రామతీర్ధం రాముడు సిద్ధమవుతున్నాడు

ఆస్తిక జనులకే కాడు అన్ని మతాల వారినీ కలత పెట్టించిన సంఘటన ఈ మధ్యన  రామతీర్ధాలులో జరిగింది. బోడికొండ మీద ఉన్న కోదండరాముడి  శిరస్సుని దుండగులు వేరు చేసి మహా ఘాతుకానికి ఒడిగట్టారు. Advertisement…

ఆస్తిక జనులకే కాడు అన్ని మతాల వారినీ కలత పెట్టించిన సంఘటన ఈ మధ్యన  రామతీర్ధాలులో జరిగింది. బోడికొండ మీద ఉన్న కోదండరాముడి  శిరస్సుని దుండగులు వేరు చేసి మహా ఘాతుకానికి ఒడిగట్టారు.

అయితే దీని మీద జరిగిన రాజకీయ రాద్ధాంతం అంతా ఇంతా కాదు, టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఆలయం వద్దకు చేరి ఆందోళన చేశాయి. దాంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇదిలా ఉంటే ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఇపుడు కోదండ రాముడి విగ్రహాన్ని కూడా తయారు చేయించే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఒక్క రాముడే కాదు సీత, లక్ష్మణస్వామి సమేతంగా నిండు విగ్రహాలతో కోదండస్వామి వారి ఆలయంలో మరో  పది రోజులల వ్వవధిలోనే కొలువు తీరనున్నాయి.

రామతీర్థం  ఆలయం కోసం తిరుపతిలో విగ్రహాలు సిద్దమవుతున్నాయి.  ధ్వంసమైన రాముడి విగ్రహం తో పాటు సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలు అక్కడ తయారు చేస్తున్నారు.  తిరుపతిలోని టీటీడీ కి చెందిన సంప్రదాయ ఆలయ నిర్మాణం శిల్ప సంస్థలో విగ్రహాల తయారీ జరుగుతోంది. 

కంచి నుంచి రాయిని తెప్పించి విగ్రహాలను శిల్పులు పవిత్రంగా  తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే వీటి  పనులు ప్రారంభమయ్యాయి.  పదిరోజుల్లో మూడు విగ్రహాలను  రామతీర్ధాలుకు తీసుకువస్తారని  అధికారులు చెబుతున్నారు. మొత్తానికి కోదండరాముడు కోటి కాంతులతో వెలిగే రోజు కోసం ఆస్తిక జనులు ఎదురు చూస్తున్నారు.

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు 

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు