పాపం.. పోలీస్!

పోలీసులకు ఉండే ఏకైక ఆప్షన్ రాజకీయ నాయకుల నాయకుల వికృత కక్షల క్రీడలో బలిపశువులుగా మారడం మాత్రమే.

ప్రభువును మీరి ప్రవర్తించగల, రూల్ బుక్ పేరు చెప్పి పాలకుల మనోభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించగల వెసులుబాటు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార యంత్రాంగానికి ఉందా? ‘చెప్పింది చేయకపోతే’ ఎవరి పరిస్థితి ఏమౌతుందో ఎవరికెరుక. రాజకీయ అధికారం చేతిలో ఉన్నవాళ్లే సర్వోన్నతులుగా, ప్రజాస్వామ్యానికి ఉన్న మిగిలిన స్తంభాలన్నీ కూడా వారికి బానిసత్వం చేయడానికి మాత్రమే మనుగడలో ఉన్నట్లుగా రూపుమార్చుకున్న ప్రజాస్వామ్యం మనది. ఇలాంటి వ్యవస్థలో అధికార యంత్రాంగం ఎదుట రెండే ఆప్షన్లు ఉంటాయి.

ఒకటి- లొంగిపోవడం, రెండు- ఆగ్రహానికి గురై బలిపశువు కావడం! బ్యూరోక్రసీ విభాగాల్లో కూడా పోలీసుల పరిస్థితి ఇంకా భిన్నమైనది. పోలీసు వ్యవస్థ అంటేనే ‘ఎస్ బాస్’ పోకడలకు ప్రతీకగా చెబుతుంటారు. ఆ విధేయత వారిని అష్టకష్టాల పాల్జేస్తుండడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్న వారి పట్ల చూపించే విధేయత, వారి ప్రత్యర్థుల ఆగ్రహానికి కారణమవుతోంటే.. పోలీసు యంత్రాంగం నిత్యం ఇరుపోటుల మధ్య నలుగుతూనే ఉంటుంది. అనివార్యంగా హద్దులు దాటిపోతున్న వారి విధేయత.. ప్రజల వారి పట్ల ఉండే గౌరవాన్ని కూడా పలుచన చేసేస్తుంటుంది. ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘పాపం.. పోలీస్!’

‘ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానులే.. కొందరు అధిక సమానులు’ అనే నిర్వచనం ఒకటి ఉంటుంది. అదే మాదిరిగా.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలు మూడు’ అని చెప్పుకుంటాం గానీ.. ఆ మూడింటిలో ‘రాజకీయ అధికారం’ మాత్రమే పెత్తనం చెలాయించే అసలైన స్తంభం. మిగిలిన స్తంభాలు రెండూ సపోర్టింగ్ స్తంభాలు అని అనుకోవాలి. అధికార యంత్రాంగంలో పోలీసు వ్యవస్థ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. బ్రిటిషు వాడు నేర్పిపోయిన అతివిధేయత ఈ వ్యవస్థలో ఇప్పటికీ వేళ్లూనుకుని పాతుకుపోయి ఉంటుంది. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కడూ తన పైస్థాయి వారిపట్ల అతివిధేయత చూపిస్తూనే ఉంటారు. కానీ మొత్తంగా పోలీసు వ్యవస్థను అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఆడిస్తుంటారు. అన్ని రకాల అధికార వ్యవస్థలను ఆడించినట్టే పోలీసుల్ని కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తుంటారు. కానీ.. సామాన్య ప్రజలకు మిగిలిన అధికార వ్యవస్థలకంటె ఎక్కువగా పోలీసులు ఎలా రాజకీయ నాయకులకు లోబడి పనిచేస్తున్నారనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకు కారణాలు అనేకం!

కక్షలు వారివి.. ఆయుధాలు మాత్రం వీరు!

రాజకీయ పార్టీలు పాలకపక్షం– ప్రతిపక్షం అనే పదాలతో చెలామణీ అయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అంతా ‘ప్రత్యర్థి పార్టీలు’గానే మిగులుతున్నాయి. ప్రత్యర్థి అనే పదమే వారి మధ్య వైరాన్ని, ద్వేషాన్ని పెంచేదిగా మారిపోయింది. ఏ రెండు పార్టీలు కూడా విధానాల గురించి, నిర్ణయాల గురించి సరైన చర్చ సాగించే స్థితిలో లేవు. తమకు కిట్టని పార్టీని పూర్తి స్థాయి శత్రువుగా చూడడం మాత్రమే జరుగుతోంది. దానికి తగినట్టుగానే ఒక పార్టీ అధికారంలోకి వస్తే.. రెండో పార్టీని టార్గెట్ చేయడం చాలా సహజమైన విషయం అయిపోయింది.

ఇలా రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం అనేది రకరకాల రూపాల్లో జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం పోలీసుల్ని ఆయుధాలుగా (టూల్స్‌గా) వాడుకుని ప్రత్యర్థుల మీద కక్ష సాధించాలని, వారిని వేధించాలని అనుకోవడం. రాజకీయ నాయకులకు సంబంధించినంత వరకు అంతా బాగానే ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఉండే అభిమానులు, తొత్తులు, తైనాతీలు అందరూ.. తమ తమ పార్టీల నాయకులు చేసే ప్రతి అసహ్యమైన పనిని కూడా సమర్థించుకుంటూ, అలా చేయడమే కరెక్టు అని మిత్రులతో వాదించుకుంటూ తమ జీవితాలను వెళ్లదీస్తుంటారు.

రెండో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ అదే వేధింపులు, కేసులు రిపీట్ అవుతుంటాయి. ఇదంతా ఒక ‘సైకిల్’లాగా జరుగుతుంటుంది. పార్టీల నాయకులకు ఉండే కక్షలు కార్పణ్యాలు పరస్పర విద్వేషాలు ఇవన్నీ ఒక ఎత్తు. దాని వలన వారికి ఉండే ప్రయోజనాలు స్వార్థపూరిత లక్ష్యాలు ఇవన్నీ వేరుగా ఉంటాయి. కానీ వాటితో ఏమాత్రం సంబంధం లేకుండానే.. పోలీసులు వారి చేతిలో టూల్స్‌గా మారిపోతుంటారు. అది చాలా శోచనీయమైన పరిస్థితి. దీని పర్యవసానం ఏమవుతున్నదంటే.. ఇప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న పార్టీకి చెందిన నాయకులు.. తాము అధికారంలోకి వస్తే ఎవరెవరిని వేధించాలో ముందే నిర్ణయించుకుంటూ ఉంటారు. ఆ జాబితాలో పోలీసులు కూడా చేరిపోతుంటారు.

నిజానికి పోలీసులకు ఆయా పార్టీలతో గానీ, వారి ప్రయోజనాలతో గానీ ప్రత్యక్ష ప్రమేయం ఏమీ ఉండదు. కానీ.. అధికారంలో ఉన్నవారికి విధేయులుగా ఉద్యోగం చేయవలసి వస్తున్నందుకు పోలీసులు ఈ కక్షల ఉచ్చులో ఇరుక్కుపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘పాపం.. పోలీస్’ అనడం తప్ప ఏం చేయగలం?

పోలీసులకే డైరక్ట్ వార్నింగులు!

తాజాగా ఒక సంఘటన జరిగింది. సజ్జల రామక్రిష్ణారెడ్డి మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట వెళ్లడానికి మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని, కోర్టు అనుమతి తెచ్చుకుంటే తప్ప పంపం, బయటకి వెళ్లాలి అన్నారు. ఆయన పోలీసుల మీద ఆగ్రహంతో ఊగిపోయారు. మాకూ ఒక రోజు వస్తుంది. మేం కూడా మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ సంగతి చూస్తా.. లాంటి పరుష వాక్యాలతో అక్కడి చిన్న స్థాయి పోలీసుల మీద పెద్దస్థాయిలో రెచ్చిపోయారు.

ఏమో ఆయన జ్ఞాపకశక్తి భేషుగ్గా ఉండి, వారి పార్టీకి గ్రహస్థితులు కూడా బాగుంటే– మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు అన్నంత పనీ చేస్తారేమో! ఈ మాటలు అనిపించుకున్న ఎస్ఐను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారేమో మనకు తెలియదు. కానీ, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఆ ఎస్సైకు, పొన్నవోలుతోగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ తో గానీ వ్యక్తిగత ద్వేషాలు, కక్షలు ఏమైనా ఉన్నాయా? అతని ఖర్మ కాలి, తన ఉద్యోగ బాధ్యతల్ని అప్పటికి మంగళగిరిలో నిర్వర్తించాల్సి రావడమే ప్రమాదంగా మారుతున్నదన్నమాట. నాయకుల మధ్య కక్షలు బాగానే ఉంటాయి. కానీ.. మధ్యలో పోలీసులు బలైపోతుంటారనడానికి ఇది చిన్న ఉదాహరణ!

కుక్కల విద్యాసాగర్– కాదంబరి జత్వానీ ఉదాహరణను తీసుకుందాం. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి ప్రభుత్వం వారిని టార్గెట్ చేసినదంటే, దానికి సంబంధించిన మూలాలు.. పాత ప్రభుత్వంతో అనుచిత స్నేహబంధం కలిగి ఉండడంలోనే ఉంది. అధికారంలో ఉన్న నాయకుల ప్రాపకం కోసం, వారి కళ్లలో ఆనందం చూడడం కోసం గీత దాటి ప్రవర్తించడం తప్ప వారు చేసిన తప్పు మరొకటి లేదు. ఇవాళ వాళ్ల ఉద్యోగాలే ప్రమాదంలో పడిన పరిస్థితి. ఫలానా పార్టీ పోలీసులను వేధిస్తున్నదని, ఫలానా పార్టీ వాడుకుని వదిలేస్తున్నదని అనలేం. ఆ విషయంలో అన్ని పార్టీలు కూడా సమానంగానే వ్యవహరిస్తాయి.

ఇది కేవలం పొన్నవోలు వ్యాఖ్యల నేపథ్యంలో కలిగే ఆవేదన ఎంత మాత్రమూ కాదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వారు ఎంత ఘోరంగా వ్యవహరించారో.. పోలీసుల్ని ఏ స్థాయిలో తీవ్రంగా దూషించారో గత అయిదేళ్లలో, అంటే జగన్ పరిపాలన సాగిన రోజుల్లో గమనించాం! నారా లోకేష్ తన పాదయాత్ర సాగుతున్న రోజుల్లో దాదాపుగా ప్రతిచోటా కూడా పోలీసులతో సున్నం పెట్టుకుంటూనే ముందకు సాగారు. పోలీసుల్ని హెచ్చరించడానికే ఆయన ప్రధానంగా రెడ్ బుక్ అనే పదాన్ని పదేపదే వాడుతూ వచ్చారు. ‘మీ పేర్లన్నీ రెడ్ బుక్ లో రాస్తున్నా.. మీ అందరి భరతం పడతా’ అంటూ లోకేష్ హెచ్చరించినది ప్రధానంగా పోలీసులనే!

నారా చంద్రబాబునాయుడు కూడా పోలీసుల పట్ల ఎంతటి తీవ్ర పదజాలంతో రెచ్చిపోతూ మాట్లాడారో.. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి వీడియోలను చూస్తే అర్థమవుతుంది. అంతో ఇంతో వీరిలో పవన్ కల్యాణ్ కాస్త బెటర్. ఆయన నర్మగర్భంగా.. పోలీసులంటే నాకు గౌరవం ఉంది. కానీ మీరు దారితప్పవద్దు అన్నట్టుగా వారిని నిందించేవారు.

అధికారంలో లేని పార్టీలకు చెందిన నాయకులందరూ ముందుగా తమ ఆవేశాన్ని ఆగ్రహాన్ని చూపించేది పోలీసుల మీదనే. అధికారంలో ఉన్న పార్టీకి లోబడి, ఆ పార్టీ నాయకుల ఆదేశాలను శిరసావహించి, వారు ఏం చెబితే అది చేయడం తప్ప.. మన దేశంలో పోలీసులకు స్వయం నిర్ణయాధికారం ఉందా? వారి ప్రమేయం లేని వ్యవహారాలకు వారిని కూడా బాధ్యులుగా చేస్తూ నిందించడం, టార్గెట్ చేయడం ఎంతవరకూ సబబు అనేదే ప్రశ్న!

వేరే గత్యంతరం లేదా?

పోలీసు వ్యవస్థ సెటప్ లోనే విధేయత అనేది నరాల్లో కూరబడుతుందేమో అనిపిస్తుంది మనకు. పోలీసు శిక్షణ ఇవ్వడంలోనే వారికి తమ ‘పైవారి’ పట్ల అతి భక్తిని ప్రదర్శించడాన్ని అలవాటు చేస్తారు. సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ‘పైవారికి పైవారు’గా ఉంటారు. అలాంటివారి పట్ల మరెంతగొప్ప విధేయత చూపించాలో వారికి ఎవ్వరూ నేర్పవలసిన అవసరం లేదు. అయితే రాజకీయ నాయకులు ఏం చెబితే అది చేయడం తప్ప పోలీసులకు వేరే గత్యంతరం లేదా? అనేది కీలకమైన సంగతి. మరి పోలీసులు ఎందుకు అంతగా హద్దుమీరి ప్రవర్తిస్తుంటారనేది చర్చ సాగాలి.

ఒక రకంగా చెప్పాలంటే గత్యంతరం లేదనే చెప్పాలి. కేవలం రూల్ బుక్ ప్రకారం మాత్రమే వ్యవహరిస్తాం.. చట్టం ప్రకారం మాత్రమే నడుచుకుంటాం.. అనుచితమైన ఏ ఆదేశాలను కూడా పాటించేది లేదు.. అని చెప్పగల దమ్మున్న పోలీసులు కూడా మనకు వ్యవస్థలో కనిపిస్తారు. కానీ వారందరూ చాలా వరకు అప్రాధాన్య పోస్టుల్లో కొలువు వెళ్లదీస్తుంటారు. తమకు జీహుజూర్ అనే వారిని కీలక పోస్టుల్లో నియమించుకునే రాజకీయ నాయకులు, తమ మాట వినని, తమకు కొరుకుడు పడని వారిని దిక్కూమొక్కూలేని సీట్లలో కూచోబెడుతుంటారు.

కానీ ఏదో సినిమాలో డైలాగు మాదిరిగా ‘పోలీసు ఊరూ, పోస్టూ మారవచ్చు గానీ ఎక్కడికెళ్లినా పోలీసుగానే ఉంటాడు’! ఈ స్పృహతో తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకుండా.. నిజాయితీగా వ్యవహరించే అధికారులు, పోలీసులు చాలామందే ఉంటారు. కానీ చాలా మందికి అలా సాధ్యం కాదు. పోలీసులకు కూడా వారి వ్యక్తిగత అవసరాలుంటాయి. తాము స్థిరపడిన ఊర్లలో, దగ్గరి ప్రాంతాల్లో మాత్రమే ఉద్యోగం చేయాలనే ఆశ ఉంటుంది. కనీసం అలాంటి చిన్న చిన్న కోరికలు తీరాలన్నా కూడా వారు ‘యెస్ బాస్’ అనే టైపు కాకపోతే కష్టం. అలాగని పోలీసులందరూ తమ తమ వ్యక్తిగత అవసరాలు, చిన్నపాటి స్వార్థాల కోసం మాత్రమే.. అధికారంలోకి నాయకులకు గులాంగిరీ చేస్తెున్నారా? అదొక్కటే కారణమా? అలా అని అనలేం.

దారి తప్పిన వాళ్లూ అనేకులు!

పోలీసులందరూ నిజాయితీగా ఉంటూ గతిలేకమాత్రమే అధికారంలోని నాయకులకు లోబడిపోతారనేది అందరి విషయంలోనూ నిజం కాదు. నాయకులకంటె దుర్మార్గమైన బుద్ధులతో చెలరేగిపోతూ తమంత తాముగా నేతల ప్రాపకం కోరుకుంటూ బతికే అధికారులు కూడా ఉంటారు. దారితప్పి వ్యవహరించేలా.. వీళ్లే నాయకుల్లాగా చెలరేగేలా అనేక కారణాలు ప్రేరేపిస్తుంటాయి.

మొదటి కారణం అక్రమార్జనల మీద అత్యాశ. పోలీసు ఉద్యోగం అంటేనే అడ్డగోలుగా సంపాదించుకోవచ్చుననే కోరికతో వచ్చే వారు కొందరుంటారు. నాయకులకు లోబడి దారితప్పే వారిలో వీరు ముందంజలో ఉంటారు. అధికారంలో ఉన్న నాయకులకు కొమ్ముకాస్తూ, వారు చెప్పినట్టల్లా చేస్తూ ఉంటే గనుక.. తాము కూడా విచ్చలవిడిగా సంపాదించుకోవచ్చునని.. నాయకులు వందల కోట్లు స్వాహా చేసేస్తూ ఉంటే.. తాము పదుల కోట్లు అయినా వెనకేసుకోలేకపోతామా? అని ఆలోచించేవాళ్లు అనేకమంది ఉంటారు. వీరికి అధికారంలో ఉన్న నాయకులకు గులాంగిరీ చేయడం ఒక్కటే తెలుసు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నదనే పట్టింపు పెద్దగా ఉండదు. నిన్నటిదాకా ఒక పార్టీకి కార్యకర్తలాగా పనిచేసి, అధికారం మారగానే.. వీరు సులువుగా ఆ పార్టీ జెండాలు పట్టుకోగలరు. అందుకు సిగ్గుపడరు. తమ స్వార్థం, తమ సంపాదన తప్ప వీరికి మరొకటి పట్టదు.

ఇతర కారణాల వల్ల దారితప్పే పోలీసులు కొందరుంటారు. వీరికి కులాభిమానం, ప్రాంతీయాభిమానం, ఇతర రకాల దురభిమానాలు అనేకం ఉంటాయి. అధికారంలో ఉన్న ముఖ్యులు తమ కులం వారే అనే ఆలోచనతో వారికి కొమ్ముకాయడంలో వీరు తరిస్తుంటారు. తమ ప్రాంతం వారే అనే భావనతో వారికి అనుకూలంగా చట్టవ్యతిరేక పనులు చేస్తుంటారు.

మొత్తంగా చూసినప్పుడు రాజకీయ నాయకుల మాదిరిగానే వ్యవహరించే పోలీసుల్లో అత్యధికులు అనివార్య పరిస్థితుల వల్ల కాకుండా, ఇలా స్వార్థం అత్యాశ దురభిమానాలతో కొమ్ముకాసే వారే అయి ఉంటారు. అడ్డదారుల్లో సంపాదించుకోవడం.. కోట్లు గడించడం అనేది.. వారి బేసిక్ లక్షణాల వల్ల పొందే అదనపు లాభాలు మాత్రమే.

ప్రజల్లో పలుచన అవుతున్నారిందుకే..

పోలీసులు ఇలా దారితప్పి వ్యవహరిస్తున్నమాట నిజం. లెక్కలు తీస్తే.. దారితప్పుతున్న వారందరూ కలిపి సగం మంది కూడా ఉండకపోవచ్చు. కానీ.. వారు ఎక్కువగా వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తుంటారు. అందువల్లనే పోలీసులు అంటేనే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతూ ఉంటుంది. నాయకులకు కొమ్ముకాసే వారిగా ప్రజలు వారి గురించి హేళనగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి విమర్శలు, నిందలు కేవలం కొందరు పోలీసులకు మాత్రమే కాదు. యావత్ పోలీసు వ్యవస్థకే తగులుతుంటాయి.

ప్రారంభంలో ఒక మాట చెప్పుకున్నాం. ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల ఎదుట రెండే ఆప్షన్లు ఉంటాయి. ‘ఒకటి- లొంగిపోవడం, రెండు- ఆగ్రహానికి గురై బలిపశువు కావడం!’ అని! కానీ నిజం చెప్పాలంటే రెండు ఆప్షన్లుగా కనిపించినా.. ఇవి ఒక ఆప్షన్ కిందనే లెక్క! ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లొంగిపోయిన వారు– రెండో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బలిపశువులుగా మారుతుంటారు. అంటే పోలీసులకు ఉండే ఏకైక ఆప్షన్ రాజకీయ నాయకుల నాయకుల వికృత కక్షల క్రీడలో బలిపశువులుగా మారడం మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో.. పోలీసుల గురించి జాలి చూపించడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు. పాపం.. పోలీస్ అనకుండా ఉండలేం.
పోలీసుల ఆత్మగౌరవం పదికాలాల పాటు చల్లగా ఉండుగాక!

..ఎల్. విజయలక్ష్మి

23 Replies to “పాపం.. పోలీస్!”

  1. నీ ధేడ్ దిమాకు తెలివితేటలు ఏమాత్రం తగ్గలేదు రా గూట్లే ఆంధ్ర… మీ మూర్ఖు శిఖామని, విమూఢాత్మా 11 మోహన్ గాడు పూసిపోయిన గజ్జి రోగం రా ఇదంతా… వాడూ వాడి వందిమాగధుల దరిద్రమే ఇదంతా… నువ్వు ఏవేవో కూని రాగాలు తీసి మిగిలిన అందరికీ అంటిస్తున్నావు..

  2. మా అన్నయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల మీద నమ్మకం లేదని చెప్తాడు..

    మా అన్నయ్య అధికారంలో ఉన్నప్పుడు మా పోలీసులు చాలా మంచి వాళ్ళు సిబిఐ వారికన్నా బాగా పనిచేస్తారని చెప్పాడు..

  3. ఈ ప్రవచనాలు గత 5 సంవత్సరాలుగా చెప్పివుంటే మీ పాద ధూళి ని నా నెత్తిన చల్లుకునేవాడిని అక్కా…..

  4. ///కుక్కల విద్యాసాగర్- కాదంబరి జత్వానీ ఉదాహరణను తీసుకుందాం. ఇప్పటి ప్రభుత్వం వారిని టార్గెట్ చేసినదంటే, దానికి సంబంధించిన మూలాలు.. పాత ప్రభుత్వంతో అనుచిత స్నేహబంధం కలిగి ఉండడంలోనే ఉంది. అధికారంలో ఉన్న నాయకుల ప్రాపకం కోసం, వారి కళ్లలో ఆనందం చూడడం కోసం గీత దాటి ప్రవర్తించడం తప్ప వారు చేసిన తప్పు మరొకటి లేదు.////

    .

    ఇదెమిటి just గీత దాటి ప్రవర్తించారా? మీరు ఎదొ చాలా చిన్న తప్పు చెసినట్టు తెలికగా తీసి వెస్తున్నరు?

    .

    అసలు రాజకీయల తొ ఎ మాత్రం సంబందం లెని ఒక నటిని,

    ఒక రాజకీయ పార్టి పెద్దలు చెప్పారు అని,

    పొలీసులు పెద్ద బాసులె స్వయంగా రంగం లొకి దిగి,

    అమె మీద దొంగ కెసులు పెట్టి, ముంబై నుండి ఇక్కడికి తెచ్చి,

    Bail కూడా రాకుండా చెసి, అమె తల్లి దంత్రులని సైతం నిర్బందించి, వేదించి

    విదెశాలలొ వ్యపారం చెసుకుంటున్న తమ్ముడిని కూడా వదలకుండా,

    lookout నొటీసులు జారిచెసి, బ్లాక్ మైల్ చెసి,

    ఆమె మొబైల్ లొ సాక్షాదారాలు కూడా చెరిపెసి,

    అమే ముంబై కెసులొ సమాదానం కూడా ఇవ్వకుండా చెసి,

    ఆ కెసు కొట్టి వేశాక ఇక అమె ఆ కెసు వైపు కూడా వెల్లకుండా భయపెట్టి,

    కాళీ పెజీల మీద సంతకాలు కూడా తీసుకొని వదిలి,

    మన అసలు ప్రజాస్వమ్యం లొనె ఉన్నామా అనె సంధెహం కలిగిస్తూ

    ఒక అమ్మాయి మీద అత్యంత క్రూరంగా, కర్కశంగా ప్రవర్తిస్తె..

    అది మీకు just గీత తాటి నట్టు అని పిస్తుందా?

    .

    అది క్రిందటి ప్రబుతం చెసిన లెక్కలెని తనానికి, మానవ హక్కుల ఉల్లంగనకి, వ్యవస్తల పతనానికి, ఉన్మాదానికి ఒక మచ్చుతునక! just గీత తాటి నట్టు కాదు

  5. ///కుక్కల విద్యాసాగర్- కాదంబరి జత్వానీ ఉదాహరణను తీసుకుందాం. ఇప్పటి ప్రభుత్వం వారిని టార్గెట్ చేసినదంటే, దానికి సంబంధించిన మూలాలు.. పాత ప్రభుత్వంతో అనుచిత స్నేహబంధం కలిగి ఉండడంలోనే ఉంది. అధికారంలో ఉన్న నాయకుల ప్రాపకం కోసం, వారి కళ్లలో ఆనందం చూడడం కోసం గీత దాటి ప్రవర్తించడం తప్ప వారు చేసిన తప్పు మరొకటి లేదు.////

    .

    ఇదెమిటి just గీత దాటి ప్రవర్తించారా? మీరు ఎదొ చాలా చిన్న తప్పు చెసినట్టు తెలికగా తీసి వెస్తున్నరు?

    .

    అసలు రాజకీయల తొ ఎ మాత్రం సంబందం లెని ఒక నటిని,

    ఒక రాజకీయ పార్టి పెద్దలు చెప్పారు అని,

    పొలీసులు పెద్ద బాసులె స్వయంగా రంగం లొకి దిగి,

    అమె మీద దొం.-.గ కెసులు పెట్టి, ముంబై నుండి ఇక్కడికి తెచ్చి,

    Bail కూడా రాకుండా చెసి, అమె తల్లి దంత్రులని సైతం నిర్బందించి, వేదించి

    విదెశాలలొ వ్యపారం చెసుకుంటున్న తమ్ముడిని కూడా వదలకుండా,

    lookout నొటీసులు జారిచెసి, బ్లా.-.క్ మైల్ చెసి,

    ఆమె మొబైల్ లొ సాక్షాదారాలు కూడా చెరిపెసి,

    అమే ముంబై కెసులొ సమాదానం కూడా ఇవ్వకుండా చెసి,

    ఆ కెసు కొట్టి వేశాక ఇక అమె ఆ కెసు వైపు కూడా వెల్లకుండా భయపెట్టి,

    కాళీ పెజీల మీద సంతకాలు కూడా తీసుకొని వదిలి,

    మన అసలు ప్రజాస్వమ్యం లొనె ఉన్నామా అనె సంధెహం కలిగిస్తూ

    ఒక అమ్మాయి మీద అత్యంత క్రూరంగా, కర్కశంగా ప్రవర్తిస్తె..

    అది మీకు just గీత తాటి నట్టు అని పిస్తుందా?

    .

    అది క్రిందటి ప్రబుతం చెసిన లెక్కలెని తనానికి, మానవ హక్కుల ఉల్లంగనకి, వ్యవస్తల పతనానికి, ఉన్మాదానికి ఒక మచ్చుతునక! just గీత తాటి నట్టు కాదు

    1. అది క్రిందటి ప్రబుతం చెసిన లెక్కలెని తనానికి, మానవ హక్కుల ఉల్లంగనకి, వ్యవస్తల పతనానికి, ఉన్మాదానికి ఒక మచ్చుతునక! just గీత తాటి నట్టు కాదు.

      .

  6. ///కుక్కల విద్యాసాగర్- కాదంబరి జత్వానీ ఉదాహరణను తీసుకుందాం. ఇప్పటి ప్రభుత్వం వారిని టార్గెట్ చేసినదంటే, దానికి సంబంధించిన మూలాలు.. పాత ప్రభుత్వంతో అనుచిత స్నేహబంధం కలిగి ఉండడంలోనే ఉంది. అధికారంలో ఉన్న నాయకుల ప్రాపకం కోసం, వారి కళ్లలో ఆనందం చూడడం కోసం గీత దాటి ప్రవర్తించడం తప్ప వారు చేసిన తప్పు మరొకటి లేదు.////

    .

    ఇదెమిటి just గీత దాటి ప్రవర్తించారా? మీరు ఎదొ చాలా చిన్న తప్పు చెసినట్టు తెలికగా తీసి వెస్తున్నారు?

    .

    అసలు రాజకీయల తొ ఎ మాత్రం సంబందం లెని ఒక నటిని,

    ఒక రాజకీయ పార్టి పెద్దలు చెప్పారు అని,

    పొలీసులు పెద్ద బాసులె స్వయంగా రంగం లొకి దిగి,

    దొంగ పత్రాలు స్రుష్టించి, అమె మీద దొం.-.గ కెసులు పెట్టి,

    ముంబై నుండి ఇక్కడికి తెచ్చి, Bail కూడా రాకుండా చెసి,

    అమె బ్యంక్ అక్కొంట్ అన్ని ఫీజ్ చెయించి,

    అమె తల్లి దంత్రులని సైతం నిర్బందించి, వేదించి

    విదెశాలలొ వ్యపారం చెసుకుంటున్న తమ్ముడిని కూడా వదలకుండా,

    lookout నొటీసులు జారిచెసి, బ్లా.-.క్ మైల్ చెసి,

    ఆమె మొబైల్ లొ సాక్షాదారాలు కూడా చెరిపెసి,

    అమే ముంబై కెసులొ సమాదానం కూడా ఇవ్వకుండా చెసి,

    ఆ కెసు కొట్టి వేశాక ఇక అమె ఆ కెసు వైపు కూడా వెల్లకుండా భయపెట్టి,

    కాళీ పెజీల మీద సంతకాలు కూడా తీసుకొని వదిలి,

    మన అసలు ప్రజాస్వమ్యం లొనె ఉన్నామా అనె సంధెహం కలిగిస్తూ

    ఒక అమ్మాయి మీద అత్యంత క్రూరంగా, కర్కశంగా ప్రవర్తిస్తె..

    అది మీకు just గీత తాటి నట్టు అని పిస్తుందా?

    .

    అది క్రిందటి ప్రబుతం చెసిన లెక్కలెని తనానికి, మానవ హక్కుల ఉల్లంగనకి, వ్యవస్తల పతనానికి, ఉన్మాదానికి ఒక మచ్చుతునక! just గీత తాటి నట్టు కాదు

  7. ఈ ఆర్టికల్ రేపు రాసుకుని ఈరోజు అమరవీరుల దినోత్సవం కాబట్టి దేశానికి మంచి చేసిన పోలీసులు గురించి ఏమన్నా రాసుంటే బాగుండేది.

  8. పొన్నవోలు, లోకేష్, చంద్ర బాబు విషయాలు రాసావ్….మరి జగన్ , ఓయ్ మధుసూధన్ రావు బెదిరింపు మర్చిపోయావా?

    1. అది కూడా కవర్ చేసేలోపు కళ్ళల్లో కులం నలక పడి కళ్లు కొద్దిగా చెమర్చి..అదన్న మాట సంగతి

  9. అయ్యా GA ! AP లో ఎప్పుడు పోలీస్ తో పబ్లిక్ కి ప్రాబ్లెం లేదు వాళ్ళకి వీళ్ళ మీద ఈ సమస్య లేదు.. 
    మనం ఎప్పుడు అధికారం లో కి వచ్చామో అందరికి సమస్య వచ్చింది.
  10. పంచె రెడ్డి కుటుంబానికి ఘోరమయిన చరిత్ర ఉంది, దాన్నేదో ఆయన సుపుత్రుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. చెప్పాలంటే ఈ దేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ కాదు, సై కో జగన్. వీడి పాపాలు రాసి రాసి చిత్రగుప్తుడికే చేతులు నొప్పెడత్యనుకుంటున్నాను..

Comments are closed.