సంఘవి…ఒకప్పటి హీరోయిన్. అమరావతి అనే తమిళ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన ఈ అందాల భామ…ఆ తర్వాత దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సంఘవి అసలు పేరు కావ్య. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన 'తాజ్ మహల్' సినిమాతో టాలీవుడ్లో ఆమె అడుగు పెట్టారు. మంచి హిట్ టాక్ రావడంతో సహజంగానే సంఘవికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమా సంఘవికి తిరుగులేని పేరు తెచ్చి పెట్టింది.
దీంతో ఆమె కెరీర్ టర్న్ అయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో ఆమె నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. టాలీవుడ్లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ, ఎన్టీఆర్, రాజశేఖర్, శ్రీకాంత్ తదితర ప్రముఖ హీరోల సరసన నటించి తెలుగింటి ఆడపడచులా మారిపోయారు. ఈటీవీలో పాపులర్ ప్రోగ్రామ్ జబర్దస్త్ కార్యక్రమానికి కొంత కాలం జడ్జిగా కూడా వ్యవహరించారు.
దాదాపు 15 ఏళ్ల పాటు దక్షిణాది చిత్రాల్లో నటించిన ఆమె, ఆ తర్వాత నెమ్మదిగా సైడ్ అయ్యారు. సంఘవి 39 ఏళ్ల వయసులో 2016లో వెంకటేశ్ అనే ఐటీ పారిశ్రామికవేత్తను పెళ్లాడారు. పెళ్లైన మూడేళ్లకు ఆమె పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. కూతురితో దిగిన 42 ఏళ్ల సంఘవి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కూతురి పుట్టకతో మరోసారి సంఘవి వార్తల్లో వ్యక్తిగా నిలబడటం సంతోషకరం.