ఆల్రెడీ శాసనసభ నిర్ణయాన్ని అడ్డుకుని.. మాజీలు అయిపోయే పరిస్థితుల్లోకి పడిపోయారు మండలి సభ్యులు. అయితే వీరి మాటలు మాత్రం తగ్గడం లేదు. సినిమా చూపిస్తారట! పెద్దమనుషులు అయిన నేతలు ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటో! శాసనమండలిలో సభ్యులైన నేతలు.. ముఖ్యమంత్రిని పట్టుకుని సినిమా చూపిస్తాం.. అంటూ వ్యాఖ్యానించడం సదరు నేతల స్థితిని చాటుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
మండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై అందులోని తెలుగుదేశం పార్టీ సభ్యులు గరం అయిపోయారు. తాము ఇప్పటికే జగన్ కు ఝలక్ ఇచ్చినట్టుగా, ఇంకా తమ వద్ద అస్త్రాలున్నాయని వారు చెప్పుకొచ్చారు. వాటితో జగన్ కు సినిమా చూపిస్తాం.. అని వారు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలా టీ కొట్టు సవాళ్ల తో తెలుగుదేశం ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి మీద అనుచితంగా మాట్లాడారు.
ఈ మాటల్లో మండలి రద్దు ఫ్రస్ట్రేషన్ కూడా వీరిలో ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మండలి రద్దు అప్పుడే అయిపోలేదని వీరు అంటున్నారు. ఇక రొటీన్ గా తెలుగుదేశం నేతలు జగన్ విషయంలో మాట్లాడే మాటలన్నీ మాట్లాడేసి వీళ్లు తమ అక్కసు తీర్చుకున్నట్టుగా వ్యవహరించారు. ఈ ప్రసంగాల్లో జగన్ పై కేసులున్నాయని ఆయన ఎలా మండలిని రద్దు చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ దీపక్ రెడ్డి మీద హైదరాబాద్ లో చాలా కేసులున్నాయి. 163 కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జాకు సంబంధించి దీపక్ రెడ్డి మీద హైదరాబాద్ లో కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో దీపక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కూడా ప్రకటించారు. ఈయన మండలిలో సభ్యుడు.. ఈయన గారు కేసుల గురించి మాట్లాడటం భలే ఉందిలే!