కేటీఆర్ ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం ముందుకురికింది!

కేటీఆర్ ను ఎట్టి పరిస్థితిలోనూ వదలకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

కేటీఆర్ ను ఎట్టి పరిస్థితిలోనూ వదలకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హై కోర్టు కొట్టేసి విచారణ సంస్థలకు మార్గం సుగమం చేసింది.

దీంతో ఏసీబీ, ఈడీ దూకుడు పెంచాయి. ఏసీబీ ముందు తొమ్మిదో తేదీన, ఈడీ ముందు 16 న కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్టు అవుతాడని వార్తలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

ముఖ్యంగా బంజారాహిల్స్ నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి హరీశ్ రావు, కవిత, మదుసూదనచారి, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. మరోవైపు కేటీఆర్ లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు.

కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వస్తే.. ఏం చేయాలి అనే దానిపై బీఆర్ఎస్ నేతలు లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఏసీబీ ఏం చేస్తుందనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని నిన్న ఉదయమే కేటీఆర్ మీడియాతో చెప్పటం గమనార్హం. ఆయన చెప్పినట్టుగానే ఏసీబీ అధికారులు సాయంత్రానికి ఆయన నివాసంలో సోదాలకు ఉపక్రమించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులు ముట్టజెప్పారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సమయంలో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చింది. విచారణకు పిలిచి ఆయన్ని అరెస్ట్ చేయవచ్చన్న భయం గులాబీ పార్టీ నాయకుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు.

ఈ విషయమై కేటీఆర్ తన లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. ఆయన ఇంకా చర్చలు జరుపుతుండగానే అప్రమత్తమైన ప్రభుత్వ సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది. హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలనుకున్న కేటీఆర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవియట్ పిటిషన్ తో ఆయనకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

తమ వాదనకు వినకుండా కేటీఆర్ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కేవియట్ పిటిషన్ వేసింది. కాబట్టి ఈ కేసులో ప్రభుత్వం ముందుగా తన వాదనలు వినిపించే అవకాశం కలుగుతుంది. కేవియట్ పిటిషన్ వేయడం వ్యూహాత్మకమైన చర్య అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇది కేసు విచారణలో కీలక పాత్ర పోషిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కేవియట్ దాఖలు చేయడం వల్ల కేటీఆర్ తరపున పిటిషన్ దాఖలైన సమయంలో మధ్యంతర ఉత్తర్వులు లేదా స్టే ఇచ్చే ముందు తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినడం తప్పనిసరి అవుతుంది. ఏకపక్ష తీర్పు రాకుండా ఈ కేవియట్ ద్వారా నివారించే అవకాశం ఉంటుంది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి కేటీఆర్ ప్రయత్నిస్తే కేవియట్ పిటిషన్ ద్వారా తక్షణమే జారీ అయ్యే అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించిన తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

10 Replies to “కేటీఆర్ ఆలోచిస్తుంటే.. ప్రభుత్వం ముందుకురికింది!”

  1. కుటుంబం అంతా మూర్తీభవించిన అహంకారులు మాదిరి వుంటారు.. ఎలా try చేసినా మీ మీద, ఇక్కడి జగ్గా..డి మీద సానుభూతి అనేది ఇక అసంభవం…అయినదానికి,కాని దానికి మా సీబీన్ కి మీరు,మీ అయ్యలు చేసిన పరాభావాలకి దేవుల్ల రూపంలో జనాలు వేసిన శాశ్వత శిక్ష.తనివి తీరా అనుభవించండి.

    1. అబ్బో…. మన జగనన్న చెప్పినట్టు సౌమ్యుడు, మంచివాడు జోక్ లాగ వుంది

  2. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి వర్క్

Comments are closed.