానాలు గట్టిగానే చేసారు, అయినా ఓట్లు ఎందుకురాలేదు? కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను జనం నమ్మలేదా?

విశ్లేషకులు చెబుతున్నది ఒక్కటే. కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో జనం వాగ్దానాలకు మోసపోయి కాకుండా, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓట్లు వేశారు. హర్యానాలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత లేదు, అందుకే అక్కడ జనం వాగ్దానాలకు పడిపోకుండా మళ్లీ భాజపాను గెలిపించారు.

ఇదే నిజమైతే, ఇది చాలా మంచి పరిణామం అనుకోవాలి. పథకాలు అందించలేదన్న కోపంతో, తర్వాతి ఎన్నికల్లో జనం మరోసారి ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే చెప్పలేం, కానీ ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణాలో ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలనే మళ్లీ ఎన్నుకుంటే, వారు ఉచితాలకు ఆశపడట్లేదని స్పష్టమవుతుంది. అప్పుడు ప్రభుత్వ ఖజానాని అర్థం లేని పథకాల పేరుతో ఖర్చు చేయకుండా ఉంటారు. దీని ద్వారా, ఉచితాల వేలం వెర్రి దేశం నుంచి మాయమవుతుంది, సరైన విధానాల వైపుకు అడుగులు పడతాయి.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. వైకాపా పాలనలో కూలీలు తేలిగ్గా దొరకడం లేదట. దొరికినా, చిన్న పనికి కూడా ఎక్కువ డబ్బు అడుగుతున్నారట. దానికి కారణం జగన్ ఇచ్చిన ఉచిత పథకాలట. కానీ ఇప్పుడు ఆ పథకాలు లేకపోవడంతో, పిలిచిన వెంటనే కూలీలు పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అంతే కాకుండా, మునుపటికంటే తక్కువ వేతనంతో కూడా పని చేస్తున్నారట. ఇదే నిజమైతే, అనవసరమైన ఉచిత పథకాలకి మంగళం పాడవచ్చు. చూడాలి ఏం జరగనుందో!

తెలంగాణలో కాంగ్రెస్ ఉచిత పథకాల మ్యానిఫెస్టో కారణంగా తమను ఓడించారని భావిస్తున్న తెరాస నాయకులు, ఆంధ్రలో చంద్రబాబు అతివాగ్దానాల మ్యానిఫెస్టో నమ్మి జనం తమను ఓడించారని నమ్ముతున్న జగన్ మోహన్ రెడ్డి ఒకసారి తమ దృష్టిని హర్యానా వైపు తిప్పి చూడాలి. మళ్లీ అక్కడ భాజపా మూడోసారి ఎందుకు నెగ్గింది, తాము తమ రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయారు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి.

శ్రీనివాసమూర్తి

18 Replies to “కాంగ్రెస్ ఉచితాల వలకు జనం చిక్కలేదు”

  1. జనాభాలో 35% ఉచితాలకే ఓట్లు వేస్తారు.

    కానీ మిగిలిన 65% అబివృద్ధికే ఓటు వేస్తారు.

    అందుకే కొంత శాతం ఉచితాలు, అధికశాతం అబివృద్ధి చేయడమే ఉత్తమం.

    కేవలం అబివృద్ధి, కేవలం ఉచితాలు వైఫల్యం నే ఇస్తుంది.

  2. మంచి ఆర్టికల్ నిజం చెప్పాలి అంటే అసలు ఉచితం అనే పదమే అబద్ధం రతి దానికి ఒక విలువ ఉంటుంది దాన్ని చెల్లించాలి . ఒక్క వృద్ధులు వికలాంగులు చిన్న పిల్ల లు కు మాత్రమే ఉచితాలు ఇవ్వాలి పిల్లలకు న్యూట్రిషన్ వరకు ఫ్రీ గా ఎఇవ్వాలి .ఇక విద్య వైద్యం ఉచితం అంతే మియాగ్త అన్ని పదకలై తీసెయ్యాలి అప్పుడు మంచి రోడ్ లు నాణ్య మయిన విధయ్య లాంటివి లభిస్తాయి . నిజమే బాబు ఉచితల్లు ఓట్లు పడలేదు జగన్ ను విధించాలి అనుకున్నారు తప్ప సూపర్ సిక్ వల్ల బాబు గెలవలేదు పాలకొండ లాంటి వెనకబడిన ప్రాంతం లో కూడా. వైకాపా విద్పిపోయింది .అయితే జగన్ ఓటమి ని కూడా అర్థం చేసుకునే స్థితి లో లేదు

  3. congress antene mosam…desa droham….aa party ki neethi jaathi vundavu….power kosam money kosam avasaram ayyithe…desanni mukkalu chesestaru…pakka desalaki kooda ichhestaaru….alanti party ki burra vunna vaadu evadu vote veyyadu…

  4. అదేంట్రాGAండుగా… నీలిగొర్రెలంతాహర్యానాలోఈవీఎంలమహిమతోభాజపాగెలిచిందిఅంటుంటేనువ్వేమోఖాన్’గ్రెస్’ఉచితాలుపనిచేయలేదంటున్నావు…

    హర్యానాలోకేవలం0.85%ఓటింగ్’తేడాతోభాజపాకిమ్యాజిక్’ఫిగర్’సీట్లుఎలావచ్చాయనిగొర్రెబుర్రల్నిగోక్కుంటున్నారు….అదేలాజిక్’ప్రకారంకాశ్మీర్’లోఅత్యధికఓటింగ్’శాతంవచ్చినభాజపాఎందుకుమ్యాజిక్’ఫిగర్’దరిదాపుల్లోకిరాలేకపోయిందంటేవినాశంబావబాబాయిశవంక్లీన్’చేస్తుంటేచప్పరించుకుంటూనించున్నట్టుగమ్మునుంటారు…

    నీలిగొర్రెలబుర్రలేబుర్రలు…

Comments are closed.