గాల్లో మేడ‌లు వ‌ద్దు జ‌గ‌న్, పునాదులు చూసుకో!

జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో దూరం అయిన వ‌ర్గాలు మ‌ళ్లీ ఇటు వైపు చూసే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌

ఏ రాజ‌కీయ పార్టీకి అయినా మూలాలు అనేవి ఉంటాయి. ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాలు, చ‌రిత్రాత్మ‌క నేప‌థ్యం, రాజ‌కీయ ఉద్దేశాలు, కులం, ఉద్య‌మాలు వంటివి మూలాలుగా ఏర్ప‌డ‌తాయి ఏ రాజ‌కీయ పార్టీకి అయినా. దేశంలోని ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీల‌ను ఉదాహ‌రిస్తే.. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రోద్య‌మ మూలాలతో ఎదిగింది. ఆ త‌ర్వాత దేశంలో ప్ర‌తి ప్రాంతంలోనూ ఒక కుల‌మో, ఒక వ‌ర్గ‌మో కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది. అధికారం, ఆధిప‌త్యం యావ‌తో ఉన్న అనేక కులాలు ద‌శాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాయి. కేవ‌లం యావ‌తోనే కాకుండా ఆయా కులాల‌కు ఉన్న సామ‌ర్థ్యం కూడా కాంగ్రెస్ మ‌నుగ‌డ‌ను కాపాడింది.

ఒక‌వైపు ఇలా అగ్ర‌కులాల‌ను బ్యాలెన్స్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, మ‌రోవైపు ద‌ళితులు, మైనారిటీల‌ను ఓటు బ్యాంకుగా మార్చుకుని మ‌నుగ‌డ‌ను కొన‌సాగించింది. అయితే ద‌ళితులు, మైనారిటీల ఓట్ల‌ను ఆ త‌ర్వాతి కాలంలో ప్రాంతాల వారీగా ఏర్ప‌డిన కుల పార్టీలు, కాంగ్రెస్ చీలిక ప‌క్షాలు సొంతం చేసుకోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఉంది. అలా కాంగ్రెస్ కు ఉత్త‌రాదిన మూలాలు దెబ్బ‌తిన‌డంతో.. కోలుకోలేక‌పోతే ఉంది!

హిందుత్వ‌మే మూలంగా బీజేపీ ఉనికి మొద‌లైంది. ఆ పార్టీకి అదే శ్రీరామ‌ర‌క్ష‌గా మారింది. దాదాపు ద‌శాబ్ద‌కాలం పైనే అధికారంలో కొన‌సాగుతూ ఉన్నా, బీజేపీ ఇంకా ఎక్క‌డి ఎన్నిక‌ల్లో అయినా గెలుస్తోంది అంటే, దానికి కార‌ణం ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలో దేశం సాధిస్తున్న ప్ర‌గ‌తి ఏమీ కాదు! కేవ‌లం హిందుత్వ వాదంతో, బీజేపీని కాదని మ‌రో పార్టీ కి అధికారం అంటే హిందూమ‌త‌మే దుంప‌నాశ‌నం అవుతుంద‌నే భ‌యాల‌ను క‌లిగించ‌డంతో సాగుతున్న‌దే! ఇలా కేవ‌లం త‌న బేస్ ఆధారంగానే బీజేపీ రాజ‌కీయ ఆధిప‌త్యం కొన‌సాగుతూ ఉంది.

తెలుగురాష్ట్రాల్లో బీసీలను బేస్ గా వాడుకుంటూ బ‌ల‌ప‌డింది తెలుగుదేశం పార్టీ. అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ద‌క్క‌ని వ‌ర్గాల‌కు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్య‌త‌ను ఇచ్చి, శాశ్వ‌త పునాదులు ఏర్పాటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆ వ‌ర్గాల‌ను ఉద్ధ‌రించింది ఏమీ లేక‌పోయినా.. రాజ‌కీయంగా సీమాంధ్ర‌లో బీసీల్లో తెలుగుదేశం పార్టీకి శాశ్వ‌త‌మైన ప్రాధాన్య‌త ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. త‌మ ప్రాణం పోతుంద‌న్నా తెలుగుదేశం పార్టీకి మిన‌హాయించి వేరే వారికి ఓటేయ‌ని బీసీలు ఏపీలో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీలో పూర్తిగా క‌మ్మ రాజ్య‌మే అయినా, క‌మ్మ వాళ్ల జ‌నాభా రెండు మూడుకు మించని ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో కూడా క‌మ్మ వాళ్లు చెప్పిందే తెలుగుదేశంలో వేదం అయినా, బీసీల ఓట్లు మాత్రం గంపగుత్త‌గా తెలుగుదేశం ప‌రంగానే ఉంటాయి. అదే తెలుగుదేశం పార్టీ మూలం! ఆఖ‌రికి విద్యాధికులైన క‌మ్మ‌వాళ్లు అయినా వేరే పార్టీల‌కు అక్క‌డ ఓటేయ‌డానికి సిద్ధంగా ఉంటారేమో కానీ, రాయ‌ల‌సీమ ప్రాంతంలో బీసీల ఓట్లు తెలుగుదేశం పార్టీని కాద‌న‌లేవు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భావంతోనే బ‌ల‌మైన ఓటు బ్యాంకును పొందింది. కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తూ కాంగ్రెస్ కు ప‌డే ప్ర‌తి వంద ఓట్ల‌లోనూ 99 ఓట్ల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న తొలి ఎన్నిక‌ల‌తోనే త‌న వైపుకు తిప్పుకుంది! ద‌శాబ్దాల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉండిన కాంగ్రెస్ ఉనికిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టింది. కాంగ్రెస్ కు మొద‌టి నుంచి ద‌న్ను గా ఉండిన రెడ్లు, ద‌ళితులు, మైనారిటీలు, గిరిజ‌నులు, కాంగ్రెస్ వాదులు… ఇలాంటి వ‌ర్గాల‌న్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న వైపుకు తిప్పుకుంది.

కేంద్రంలో, ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే జ‌రిగిన 18 స్థానాల ఉప ఎన్నిక‌ల‌తోనే అది జ‌రిగింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్ కోలుకోలేని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంది. 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అధికారం అందుకోలేక‌పోయినా.. అధికారం పొందిన తెలుగుదేశం కూట‌మితో పోలిస్తే కేవ‌లం ఒక్క‌టిన్న‌ర శాతం మాత్ర‌మే వెనుక‌బ‌డింది. 67 స్థానాల్లో విజ‌యం సాధించింది. అప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం కేవ‌లం ఐదున్న‌ర ల‌క్ష‌ల ఓట్ల తేడాతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది! కాంగ్రెస్ ను కూక‌టివేళ్ల‌తో పెక‌ళించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డింది. అది పునాది. నాటి ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద‌క్కిన ఓట్లు కేవ‌లం ఆ పార్టీకి మూలాలు.

ఏ రాజ‌కీయ పార్టీ అయినా త‌న మూలాల ద్వారా మాత్ర‌మే అధికారాన్ని అందుకోలేదు. దానికి తోడు ఇత‌ర స‌మీక‌ర‌ణాలు క‌లిసి వ‌చ్చిన‌ప్పుడే ఏ పార్టీ అయినా విజ‌య‌బావుటా ఎగ‌రేస్తుంది. అనంత‌పురం జిల్లాలో 70 శాతం బీసీలు, బ‌లిజ‌లు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నా.. ప్ర‌తి సారీ కూడా అక్క‌డ ఆ పార్టీ విజ‌యం సాధించ‌లేదు! సంప్ర‌దాయ ఓటు బ్యాంకు ఏ పార్టీనీ గెలిపించ‌లేదు. అది ప్యాడింగ్. దానికి తోడు ఇత‌రాలు క‌లిసి వ‌చ్చిన‌ప్పుడు ఘ‌న విజ‌యాలు ద‌క్కుతాయి. 2024 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ విష‌యంలో అదే జ‌రిగింది. సంప్ర‌దాయ ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపంలో జ‌న‌సేన మ‌ద్ద‌తు తెలుగుదేశం పార్టీకి అద‌నంగా క‌లిసి వ‌చ్చింది. ఆ పై జ‌గ‌న్ పెంచుకున్న వ్య‌తిరేక‌త తెలుగుదేశం పార్టీ పాలిటే కాకుండా జ‌న‌సేన పాలిట కూడా వ‌ర‌మైంది.

జ‌గ‌న్ పాల‌న‌పై అంత వ్య‌తిరేక‌త ప్ర‌బ‌ల‌క‌పోతే తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీల కూట‌మి ఏ వంద సీట్ల వ‌ద్ద‌కు వ‌చ్చి ఆగిపోయేది! బ‌హుశా ఫ‌లితం 2014 ఎన్నిక‌ల‌కు కాస్త‌, అటూఇటుగా ఉండేది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌లిగేది. గెలుపు సాధించ‌గ‌లిగేది కూడానేమో! వాస్త‌వానికి కూట‌మిలో సీట్ల కేటాయింపు వ్య‌వ‌హారం చాలా చికాకులు పుట్టించింది. అనేక చోట్ల అనామ‌కులు అభ్య‌ర్థులుగా మారారు. అయితే కూట‌మి త‌ర‌ఫున అన్ని పొర‌పాట్లు జ‌రిగినా తిరుగులేక‌పోయింది. హీన‌ప‌క్షంలో అర‌వై డెబ్బై స్థానాల్లో గెల‌వ‌గ‌లిగే స‌త్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కు ప‌రిమితం అయ్యింది. కూట‌మి త‌ర‌ఫున జ‌రిగిన త‌ప్పిదాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో త‌న‌కుండిన బ‌లాన్ని క‌లిగి ఉండినా.. అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ద‌క్కేది! అటు బీజేపీకి సీట్లు కేటాయించి, ఇటు జ‌న‌సేన‌కూ సీట్ల‌ను ఇచ్చి తెలుగుదేశం పార్టీ చాలా ఇక్క‌ట్ల పాల‌య్యేది!

అయితే 2024 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నాటి త‌న బ‌లాన్ని కూడా ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయింది. అక్క‌డే తేడా కొట్టింది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న మూలాల్లో దెబ్బ‌తింది. 2014 ఎన్నిక‌ల్లో పార్టీ నిర్మాణం కూడా లేని ద‌శ‌లో ప‌డ్డ ఓట్లు కూడా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప‌డ‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకీ స‌మాన‌మైన స్థాయిలో ఓట్లు ప‌డ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44.10 శాతం ఓట్లు ద‌క్కితే, తెలుగుదేశం పార్టీకి 44.60 శాతం ఓట్లు ద‌క్కాయి. బీజేపీకి ప‌డ్డ రెండు శాతం ఓట్ల ద్వారా అప్పుడు ఫ‌లితం మారిపోయింది! 2024 వ‌చ్చే స‌రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 39 శాతానికి ప‌రిమితం అయ్యింది! 2019 ఎన్నిక‌ల ఫ‌లితాన్ని ప‌క్క‌న పెట్టినా, క‌నీసం 2014తో పోల్చుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదారు శాతం ఓట్ల‌ను కోల్పోయింది! ఇదే మూలాల్లో దెబ్బ‌తిన‌డం!

అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు ప‌రిచినా, పార్టీ ప‌రంగా అనేక చ‌ర్య‌ల‌ను తీసుకున్నా, పార్టీ నిర్మాణం జ‌రిగినా, అధికారంలో ఉంటూ ఎన్నిక‌ల‌కు వెళ్లినా, 2019 ఎన్నిక‌ల నాటి ఫ‌లితాల‌ను రిపీట్ చేయ‌డం అటుంచి, 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిపీట్ చేయ‌లేక‌పోయింది. ఒక‌వేళ క‌నీసం ఆ 44 శాతం ఓట్ల‌ను పొంది ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఇప్పుడు సుమారుగా 70 మంది ఎమ్మెల్యేలు ఉండేవారో, అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఉండేవారు! ప‌దివేల లోపు ఓట్ల తేడాతో పోయిన నియోజ‌క‌వ‌ర్గాలు ప‌దుల సంఖ్య‌లో ఉన్నాయి.

దానికి కార‌ణం ఏమిటి అంటే.. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు మూలాల‌ను ప‌దిల ప‌ర‌చుకోవ‌డం మాట అటుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రించింది. అధ్య‌క్ష త‌ర‌హా పాల‌న అన్న‌ట్టుగా త‌ను, వ‌లంటీట‌ర్లు, ప్ర‌జ‌లు అన్న‌ట్టుగా జ‌గ‌న్ లెక్క‌లేశాడు. అది ఘోరంగా ఎదురుత‌న్నాయి! ఇదంతా జ‌రిగిపోయిందే, అయితే ఇప్పుడు మూలాల్లో త‌గిలిన దెబ్బ‌ల‌కు జ‌గ‌న్ ఏమైనా మందులేస్తున్నాడా, అస‌లు కోలుకునే అవ‌కాశం ఉందా? అనేది ప్ర‌శ్న‌!

ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి దౌర్జ‌న్యాలు గ‌ట్టిగా ఉన్నాయి. ప‌ల్లెల్లో కావొచ్చు, ప‌ట్ట‌ణాల్లో కావొచ్చు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప‌డితే కొట్టేలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల తీరు ఒక స్థాయిలో ఉంది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అనుమానం వ‌చ్చిన వాళ్లంద‌రినీ ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందే చాలా చోట్ల పార్టీ త‌ర‌ఫున నిఖార్సైన కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ కు గుడ్ బై చెప్పారు. ఎవ‌రైతే 2009 నాటి నుంచి జ‌గ‌న్ కోసం ప‌ని చేశారో అలాంటి వాళ్లు చాలా మంది 2024 ఎన్నిక‌ల ముందే జారుకున్నారు. అలాంటి దెబ్బ‌తో కూడా చాలా సీట్లు పోయాయంటే ఆశ్చ‌ర్యం లేదు.

జ‌గ‌న్ కు ఏదైనా సంప్ర‌దాయ ఓటు బ్యాంకో అక్క‌డే తేడాలు వ‌చ్చాయి. అలా జ‌గ‌న్ కోల్పోయిన ఓట్ల శాతం ఆరు! ఆరు శాతం ఓట్లు అంటే అదేం చిన్న విష‌యం కాదు. ప్ర‌భుత్వ అనుకూల‌, వ్య‌తిరేక ప‌వ‌నాల సంగ‌తెలా ఉన్నా, జ‌గ‌న్ త‌న‌కు అండ‌గా ఉండిన ఆరు శాతం ఓట్ల‌ను ఐదేళ్ల అధికార కాలంతో దూరం చేసుకున్నాడు! మ‌రి వారిని తిరిగి ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం తేలికైన ప‌ని ఏమీ కాదు.

మ‌రి చ‌ర్య‌లు అయినా అలాగ ఉన్నాయా అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటిదేమీ క‌నిపించ‌డం లేదు. కేవ‌లం ప్ర‌భుత్వ వ్య‌తిరేత పెరుగుతుంద‌నే లెక్క‌ల్లో ఉన్న‌ట్టుగా ఉన్నాడు జ‌గ‌న్. అయితే అది వేరే సంగ‌తి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, కూట‌మిలో విబేధాలు ఇలాంటి వాటి సంగ‌తెలా ఉన్నా, త‌ను కోల్పోయిన సంప్ర‌దాయ ఓటు బ్యాంకును జ‌గ‌న్ తిరిగి త‌ను ఉన్నాన‌నే విష‌యాన్ని చాటుకోవాల్సి ఉంది.

అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న తీరుతో దూరం చేసుకున్న పార్టీ సంప్ర‌దాయ ఓటు బ్యాంకును తిరిగి త‌న వైపుకు తిప్పుకోలేక‌పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది శాశ్వ‌తంగా క‌ల‌గా మారే అవ‌కాశం ఉంది. ప్ర‌త్యేకించి తెలుగుదేశం పార్టీ దూకుడు, దౌర్జ‌న్యాల నేప‌థ్యంలో, అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో దూరం అయిన వ‌ర్గాలు మ‌ళ్లీ ఇటు వైపు చూసే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌! రేపు తిరిగి జ‌గ‌న్ కోసం ప‌ని చేసినా, అధికారంలోకి వ‌చ్చినా.. మ‌ళ్లీ జ‌గ‌న్ తీరు ముందులాగే ఉంటే?

తెలుగుదేశం దాడుల‌ను త‌ట్టుకుంటూ, ఆస్తుల‌ను, ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి జ‌గ‌న్ కోసం ప‌నిచేసినా, రేపు మ‌ళ్లీ నేను, నా వ‌లంటీర్లు, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అక్క చెల్లెమ్మ‌లు, నా సంక్షేమ ప‌థ‌కాలు, అంటూ జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తే.. ఆస్తుల‌నూ, ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌ని చేసే కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏమిటి? ఈ భ‌రోసాను జ‌గ‌న్ క‌లిగించ‌లేక‌పోతే రాజ‌కీయం మానుకుంటే మంచిది. వారికి ఆ భ‌రోసాను క‌ల్పించ‌డం కూడా తేలిక కాదు, అదెలాగో ఆలోచించాల్సిన జ‌గ‌న్ .. ఇక వేరే ఆలోచ‌న‌లు పెట్టుకుంటే ఇంతే సంగ‌తులు చిత్త‌గించ‌వ‌లెను!

-జీవ‌న్ రెడ్డి.బి

73 Replies to “గాల్లో మేడ‌లు వ‌ద్దు జ‌గ‌న్, పునాదులు చూసుకో!”

  1. veededo oodabodustadu ani veediki 44.10 % raledu.. valla nanna meeda abhimanam to vachhai. ippudu andarki ardam ayi untadi.. vedoka chetakani daddamma ani inka raadu.

  2. పునాదులా?? అవెక్కడ ఉంటాయ్?? మాకు కాంపౌండ్ వాల్ మీద ప్రజల డబ్బు తో కోట్లు ఖర్చుపెట్టి

    “ఇనుప కోట గోడలు” కట్టుకోవడం మాత్రమే తెలుసు.. అందుకే ప్రజలు పంగనామాలు పెట్టారు.

  3. “ఫస్ట్ క్లాస్ సింగల్ సింహానికే” ప్రవచనాలా గుడ్డి ఆంధ్రా??

    5 ఏళ్ళు నిద్రపోతా.. ఈసారి ఎన్నికల్లో యేటాడితే 175 కి మినిమం 200 కొడతా

  4. జగన్ రెడ్డి కి భూమి మీద ఊరికొక “మేడలు” కట్టుకోవడం చిరాకు వచ్చినట్టుంది..

    ఇప్పుడు.. వెరైటీ గా.. గాల్లో “మేడలు” కట్టుకొంటున్నాడు.. జగన్ రెడ్డి..

    ఈ “మేడలు” కట్టుకొనే పిచ్చేమిటో .. ఈ “మెడలు” వంచేస్తాననే గొప్పల డప్పులేమిటో ..

    అబద్ధాలే జగన్ రెడ్డి పునాదులు.. ఇప్పుడు మళ్ళీ ఆ పునాదులే నమ్ముకోమంటున్నారా..? మళ్ళీ అబద్ధాలు మొదలెట్టమంటున్నారా..?

    2014 లో జనాల ఆలోచనలకు.. 2024 లో జనాల ఆలోచనలకు తేడా ఉంది సామీ..

    జగన్ రెడ్డి ఇంట్లో ఎవరైనా చనిపోయినా.. జగన్ రెడ్డే చంపేసి ఉంటాడని.. అనుమానిస్తున్న రోజులివి..

    జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే.. మీమ్ మెటీరియల్ కోసం వెతుక్కుంటున్న రోజులివి..

    జగన్ రెడ్డి ఎవరినైనా పరామర్శిస్తే.. అధికారం లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అని ప్రశ్నించే రోజులివి..

    సింపుల్ గా చెప్పాలంటే ..జగన్ రెడ్డి గేమ్ ఓవర్..

  5. అంతా ‘EVM లే చేసాయ్ అంటూ అసలైనోడు సెల్ఫ్ గోల్ ఏసుకుంటుంటే

    ప్రజలు పంగనామాలు (11) పెట్టినా ఈ చె’డ్డీ నాయాళ్ళు ఇంకా తీర్పు ని జీర్ణం చేసుకోలేక, అలా అయితే 70 సీట్లు వచ్చేవి, ఇలా అయితే బోటబొటీగా మళ్ళీ సీఎం అయ్యేవాడు అంటూ తి0గిరి లెక్కలు చెప్పి, A1 తిక్కలోణ్ణి ఇంకా ఇంకా పిచ్చి ఎక్కిస్తున్నారు.. ఇలా అయితే లండన్ మందుల డోస్ పెంచాల్సిందే..

  6. నేను మేడలు కట్టింది గాల్లో కాదు.. రిషికొండ పై.. పార్టీ కి పునాదులు ఉంటేగా చూసుకోవడానికి.. ఇది కూడా తెల్వదా “గుడ్డి ఆంధ్రా”జీవి??

  7. బెంగళూరు ప్యాలస్ లో కాళ్ళు బార చాపి తడి గుడ్డ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.

    2019 లో వెంట్రుక వేసాడు, లక్కీ గా కొండ కదిలింది.

    ఇప్పుడు ఆ వెంట్రుక తెగిపోయి బోడు గుండు మిగిలింది. వెద్దము అంటే వెంట్రుక లు లేవు.

    1. వెటకారముగా అయిననూ నిక్కమే పలికితిరి ఆర్యా! ఒక్కసారి గ్రామసీమల యందు పర్యటించండి

      1. అవును నేనూ విన్నాను, అరకు, రాజంపేట, తిరుపతి లోకసభ సీట్ల లో మెజారిటీ అసెంబ్లీ సీట్లు వైసీపీ ఓడిపోయినా ఎన్నికల అధికారులు లోకసభ సీట్ల లో బీజేపీ ని ఓడించి వైసీపీ ని గెలిపించారు.

        1. సర్లెండి! ప్రస్తుతం మీ పార్టీ మీకు ఇదే స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఉంది! ఎప్పుడు బాబుని తిట్టాలో, ఎప్పుడు పొగడాలో తెలియని మీకు నిజాలు అర్ధం అవుతాయని అనుకోవటం కూడా భ్రమే 😔

        1. నీలా కొండేర్రిపప్పలా అలోచించి ఉంటే 2019లో జగన్ మళ్ళీ 67 దగ్గరే ఆగిపోయేవాడు, చంద్రబాబు 2024లో 23 దగ్గర ఆగిపోయేవాడు

  8. ఎందుకు నువ్వు నానా హైరానాపడి ఈ రాతలు రాస్తావు! నిజాన్ని గుర్తురగండి. ఏ తప్పులు జరిగితే ప్రజలు తిరస్కరించారు వాటిపై సమీక్ష జరపండి. తప్పుడు రాతలు రాసే నీకు, ఏ ఏ కారణాలతో అధికారం పోయిందో తెలుసుకో లేకపోతే జగన్ కి ఇక అధికారం కలయే!.

  9. అరేయ్ GA, సిగ్గు శరం, మానం,నీచం ఉచ్ఛం ..ఏమన్నా వుంటే ఇక వాడి గురుంచి ఈ సోది రాయటం ఆపి రాష్ట్రం కోసం ఏమన్నా ఉపయోగ పడతావేమో చూడు..వాడి మో గ్గ ఊడిందా రాలిందా..కావలసిన నంత మింగాడు..వాడు వచ్చిన పని అయిపోయింది..నీకు ఏమన్నా కావాలి అంటే మా పవన్ నో.లోకేష్ దో మొకాళ్ళ తండ ఏసుకో..అప్పుడు ఆలోచిస్తాం.

  10. అరేయ్ GA, సి..గ్గు శరం, మా..నం,నీ..చం ఉ..చ్ఛం ..ఏమన్నా వుంటే ఇక వాడి గురుంచి ఈ సో..ది రాయటం ఆపి రాష్ట్రం కోసం ఏమన్నా ఉపయోగ పడతావేమో చూడు..వాడి మో.. గ్గ ఊ..డిందా రా..లిందా..కావలసిన నంత మింగాడు..వాడు వచ్చిన పని అయిపోయింది..నీకు ఏమన్నా కావాలి అంటే మా పవన్ నో.లోకేష్ దో మొకాళ్ళ తండ ఏసుకో..అప్పుడు ఆలోచిస్తాం.

  11. అ..రే..య్ GA, సి..గ్గు శ..రం, మా..నం,నీ..చం ఉ..చ్ఛం ..ఏమన్నా వుంటే ఇక వాడి గురుంచి ఈ సో..ది రాయటం ఆపి రాష్ట్రం కోసం ఏమన్నా ఉపయోగ పడతావేమో చూడు..వాడి మో గ్గ ఊ..డిందా రా.లిందా..కావలసిన నంత మిం..గాడు..వాడు వచ్చిన పని అయిపోయింది..నీకు ఏమన్నా కావాలి అంటే మా పవన్ నో.లోకేష్ దో మొ..కా..ళ్ళ తం..డ ఏసుకో..అప్పుడు ఆలోచిస్తాం.

  12. వార్నీ… నీ అతిశయం కూలిపోనూ… 2014లో ఏదో పీకినందుకు కాదురా… అప్పుడు కాంగ్రెసోళ్లు ఏపీని విభజించిన తీరుతో… టీడీపీని వ్యతిరేకించే వాళ్లకు మరో ప్రత్యామ్నాయం లేక ఓటేశారు.. అంత వరకే. ఇక్కడ తిప్పుకున్న సంత, సందర్భం ఏమీ లేదు.. వాళ్లకు దూరడానికి వేరే సందు లేక ఇటు వాలితే… అంతా నాకే వాచింది, నాకే గొప్ప అనుకున్న నాయకుడితోనే తిప్పలు.

    2019లో… ఒక్క ఛాన్సు ముష్టి కార్యక్రమానికి తగినంత ముష్టి వేయడంతో అది విజయవంతం అయింది… ముష్టి వేయించుకున్నవాడు నెత్తిన కాలు పెట్టి తొక్కుతానంటే…. ఇలాగే తొక్కిపడేసి ఇక పైకి లేవకుండా చేస్తారు జనాలు.

    ఈ మాత్రం దానికి అదేదో సంప్రదాయ ఓటు, ఘనాపాటి పోటు… ప్యాడింగ్, బోడింగ్… అంటూ దిక్కుమాలిన రాతలు. నువ్వు రాయనంత మాత్రాన వాస్తవాలు జనాలకు తెలియకుండా పోవురోయ్…

  13. 10 ఎంఎల్ఏ లో ఒక్కడు కూడా అన్నకి షేవింగ్, జుట్టుకి రంగు వేయడానికి వెళ్ళలేదా ప్యాలస్ కి, నరిసిన జుట్టు ఫోటో వేసావ్ ?

    ఆన్న ఫీల్ అవ్వడా ?

  14. ప్రజలు పంగనామాలు (11) పెట్టినా ఈ చె’డ్డీ నాయాళ్ళు ఇంకా తీర్పు ని జీర్ణం చేసుకోలేక, అలా అయితే 70 సీట్లు వచ్చేవి, ఇలా అయితే బోటబొటీగా మళ్ళీ సీఎం అయ్యేవాడు అంటూ తి0గిరి లెక్కలు చెప్పి, A1 తిక్కలోణ్ణి ఇంకా ఇంకా పిచ్చి ఎక్కిస్తున్నారు..

  15. “”” బీజేపీ పదేళ్ళుగా గెలుస్తూ ఉన్నది అంటే అది చేసిన అభివృద్ది మూలంగా కాదు, కేవలం హిందూత్వాన్ని రెచ్చగొట్టటము మూలంగానే “””

    ఈ మాట ఏ ఎదవ చెప్పినా కరెక్టే

    దేశఅర్ధికస్థాయి అయిదవ రాంకుకు తీసుకెళ్ళటమూ, ఫోరెక్స్ రిజర్వులు 700+బిలియన్ డాలర్లకు చేర్చటము, స్కాము లు లేకుండా పాలించటమూ , ఉగ్రవాదుల పీచమణచటమూ రైల్వే, ఆరోగ్య, విద్యుత్, రోడ్లు, జల్‍జీవన్ మిషన్ ద్వారా దేశంలో ప్రతి ఇంటికీ నీళ్ళు అందించటమూ ఇత్యాదివేవీ కారణం కాదు. పారిశ్రామిక అభివృద్ది లో అద్భుతమైన పురోగతి సాధించటమూ , రక్షణరంగం పటిష్టపరచటము లాంటి బేవార్స్ చెత్తపనులు మోడీ చేయలేదు.

    సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే మాటే లేకుండా కేవలం హిందువులకే మేలు చేస్తామని పదేపదే చెప్పి మోడీ గెలుస్తూ వస్తున్నాడు. ఇతరమతస్తులకు ఏమీ ఇవ్వకుండా మోసం చేసి హిందువులను మభ్యపెట్టి గెలుస్తున్నాడు.

    గాంధీ తాత నేర్పి మప్పించిన సెక్యులర్ బాట వదలి మేము హిందువులకే మేలు చేస్తాము అని ఎన్నికల ప్రచారంలో చెప్పి గెలుస్తూ వస్తున్నాడు.

    దేశంలో రకరకాల ఎదవలుంటారు. వాళ్ళల్లో పెన్నూ పేపర్ అమ్ముకునే ఎదవల సంఖ్య తక్కువేమీ కాదు

  16. కనకపు సింహాసనం మీద కూర్చుని, బేవార్స్ స్కీములు పంచి, అదే ప్రభుత్వపాలన అనుకుంటే, ఫలితం ఇలానే ఉంటుంది.

    బేవార్స్ స్కీములు పుచ్చుకున్నవాళ్ళకే కాదు, అందుకు పన్నులు కట్టేవారికి కూడా ఓట్లు ఉంటాయనే ఇంగితం లేని ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఓడారు.

    విగ్రహాలు ధ్వంసం చేసి గుళ్ళు రధాలు నాశనం చేసినవారిని కాపాడి ఇతరమతాల మెప్పు పొందితే చాలు అనుకునే తెలివితక్కువతనానికి ప్రజలు ఇచ్చిన ఝలక్, కాదు కాదు మలాటు దెబ్బ

  17. కనకపు సింహాసనం మీద కూర్చుని, బేవార్స్ స్కీములు పంచి, అదే ప్రభుత్వపాలన అనుకుంటే, ఫలితం ఇలానే ఉంటుంది.

    బేవార్స్ స్కీములు పుచ్చుకున్నవాళ్ళకే కాదు, అందుకు పన్నులు కట్టేవారికి కూడా ఓట్లు ఉంటాయనే ఇంగితం లేని ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఓడారు.

  18. బేవార్స్ స్కీములు పుచ్చుకున్నవాళ్ళకే కాదు, అందుకు పన్నులు కట్టేవారికి కూడా ఓట్లు ఉంటాయనే ఇంగితం లేని ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఓడారు.

    విగ్రహాలు ధ్వంసం చేసి గుళ్ళు రధాలు నాశనం చేసినవారిని కాపాడి ఇతరమతాల మెప్పు పొందితే చాలు అనుకునే తెలివితక్కువతనానికి ప్రజలు ఇచ్చిన ఝలక్, కాదు కాదు మలాటు దెబ్బ

  19. కనకపు సింహాసనం మీద కూర్చుని,ముష్టిస్కీములు పంచి, అదే ప్రభుత్వపాలన అనుకుంటే, ఫలితం ఇలానే ఉంటుంది.

    ముష్టిస్కీములు స్కీములు పుచ్చుకున్నవాళ్ళకే కాదు, అందుకు పన్నులు కట్టేవారికి కూడా ఓట్లు ఉంటాయనే ఇంగితం లేని ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఓడారు.

  20. విగ్రహాలు ధ్వంసం చేసి గుళ్ళు రధాలు నాశనం చేసినవారిని కాపాడి ఇతరమతాల మెప్పు పొందితే చాలు అనుకునే తెలివితక్కువతనానికి ప్రజలు ఇచ్చిన ఝలక్, కాదు కాదు మలాటు దెబ్బ

    1. కనకపు సింహాసనం మీద కూర్చుని,ముష్టిస్కీములు పంచి, అదే ప్రభుత్వపాలన అనుకుంటే, ఫలితం ఇలానే ఉంటుంది.

      ముష్టిస్కీములు పుచ్చుకున్నవాళ్ళకే కాదు, అందుకు పన్నులు కట్టేవారికి కూడా ఓట్లు ఉంటాయనే ఇంగితం లేని ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఓడారు.

    2. కనకపు సింహాసనం మీద కూర్చుని,ప్రజల డబ్బులు తన అబ్బసొమ్ములాగా పంచి, అదే ప్రభుత్వపాలన అనుకుంటే, ఫలితం ఇలానే ఉంటుంది.

      1. ముష్టి పుచ్చుకున్నవాళ్ళకే కాదు, అందుకు పన్నులు కట్టేవారికి కూడా ఓట్లు ఉంటాయనే ఇంగితం లేని ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఓడారు.

      2. పుచ్చుకున్నవాళ్ళకే కాదు, అందుకు పన్నులు కట్టేవారికి కూడా ఓట్లు ఉంటాయనే ఇంగితం లేని ఎన్టీఆర్, కరుణానిధి, జయలలిత, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఓడారు.

  21. సిగ్గు శరం మానం మర్యాద , రోషం , పౌరుషం , ఆత్మ గౌరవం ఉండే ఎవడు(ముఖ్యంగ రెడ్లు) వాడిని నమ్మి మళ్ళీ రాజకీయాలు చెయరు, వాడు కొట్టిన దెబ్బకి మరో 100 ఏళ్ళు దాకా రెడ్లు రాజకీయంగ ఆర్ధికంగా కోలుకోరు.

  22. సి గ్గు శ రం మానం మర్యాద , రోషం , పౌరుషం , ఆత్మ గౌరవం ఉండే ఎవడు(ముఖ్యంగ రెడ్లు) వాడిని నమ్మి మళ్ళీ రాజకీయాలు చెయరు, వాడు కొట్టిన దెబ్బకి మరో 100 ఏళ్ళు దాకా రెడ్లు రాజకీయంగ ఆర్ధికంగా కోలుకోరు.

    1. అన్నా.. ఈల్లంత దుర్మార్గులు భూమిమీద ఎక్కడా వుండరు. ఈ జగ్గడికి deplamatic గా వుండటం or యాక్టింగ్ చెయ్యటం రాదు కాబట్టి ఈల్ల true character బయట పడింది. ఆ మేత గాడు ఏదో లా మనేజ్ చేశాడు.. వాడు కుడా క్రూరుడే

    2. ఈల్లకి కోట్ల, నేదురుమల్లి, ఆనం, పుచ్చల పల్లి, జైపాల్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి , జానా రెడ్డి లాంటి వాళ్ళు నచ్చరు.. అస్సలు వాళ్ళు రెడ్లె కాదు అని చెప్పినా ఆచర్యం లేదు

      1. meeku kaakaani venkata ratnam , chanumolu venkatrat rao, kaavuri saambasiva rao lanti vaaru nachaledu.

        kaani meeku

        ntrikala rama ravu, chamba chandrababu, kodela sivaprasadu , draggula pawan kalyan lanti vaaru nachutaaru.

        inkaa kavalante JC diwakarudu, prabhakarudu, somberi chandramohan nachutaaru.

    3. అన్నా.. ఈల్లంత దుర్మార్గులు భూమిమీద ఎక్కడా వుండరు. ఈ జగ్గడికి deplamatic గా వుండటం or యాక్టింగ్ చెయ్యటం రాదు కాబట్టి ఈల్ల true character బయట పడింది.

  23. 99% మేనిఫెస్టో అమలు చేసాం కాబట్టి ప్రజలు ఉబ్బి తబ్బిబ్బయ్యి 175/175 గెలిపించాలని అర్థరాత్రి వరకు Q లో నిలబడి ఓట్లేసారు ..కానీ మోడీ మోసం చేస్తే EVM ల వల్ల ఓడిపోయామ్..అంతేకానీ ఇప్పుడు నువ్వేమో ఏదేదో చెప్తున్నావు. నాకేమి అర్థం కావడం లేదు.. Confuse అవుతున్నా జీవన్ అన్నాయ్..

    ఇట్లు

    A1పరదా బంకర్ రెడ్డి ఉరఫ్ PK నాలుగో పెళ్ళాం

  24. 99% మేనిఫెస్టో అమలు చేసాం కాబట్టి ప్రజలు ఉబ్బి తబ్బిబ్బయ్యి 175/175 గెలిపించాలని అర్థరాత్రి వరకు Q లో నిలబడి ఓట్లేసారు ..కానీ మోడీ మోసం చేస్తే ‘EVM ల వల్ల ఓడిపోయామ్..అంతేకానీ ఇప్పుడు నువ్వేమో ఏదేదో చెప్తున్నావు. నాకేమి అర్థం కావడం లేదు.. Confuse అవుతున్నా జీవన్ అన్నాయ్..

    ఇట్లు

    A1పరదా బంకర్ రెడ్డి ఉరఫ్ PK నాలుగో పెళ్ళాం

  25. కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టేసి ….ఏమి జోకురా బాబు…విభజన చేసి ఆత్మహత్య చేసుకుంది కాంగ్రెస్. అందులో అన్న గొప్పేమి లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇటు వచ్చారు అంతే

  26. ఇంకా పునాదులు ఏంటి , పిల్ల కాంగ్రెస్ వెళ్లి తల్లి కాంగ్రెస్ లో కలుస్తుంటే.

  27. look at what this che ddi writes: “తెలుగుదేశం పార్టీ ఆ వ‌ర్గాల‌ను ఉద్ధ‌రించింది ఏమీ లేక‌పోయినా..”

    credibility of article gone. NTR revolutionized welfare of BCs

  28. పొద్దున్నే పాచిపల్లు వేసుకొని డిబేట్ కి వచ్చే కొమ్మినేనికి ఎవరైనా ఈ ఆర్టికల్ చూపించండి, వాడు ఇంకా E*V*M లే దద్దమ్మ గాన్ని వోడించాయి అని భ్రమ పడుతూ చెప్పిందే పదే పదే చెప్తున్నాడు

  29. ఉహు…అంత ఆలోచన మనకి రాదు…ఒకేలా వచ్చినా భేషజం వెంటాడుతుంటాది…ఇక పనికిమాలిన మీడియా కాకులపోటు మాములుగా ఉండదు……..పూర్తిగా వర్గ భేషజం వదిలి మిగిలిన వాళ్ళలాగా ఆలోచిస్తేనే…..

  30. మహమ్మదీయ దేశాలు భారత్ తో చెలిమి నటిస్తాయి అలానే టీడీపీ బీజేపీ తో అవసరం కొద్దీ స్నేహం నటిస్తుంది…ఏదో రోజు మళ్ళీ కుట్రలు రెచ్చ కొట్టే అవకాశాలు దొరికిన వెంటనే ఆ దేశాం పాకిస్తాన్ మాదిరి భారత్ లో అలజడలు చేయ చూడటం ఎన్ని సార్లు మనం ఎదుర్కులేదు….అలానే టీడీపీ ..

  31. పూలివేందుల evm మెషీన్ లో మతలబు చేసి అక్కడి ఎంఎల్ఏ గెలుచాడా ?

    జగన్ యొక్క evm మీద అనుమానం స్టేట్మెంట్ ప్రకారం , సొంత అనుభవం తో చెప్పినట్లు వున్నాడు అని ప్రజలకి అనుమానం..

  32. చరిత్ర నిజాలు ఎలా మార్చేస్తారో ఒక విషయం చూస్తే అర్థం అవుతుంది. Feudalism ఆరాధకులు అయిన దక్షిణాది ప్రజలు ఇందిర తర్వాత లోకల్ కుటుంబం నాయకుల ఆరాధకులు గా మారిపోయారు. ఆ పరిణామ క్రమమే వైస్సార్ – జగన్ ఫాలోయింగ్. దాంతో కాంగ్రెస్ కనీసం తెలంగాణా అయినా కాపాడుకోవాలి అని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఇప్పుడు జనమేమో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు వల్ల ఏపీ లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయింది అని భాష్యాలు చెబుతున్నారు!

  33. పార్టీలు మూలాలు అని బాగానే రాసావు .. మరి అన్న పార్టీ కి ఏముంది మూలం .. నాకు మా నాన్న పదవి కావాలి అని తప్పించి ..

Comments are closed.